సంబంధాలలో అసూయను ఎలా ఎదుర్కోవాలి

How to jealousy ben blennerhassett unsplash

అసూయ మన స్నేహితులు మరియు భాగస్వాములు మనల్ని వదిలేస్తారని ఒక భ్రమను కలిగిస్తుంది, ఇది మన సంబంధాలకు భంగం కలిగించి మన మనశ్శాంతిని పూర్తిగా పోగొట్టేస్తుంది. మనం ఎంత అసూయతో మరియు స్వార్ధంతో ఉంటే మన వాళ్లు అంత దూరం అవుతారు. మనందరికీ ఎంతో మందిని ప్రేమించగలిగే సామర్థ్యం ఉందని గ్రహించడం అసూయను అధిగమించడానికి సహాయపడుతుంది. మన స్నేహితులు, మనం చేసే పని, ఆటలు మొదలైన వాటిపై ప్రేమను కలిగి ఉండటం వల్ల మన భాగస్వామికి మనపై లేదా తన పట్ల మనకు ఉన్న ప్రేమ తగ్గదు; వాస్తవానికి, ఇది దానిని ఇంకా పెంచుతుంది.

అసూయ మరియు కుళ్లు

అసూయ అనేక విధాలుగా ఉంటుంది. మనం ఒంటరిగా ఉండి, ఒక జంటను చూసి అసూయ పడుతుంటే లేదా ఇంతక ముందే సంబంధంలో ఉన్న వ్యక్తి మనకు నచ్చితే, అది నిజంగా కుళ్లే. ఆ వ్యక్తి యొక్క ఆప్యాయత మరియు శ్రద్ధను పొందాలని మనం కోరుకుంటాము, లేదా మనకు అలాంటి ప్రేమ సంబంధం ఉండాలని కోరుకుంటాము. ఈ రెండు సందర్భాల్లో, మనకు లేని దాని గురించి కుళ్లు వస్తుంది. ఇది అసమర్థత మరియు ఇతర ఆత్మగౌరవ సమస్యలను తెచ్చిపెడుతుంది.

సంబంధాలలో అసూయ

మనం సంబంధాలలో ఉన్నప్పుడు ఈ అసూయ ఇంకా బాగా ఇబ్బంది పెడుతుంది. వేరొక వ్యక్తి దగ్గర ఉన్నవాటిపై దృష్టి పెట్టకుండా, ఇది మన భాగస్వామి లేదా స్నేహితుడు మరియు మూడవ వ్యక్తిపై దృష్టి పెడుతుంది; అప్పుడు మనం సాధారణంగా ఆ మూడవ వ్యక్తితో ఉన్న ప్రత్యేక సంబంధాన్ని కోల్పోతామని భయపడతాము. ఏదైనా శత్రుత్వం లేదా నమ్మక ద్రోహం గురించి మనం అసహనాన్ని కలిగి ఉంటాము. ఉదాహరణకు, మన భాగస్వామి వారి స్వంత స్నేహితులతో ఎక్కువ సమయం గడిపితే లేదా మనం లేకుండా ఫంక్షన్లకు హాజరైతే మనకు అసూయ కలుగుతుంది. ఇంట్లోకి ఒక కొత్త బాబు లేదా పాప వచ్చినప్పుడు కుక్కకి కూడా ఈ రకమైన అసూయే కలుగుతుంది. ఈ రకమైన అసూయలో అభద్రతా మరియు అపనమ్మకం లాంటి బలమైన అంశాలతో పాటు కోపం మరియు శత్రుత్వం లాంటివి కూడా ఉంటాయి.

మనం అభద్రతా భావంతో ఉంటే, మన భాగస్వామి లేదా స్నేహితుడు వేరే వాళ్లతో ఉన్నప్పుడు, మనకు అసూయ కలుగుతుంది. ఎందుకంటే మన సొంత-విలువ గురించి మనకు తెలియదు, మరియు అవతలి వ్యక్తి మన పట్ల చూపే ప్రేమ గురించి అభద్రతా భావం మొదలయ్యి మన భాగస్వామిని నమ్మకుండా ఉండేలా చేస్తుంది. మనల్ని వాళ్లు వదిలేస్తారేమో అని భయపడతాం. మన భాగస్వామి లేదా స్నేహితుడు వేరే వాళ్లతో సమయం గడపకపోయినా ఈ భయం ఉండే అవకాశం ఉంటుంది. విపరీతమైన స్వాధీనతతో, వారు ఏ క్షణంలోనైనా మనల్ని విడిచి వెళ్లిపోతారని భయపడతాం.

అసూయను జయించడం

అసూయను ఎదుర్కోవటానికి, మన హృదయానికి ప్రతి ఒక్కరినీ ప్రేమించే సామర్థ్యం గురించి తెలుసుకోవాలి - ఇది మన బౌద్ధమత స్వభావం యొక్క ఒక అంశం. ఈ నిజాన్ని మనం తెలుసుకున్నప్పుడు, ఒక వ్యక్తిని ప్రేమించడం అంటే ఇతరులను ప్రేమించకుండా ఉండటం కాదని తెలుసుకుని అసూయను అధిగమించడానికి ఇది మనకు సహాయపడుతుంది. మన గురించి ఆలోచించి మన హృదయాలను ఎంతో మంది కోసం ఎలా వాడగలమో ఆలోచించండి. ఒక ఉదార హృదయంలో మన భాగస్వామి, స్నేహితులు, పిల్లలు, పెంపుడు జంతువులు, తల్లిదండ్రులు, దేశం, ప్రకృతి, దేవుడు, అభిరుచులు మొదలైన వాటిపై మనకు ప్రేమ ఉంటుంది. ప్రేమ ప్రత్యేకమైనది కాదు కాబట్టి వాళ్ళందరి కోసం మన హృదయాల్లో ఒక చోటు ఉంటుంది. మన ప్రేమ మరియు మంచి సంబంధం కలిగి ఉండటానికి, ప్రతి వస్తువుకు మరియు ప్రతి మనిషి పట్ల మన భావాలను వ్యక్తీకరించడానికి మనం పరిపూర్ణంగా సామర్థ్యాన్ని కలిగి ఉన్నాము. అవును, మన భార్యకు లేదా భర్తకు లేదా తల్లిదండ్రులకు ప్రేమను చూపించే విధానంలో మనం మన ప్రేమను కుక్కకు అలా చూపించము!

మనకే ఒక ఉదార హృదయం ఉంటే, అప్పుడు మనం మన భాగస్వామికి లేదా స్నేహితుడికి అలాంటిదే ఉంటుంది. అపారమైన వ్యక్తులకు మరియు వస్తువులకు ప్రేమను విస్తరించే సామర్థ్యం ప్రతి ఒక్కరి హృదయానికి ఉంటుంది - మొత్తం ప్రపంచానికి కూడా. వాళ్లకు మనపై మాత్రమే ప్రేమ ఉండాలని మరియు ఇతర ప్రేమ పూర్వక స్నేహాలు లేదా బయట విషయాలు ఏమీ ఉండకూడదని ఆశించడం మరియు డిమాండ్ చేయడం చాలా అన్యాయం మరియు అవాస్తవికం. మనకు, ఇతరులకూ వారి హృదయాల్లో చోటు లేదని భావించేంత తక్కువగా ఆలోచిస్తామా? వారి బుద్ధ స్వభావపు ప్రేమ సామర్థ్యాలను, తత్ఫలితంగా, జీవితంలోని గొప్ప ఆనందాలను మనం నిజంగా కోల్పోవాలని అనుకుంటున్నామా?

ఇక్కడ, మనం లైంగిక మోసం గురించి ఏం మాట్లాడటం లేదు. ఏకస్వామ్యం మరియు లైంగిక మోసం లాంటి సమస్యలు చాలా సంక్లిష్టమైన సమస్యలను తీసుకొస్తాయి. ఏదేమైనా, మన లైంగిక భాగస్వాములు, ముఖ్యంగా మన భార్యలు మనల్ని మోసం చేసి ఇతరులతో ఎక్కువ సమయాన్ని గడిపినట్లయితే - ముఖ్యంగా మనకు చిన్న పిల్లలు ఉన్నప్పుడు - అసూయ, కోపం మరియు స్వాధీనత అనేవి ఏమీ ఉపయోగపడవు. మన భార్యలను తిట్టడం లేదా వాళ్ల మీద అపరాధాలు వెయ్యడానికి ప్రయత్నించి వాళ్లు మనల్ని ప్రేమించేలా చేసుకోలేం కాబట్టి మనం ఆ పరిస్థితిని ప్రశాంతంగా ఎదుర్కోవాలి.

ప్రేమను మన హృదయాలలోకి అనుమతించటం

మనకు ఆత్మీయమైన స్నేహం కేవలం ఒక వ్యక్తితో మాత్రమే ఉంటుందని భావించినప్పుడు, అలాంటి వ్యక్తి ఒకరే అని - మన భాగస్వామి లేదా స్నేహితుడు అని - అలాంటి వారి ప్రేమే మనకు ముఖ్యమైనదని అనుకుంటాం. మనల్ని ప్రేమించే వారు ఇంకా ఎక్కువ మందే ఉన్నా, వాళ్లను పట్టించుకోకుండా, "వాళ్లు లెక్కలోకి రారు" అని అనుకుంటాం. వీలైనంత ఎక్కువ మందికి మన ప్రేమను అందించడం మరియు ఇతరులు అంటే - స్నేహితులు, బంధువులు, పెంపుడు జంతువులు మొదలైనవారికి మనపై ఉన్న ప్రేమను అంగీకరించడం మరియు భవిష్యత్తులో మనం ఇంకా మానసికంగా బలంగా ఉండటానికి సహాయపడుతుంది. ఎవరిపైనైనా ప్రత్యేక ప్రేమ ఉంటే అప్పుడు మనకు ఏ నిర్ణయాన్నైనా మార్చుకోవడానికి ఇది మనకు సహాయపడుతుంది.

“సర్వజ్ఞత” మరియు “సర్వాంతర్యామి” రెండూ మన మనస్సులో మరియు హృదయాలలో ప్రతి ఒక్కరినీ కలిగి ఉండటాన్ని సూచిస్తాయి. ఏదేమైనా, ఒక బుద్ధుడు కేవలం ఒక వ్యక్తిపై దృష్టి పెట్టినప్పుడు, అతను లేదా ఆమె 100% ఆ వ్యక్తితోనే ఉండాలి. కాబట్టి, ప్రతి ఒక్కరిపై ప్రేమ ఉండటం అంటే ప్రతి వ్యక్తిపై ప్రేమ తగ్గిపోతుందని కాదు. మనం ఎక్కువ మందిని ప్రేమిస్తే, మన వ్యక్తిగత సంబంధాలు తక్కువ తీవ్రత లేదా సంతృప్తికరంగా ఉంటాయని మనం భయపడాల్సిన అవసరం లేదు. మనం తక్కువగా దగ్గరయ్యి పూర్తి సంతృప్తికరమైన సంబంధం కోసం ఏదైనా ఒక సంబంధంపై తక్కువగా ఆధారపడవచ్చు, అలా ప్రతి వ్యక్తితో తక్కువ సమయం గడపవచ్చు, కానీ మనం ప్రతి ఒక్కరితో మనస్ఫూర్తిగా ఉంటాం. ఎదుటి వారికి ఇతరులతో ప్రేమపూర్వకమైన స్నేహం ఉండటం వల్ల అది అలాగే ఉండదని అసూయపడినప్పుడు మన పట్ల ఇతరుల ప్రేమ విషయంలోనూ అలాగే జరుగుతుంది.

ఏ ఒక్క వ్యక్తి అయినా మనకు పరిపూర్ణమైన జోడీ అవుతాడు, మన "మరో సగం" అవుతాడు, అతను అన్ని విధాలుగా మనల్ని చూసుకుంటాడు మరియు మన జీవితంలోని ప్రతి విషయాన్ని అతనితో పంచుకోగలం అని అనుకోవడం అవాస్తవం. ఇటువంటి ఆలోచనలు ప్లేటో చెప్పిన పురాతన గ్రీకు పురాణంపై ఆధారపడి ఉన్నాయి, నిజానికి, మనమందరం ఇద్దరిగా విడిపోయి ఉన్నాము. "బయట" ఎక్కడో మన సగం ఉంది; నిజమైన ప్రేమ అనేది ఆ సగం వ్యక్తిని కలిసి జోడీగా చేసుకున్నప్పుడే వస్తుంది. ఈ నమ్మకం పాశ్చాత్య రొమాంటిసిజంకు పునాదిగా మారినప్పటికీ, ఇది ఏ నిజాన్ని చూపించదు. దాన్ని నమ్మడం అంటే తెల్ల గుర్రంపై మనల్ని రక్షించడానికి వచ్చే అందమైన యువరాజును నమ్మడం లాంటిదే. మన ఆసక్తులు మరియు అవసరాలను పంచుకోవడానికి చాలా మంది యొక్క ప్రేమతో కూడిన స్నేహాలు అవసరం. ఇది మన విషయంలో నిజమైతే, మన భాగస్వాములు మరియు స్నేహితుల విషయంలో కూడా నిజమే అవుతుంది. వారి అవసరాలన్నీ తీర్చడం మనకు అసాధ్యం కాబట్టి వాళ్లకు కూడా ఇతర స్నేహాలు అవసరం.

సారాంశం

మన జీవితంలోకి ఎవరైనా కొత్తగా వస్తే, వారిని మన కిటికీలోకి వచ్చిన ఒక అందమైన అడవి పక్షిలా చూడటం సమంజసమే. ఆ పక్షి కూడా వేరే వాళ్ల కిటికీలకు వెళ్లి పంజరంలో బంధించబడుతుందని మనకు అసూయ కలిగితే, అది తన అందాన్ని కోల్పోయి చనిపోయేంత దయనీయంగా మారుతుంది. స్వాధీనత లేకుండా ఆ పక్షిని స్వేచ్ఛగా ఎగరనిస్తే, ఆ పక్షి మనతో ఉన్న అద్భుతమైన సమయాన్ని ఆస్వాదించవచ్చు. పక్షి ఎగిరిపోయినప్పుడు, అది సరైందని అనుకుని, మళ్ళీ అది మనతో ఉండటం సురక్షితంగా అనుకుని తిరిగి వస్తే ఇంకా బాగుంటుంది. మనతో సహా అనేక సన్నిహిత స్నేహాలను కలిగి ఉండటానికి ప్రతి ఒక్కరికి హక్కు ఉందని మనం అంగీకరించి గౌరవిస్తే, మన సంబంధాలు ఆరోగ్యంగా మరియు చాలా కాలం ఉంటాయి.

Top