అసూయ: ఇబ్బంది పెట్టే భావోద్వేగాలతో వ్యవహరించడం

11:14
అసూయలో అనేక రూపాలు ఉన్నాయి. ఇది కేవలం ఇతరుల విజయాలను సహించలేకపోవడం కావచ్చు, లేదా మనమే వాటిని పొందాలనే కోరికను కలిగి ఉండవచ్చు. ఎదుటివారి దగ్గర ఉన్న దాన్ని మనం కోరుకోవచ్చు, అది మనమే పొందాలని కోరుకోవచ్చు మరియు వారు దానిని కోల్పోవాలని కూడా కోరుకోవచ్చు. పోటీతత్వం, అలాగే మనల్ని మనం ఒక సంపూర్ణ "ఓడిపోయినవాడిగా" మరియు ఇతరులను సంపూర్ణ "విజేతలుగా” రెండు రకాలుగా భావించడం కూడా ఇందులో ఉండవచ్చు. వీటన్నిటి వెనుక ఒక వ్యామోహం ఉంటుంది. ఈ అంశాలన్నింటినీ విశ్లేషించడం ద్వారా, బౌద్ధమతం మన ఇబ్బంది పెట్టే భావోద్వేగాలను నిర్వీర్యం చెయ్యడానికి మరియు వాటి నుంచి బయటపడటానికి అధునాతన పద్ధతులను అందిస్తుంది.

ఇబ్బంది పెట్టే భావోద్వేగాలు

మనమందరం ఇబ్బంది పెట్టే భావోద్వేగాలను అనుభవిస్తాము (న్యోన్-మాంగ్స్, సంస్కార్.క్లేశా, బాధాకరమైన భావోద్వేగాలు) - వాటిని అభివృద్ధి చేసినప్పుడు మనం మన మానసిక ప్రశాంతతను మరియు ఆత్మ నియంత్రణను కోల్పోతాము. సాధారణ ఉదాహరణలు దురాశ, మమకారం, శత్రుత్వం, కోపం, అసూయ మరియు కుళ్ళు. అవి వివిధ మానసిక ప్రేరేపణలను (కర్మ) ఉత్పన్నం చెయ్యడానికి ప్రేరేపిస్తాయి, సాధారణంగా అవి వినాశకరమైన ప్రవర్తనకు దారితీస్తాయి. ఇతరుల పట్ల వినాశకరంగా వ్యవహరించడం లేదా సొంత-విధ్వంసక మార్గంలో వ్యవహరించడం కోరికలు కావచ్చు. దీనికి పర్యవసానంగా మనం ఇతరులకు, అనవసరంగా మనకు సమస్యలు, బాధలు సృష్టిస్తాం.

ఇబ్బంది పెట్టే భావోద్వేగాలు విస్తృత శ్రేణిలో ఉన్నాయి. ప్రతి సంస్కృతి మానసికంగా దాని సమాజంలో చాలా మంది అనుభవించే సాధారణ భావోద్వేగ అనుభవాల సమూహం చుట్టూ కొన్ని ఏకపక్ష రేఖను గీస్తుంది, దాన్ని ఒక వర్గంగా వర్ణించే కొన్ని నిర్వచించే లక్షణాలను నిర్ణయిస్తుంది, ఆపై వర్గానికి ఒక పేరును ఇస్తుంది. నిజానికి, ప్రతి సంస్కృతి వివిధ రకాల సాధారణ భావోద్వేగ అనుభవాలను మరియు వాటిని వివరించడానికి వేర్వేరు నిర్వచించే లక్షణాలను ఎంచుకుంటుంది. ఈ విధంగా, ఇబ్బంది పెట్టే భావోద్వేగాల యొక్క వివిధ వర్గాలను ఏర్పరుస్తుంది.

వివిధ సంస్కృతులు సూచించిన ఇబ్బంది పెట్టే భావోద్వేగాల వర్గాలు సాధారణంగా ఖచ్చితంగా వ్యాప్తి చెందవు, ఎందుకంటే భావోద్వేగాల నిర్వచనాలు కొద్దిగా భిన్నంగా ఉంటాయి. ఉదాహరణకు, సంస్కృతం మరియు టిబెటన్ ప్రతి ఒక్కటి సాధారణంగా "అసూయ" అని అనువదించబడిన ఒక పదాన్ని కలిగి ఉంటాయి (సం. ఇర్ష్యా, టిబెట్. ఫ్రాగ్-డాగ్), చాలా పాశ్చాత్య భాషలలో రెండు ఉన్నాయి. ఆంగ్లంలో "కుల్లు" మరియు "అసూయ" ఉన్నాయి, ఉదాహరణకు, జర్మన్ భాషలో "ఈఫెర్సుచ్ట్" మరియు "నీడ్" ఉన్నాయి. రెండు ఆంగ్ల పదాల మధ్య తేడా ఖచ్చితంగా రెండు జర్మన్ పదాల మధ్య ఉన్నట్టు ఉండదు, మరియు సంస్కృతం మరియు టిబెట్ ఈ రెండు భాషలోని ఏ పదాలకు సరిగ్గా సరిపోలవు. పాశ్చాత్యులుగా, మన స్వంత సంస్కృతులు మరియు భాషలు రూపొందించిన వర్గాల ద్వారా నిర్దేశించబడిన ఈ సాధారణ వర్గంలో మనం భావోద్వేగ సమస్యలను అనుభవిస్తే, వాటిని అధిగమించడానికి బౌద్ధమత పద్ధతులను నేర్చుకోవాలనుకుంటే, మన భావోద్వేగాలను బౌద్ధమతంలో నిర్వచించిన అనేక ఇబ్బంది పెట్టే భావోద్వేగాల కలయికగా విశ్లేషించి పునర్నిర్మించాల్సి ఉంటుంది.

ఇక్కడ, దాని అర్థం బౌద్ధమత పదం అయిన "అసూయ" పై దృష్టి పెడదాం, ఎందుకంటే ఇది దాని సాంప్రదాయ నిర్వచనానికి దగ్గరగా ఉంటుంది. మనం అసూయ గురించి విడిగా చర్చించాము, "ఎసెన్షియల్స్" విభాగంలో విడిగా చూశాం. (ఇది చూడండి: సంబంధాలలో అసూయను ఎలా ఎదుర్కోవాలి). 

అసూయ అంటే ఏమిటి?

బౌద్ధమత గ్రంథాలు "అసూయను” శత్రుత్వంలో ఒక భాగంగా వర్గీకరిస్తాయి. వారు దీన్ని "ఇతరుల విజయాలపై దృష్టి పెట్టే ఒక భావోద్వేగం లాంటిదని - వారి మంచి లక్షణాలు, ఆస్తులు లేదా విజయం లాంటిదని - మరియు వారి విజయాలను భరించలేకపోవడం, ఒకరి స్వంత లాభం పట్ల లేదా తనకు లభించే గౌరవం పట్ల మితిమీరిన మమకారం కారణం" అని చెప్తారు.

అనుబంధం అంటే, ఇక్కడ, మనం జీవితంలోని ఏదో ఒక రంగంపై దృష్టి పెట్టాము, ఇందులో ఇతరులు మనకంటే ఎక్కువ విజయాన్ని సాధించారు మరియు దాని పాజిటివ్ అంశాలను అతిశయోక్తి చేస్తాము. మన మనస్సులో, మనం ఈ ప్రాంతాన్ని జీవితంలో అత్యంత ముఖ్యమైన అంశాలలో ఒకటిగా చూస్తాము మరియు దానిపై మన స్వంత-విలువ భావనను ఆధారం చేసుకుంటాము. "నా" పట్ల అపరిమితమైన వ్యామోహం, అనుబంధం అంతర్లీనంగా ఉంటుంది. అందువల్ల, మనం అసూయపడతాము ఎందుకంటే మనం ఈ ప్రాంతం పరంగా "మన స్వంత లాభంతో లేదా మనకు లభించే గౌరవంతో ముడిపడి ఉన్నాము". ఉదాహరణకు, ఇది మన దగ్గర ఉన్న డబ్బుని బట్టి లేదా మనం ఎంత అందంగా ఉన్నాము అనే దానిపై ఆధారపడి ఉండవచ్చు. శత్రుత్వం యొక్క ఒక అంశంగా, అసూయ ఈ అనుబంధానికి ఈ ప్రాంతంలో ఇతరులు ఏమి సాధించారనే దానిపై బలమైన ఆగ్రహాన్ని జోడిస్తుంది. తాము సాధించిన దాన్ని సంతోషించడానికి, ఇది విరుద్ధమైనది.

అసూయ తరచుగా మనపై ప్రయోజనాన్ని అనుభవిస్తుందని నమ్మే వ్యక్తి పట్ల శత్రుత్వం యొక్క అంశాన్ని కూడా కలిగి ఉంటుంది. నిజానికి, ప్రయోజనం నిజం కావచ్చు లేదా కాకపోవచ్చు, కానీ ఈ రెండు సందర్భాల్లోనూ మనం మన గురించి మరియు మనకు లేని వాటిపై నిమగ్నమై ఉంటాము.

ఇంకా, బౌద్ధమతంలో నిర్వచించినట్లుగా అసూయ, కొంత భాగాన్ని కవర్ చేస్తుంది, కానీ ఆంగ్ల పదం "అసూయ" లో ఇది ఉండదు. ఇంగ్లిష్ విషయం దీనికి ఇంకొంచెం జోడించింది. ఇది బౌద్ధమతం "అత్యాశ" అని పిలువబడే దాన్ని జోడిస్తుంది. అత్యాశ అనేది "వేరొకరికి ఉన్న దాని పట్ల అపరిమితమైన కోరిక." అందువల్ల, ఆంగ్లంలో "అసూయ" యొక్క నిర్వచనం "మరొకరు అనుభవించే ప్రయోజనం గురించి బాధాకరమైన లేదా అసహ్యకరమైన ఆలోచన, అదే ప్రయోజనాన్ని ఆస్వాదించాలనే కోరికతో జత చేయబడింది." మరో మాటలో చెప్పాలంటే, బౌద్ధమతం చెప్పినట్లు, మనం అతిశయోక్తిగా చెప్పే ఒక జీవిత రంగంలో ఇతరులు సాధించిన విజయాలను భరించలేకపోవడంతో పాటు, అసూయ అనేది ఈ విజయాలను మనమే పొందాలనే కోరిక. మనం ఈ ప్రాంతంలో పేదవాళ్లుగా లేదా కొరతలో ఉండవచ్చు, లేదా మనకు ఇప్పటికే సరైన లేదా సగటు కంటే ఎక్కువ కొలత ఉండవచ్చు. మనం అసూయపడి ఇంకా ఎక్కువ కోరుకుంటే, అది మన అత్యాశగా మారింది. తరచుగా, తప్పనిసరి కానప్పటికీ, అసూయ అనేది ఇతరులు తాము సాధించినదాన్ని కోల్పోవటానికి ఎక్కువ కోరికను కలిగిస్తుంది, అలా మనం దాన్ని పొందగలము. ఈ సందర్భంలో, భావోద్వేగానికి ఎక్కువ చోటు ఉంటుంది.

అత్యాశతో పాటు అసూయ పోటీకి దారితీస్తుంది. అందువల్ల, ట్రుంగ్పా రింపోచే అసూయ అనేది మనల్ని అధిక పోటీగా మారడానికి మరియు ఇతరులను లేదా మనల్ని అధిగమించడానికి ఉన్మాదంగా పనిచేయడానికి ప్రేరేపించే ఇబ్బందికరమైన భావోద్వేగంగా చర్చించాడు. ఇది బలవంతపు చర్యతో ముడిపడి ఉంటుంది - దీనినే "కర్మ కుటుంబం" అని పిలుస్తారు. ఇతరులు సాధించిన దాని పట్ల అసూయ పడటం వల్ల, మనల్ని మనం నెట్టి వేస్తాము లేదా వ్యాపారం లేదా క్రీడలలో విపరీతమైన పోటీ లాంటి వాటిని ఇంకా ఎక్కువగా చెయ్యమని మన క్రింద ఉన్న ఇతరులను నెట్టి వేస్తాము. అందువల్ల, బౌద్ధమతం అసూయను సూచించడానికి గుర్రాన్ని ఉపయోగిస్తుంది. ఇది అసూయ కారణంగా ఇతర గుర్రాలతో పోటీ పడుతుంది. మరో గుర్రం వేగంగా పరిగెత్తడాన్ని తట్టుకోలేకపోతోంది.

అసూయ మరియు పోటీతత్వం

బౌద్ధమతంలో, అసూయ పోటీతత్వంతో దగ్గరి సంబంధాన్ని కలిగి ఉంటుంది అనేది నిజం, అయినప్పటికీ మొదటిది తప్పనిసరిగా రెండవదానికి దారితీయదు. ఎవరైనా ఇతరులను చూసి అసూయపడవచ్చు, తక్కువ ఆత్మ గౌరవంతో, కనీసం పోటీ చెయ్యడానికి కూడా ప్రయత్నించరు. అదే విధంగా, పోటీగా ఉండటానికి అసూయ అవసరం లేదు. కొంతమంది కేవలం సరదా కోసం, తమను మరియు ఇతరుల సాంగత్యాన్ని ఆస్వాదించడానికి, ఎప్పుడూ స్కోర్ చెయ్యడానికి ఇష్టపడకుండా ఆటలలో పోటీపడటానికి ఇష్టపడతారు.

బౌద్ధమతం అసూయను, పోటీని భిన్నంగా చూస్తుంది. ఉదాహరణకు భోధిసత్వ ప్రవర్తనలో గొప్ప భారతీయ గురువు శాంతిదేవుడు ఉన్నత స్థానాల్లో ఉన్నవారి పట్ల అసూయ, సమానులతో పోటీతత్వం, హోదాలో ఉన్నవారి పట్ల అహంకారం గురించి ఒక చర్చలో చెప్పారు. సమస్త జీవరాశులను సమానంగా చూడటం నేర్చుకునే సందర్భంలోనే ఆయన చర్చ జరిగింది.

బౌద్ధమతం ఇక్కడ ప్రస్తావిస్తున్న సమస్య ఏమిటంటే , "నేను" ప్రత్యేకమైన వాడిని అనే భావన, ఇది ఈ మూడు ఇబ్బంది పెట్టే భావోద్వేగాలకు ఆధారం. జీవితంలో ముందుకు సాగడం లాంటి ఒక నిర్దిష్ట పనిని చెయ్యడానికి "నేను" మాత్రమే అర్హుడిని అని మనం అనుకుంటే, మరొకరు విజయం సాధిస్తే అది చూసి మనం అసూయ పడతాము, మనం పోటీ పడతాము. మనం ఇప్పటికే ఒక మోస్తరు విజయం సాధించినప్పటికీ అవతలి వ్యక్తిని అధిగమించాలి అని అనుకుంటాం. ఇక్కడ, అసూయ అనేది "నేను" అనే ఒక బలమైన భావన మరియు మనతో మాత్రమే ఉండే ఒక బలమైన నిమగ్నత. మనలాగే ఇతరులను కూడా మనం పరిగణనలోకి తీసుకోం. మనల్ని మనం స్పెషల్ గా భావిస్తాం.

ఈ రకమైన అసూయ, పోటీతత్వం మరియు అహంకారం వల్ల కలిగే సమస్యలు మరియు అసంతృప్తికి బౌద్ధమతం అందించే పరిష్కారం "నేను" మరియు "మీరు" గురించి అంతర్లీనంగా ఉన్న అపోహకు చికిత్స చేయడం. అందర్నీ సమానంగా చూడాలి. ప్రతి ఒక్కరికి ఒకే విధమైన ప్రాథమిక సామర్థ్యాలు ఉంటాయి, ప్రతి ఒక్కరికి బుద్ధ స్వభావం ఉంటుంది - ఇవే జ్ఞానోదయాన్ని సాధించడానికి అనుమతించే సామర్థ్యాలు. అలాగే, ప్రతి ఒక్కరికి సంతోషంగా ఉండాలని మరియు విజయం సాధించాలని ఒకే కోరిక ఉంటుంది, మరియు అసంతృప్తిగా లేదా విఫలమవ్వడానికి కాదు. సంతోషంగా ఉండటానికి, విజయం సాధించడానికి అందరికీ సమాన హక్కు, అసంతృప్తి చెందకుండా, విఫలం కాకుండా ఉండటానికి సమాన హక్కు ఉంటాయి. ఈ విషయంలో 'నేను' అనే దాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బౌద్ధమతం ప్రేమను కూడా బోధిస్తుంది - అందరూ సమానంగా సంతోషంగా ఉండాలనే కోరిక.

బుద్ధ స్వభావం, ప్రేమ పరంగా అందరినీ సమానంగా చూడటం నేర్చుకున్నప్పుడు, మనకంటే ఎక్కువ విజయాలు సాధించిన లేదా మనం చేయనప్పుడు విజయం సాధించిన వ్యక్తితో ఎలా సంబంధం కలిగి ఉండాలో చూడటానికి మనం సిద్ధంగా ఉంటాము. అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటాం కాబట్టి అతని లేదా ఆమె విజయంలో మనం సంతోషిస్తాము. వారితో పోటీపడి వారిని అధిగమించడానికి ప్రయత్నించడం కంటే, మన సమానులకు కూడా విజయం సాధించడానికి మనం ప్రయత్నిస్తాము. మనకంటే తక్కువ విజయాలు సాధించిన వారిపట్ల, మనం వారి కంటే గొప్పగా మరియు అహంకారంతో ఉండటానికి బదులుగా, వారు బాగా పనిచెయ్యడానికి సహాయపడటానికి ప్రయత్నిస్తాము.

అసూయ మరియు పోటీతత్వం యొక్క సాంస్కృతిక బలోపేతం

ఈ సూచించిన బౌద్ధమత పద్ధతులు చాలా అధునాతనమైనవి మరియు మన స్వయంచాలకంగా ఉత్పన్నమయ్యే అసూయ మరియు పోటీ తత్వాన్ని బలోపేతం చేసినప్పుడు కొన్ని పాశ్చాత్య సాంస్కృతిక విలువల ద్వారా ప్రతిఫలం పొందినప్పుడు అప్లై చెయ్యడం చాలా కష్టం. అన్నింటికీ మించి, దాదాపు అందరూ స్వయంచాలకంగా గెలవడానికి ఇష్టపడతారు మరియు ఓడిపోయినప్పుడు ఏడుస్తారు. కానీ, అనేక పాశ్చాత్య సంస్కృతులు పెట్టుబడిదారీ విధానాన్ని ప్రజాస్వామ్య సమాజం యొక్క సహజ ఉత్తమ రూపంగా బోధిస్తాయి. ఉదాహరణకు ప్రేమ, ఆప్యాయతల కంటే పోటీనే జీవితానికి ప్రాథమిక చోదకశక్తిగా నిర్ణయించే ఫిట్ నెస్ ఉన్నవారి మనుగడ సిద్ధాంతం ఇందులో అంతర్లీనంగా ఉంటుంది. ఇంకా, పాశ్చాత్య సంస్కృతులు పోటీ ఆటల పట్ల వ్యామోహంతో విజయం యొక్క ప్రాముఖ్యతను బలపరుస్తాయి మరియు ప్రపంచంలోని ఉత్తమ అథ్లెట్లు మరియు ధనవంతులను కీర్తిస్తాయి.

దీనికి తోడుగా, ప్రజాస్వామ్యం మరియు ఓటింగ్ యొక్క పూర్తి రాజకీయ వ్యవస్థ పోటీని కలిగి ఉంటుంది - పదవి కోసం మన ప్రత్యర్థుల కంటే మనం ఎంత మెరుగ్గా ఉన్నామో ప్రచారం చెయ్యడం ద్వారా అభ్యర్థులుగా మనల్ని మనం అమ్ముకుంటాం. పాశ్చాత్య దేశాలలో సాధారణంగా ఆచరించబడుతున్నట్లుగా, ప్రచారం ప్రత్యర్థి అభ్యర్థులలో వారి వ్యక్తిగత జీవితాల పరంగా కూడా సాధ్యమయ్యే ప్రతి బలహీనతను కనిపెట్టడానికి మరియు వారిని నిష్పత్తికి మించి పెంచడానికి మరియు అతన్ని లేదా ఆమెను అప్రతిష్టపాలు చెయ్యడానికి విస్తృతంగా ప్రచారం చెయ్యడానికి తీవ్రమైన ప్రయత్నాన్ని జోడిస్తుంది. అసూయ మరియు పోటీ ఆధారంగా చాలా మంది ఇటువంటి ప్రవర్తనను ప్రశంసనీయమైనది మరియు న్యాయమైనదిగా భావిస్తారు. ఇక్కడ, బౌద్ధమత పదాన్ని "కుళ్ళు" అని అనువదించడం "అసూయ" కంటే సరైనది, అయినప్పటికీ భావోద్వేగ డైనమిక్స్ ఒకేలా ఉంటాయి.

మరోవైపు టిబెట్ సమాజం ఇతరులను కించ పరిచే వారిని, వారి కంటే తామే బెటర్ అని చెప్పుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. వీటిని నెగెటివ్ క్యారెక్టర్ లక్షణాలుగా పరిగణిస్తుంది. నిజానికి, మొదటి మూల భోధిసత్వ ప్రతిజ్ఞ మనల్ని మనం పొగడడం మరియు ఇతరులను మనకంటే తక్కువ స్థానాలలో ఉన్న వ్యక్తులకు తక్కువ చేయడం - ఇక్కడ, అటువంటి పదాలను ఓటు వేసే ప్రజలకు ప్రచారం చేయడం కూడా ఉంటుంది. ప్రేరేపించబడిన వ్యక్తుల నుంచి లాభం, పొగడ్తలు, ప్రేమ, గౌరవం మొదలైన వాటిని కోరుకోవడం మరియు చిన్నచూపు చూసిన వ్యక్తుల అసూయ. మనం చెప్పేది నిజమో, అబద్ధమో అనే తేడా ఉండదు. దీనికి విరుద్ధంగా, మన గురించి మాట్లాడేటప్పుడు, విపరీతమైన వినయం మరియు "నాకు మంచి లక్షణాలు లేవు; నాకేమీ తెలియదు" అని ప్రశంసించదగినదిగా భావిస్తారు. అందువల్ల, ప్రజాస్వామ్యం మరియు ఓట్ల కోసం ప్రచారం పూర్తిగా పరాయివని మరియు సాధారణ పాశ్చాత్య రూపంలో ఆచరిస్తే టిబెటన్ సమాజంలో అవి పనిచేయవు.

మనం పదవి కోసం పోటీ చెయ్యాలనుకుంటున్నామని చెప్పడం కూడా అహంకారానికి అనుమానాస్పద సంకేతంగా మరియు పరోపకారం లేని ఉద్దేశ్యంగా పరిగణించబడుతుంది. అభ్యర్థుల ప్రతినిధులు - నామినీలు ఎప్పుడూ - తమ అభ్యర్థుల మంచి లక్షణాలు మరియు విజయాల గురించి ఇతరులతో మాట్లాడటం, పదవి కోసం ప్రత్యర్థులతో పోల్చడం లేదా వారి గురించి చెడుగా మాట్లాడటం మాత్రమే సాధ్యమయ్యే రాజీ ఉంటుంది. అయితే, ఇది ఎప్పుడూ చెయ్యబడదు. సాధారణంగా ఉన్నత కుటుంబాలు, అవతరించిన లామాల లాంటి మంచి పేరున్న అభ్యర్థులను పోటీ చేయాలనుకుంటున్నారా అని కూడా అడగకుండా నామినేట్ చేస్తారు. వారు పదవికి పోటీ చేయడం ఇష్టం లేదని చెబితే, ఇది వినయానికి సంకేతంగా పరిగణించబడుతుంది, ఎందుకంటే వెంటనే "అవును" అని చెప్పడం అహంకారాన్ని మరియు అధికార దురాశను సూచిస్తుంది. నామినేట్ అయిన వ్యక్తి తిరస్కరించడం దాదాపు అసాధ్యం. ఆ తర్వాత ప్రచారం లేకుండానే ఓటింగ్ నిర్వహిస్తారు. ప్రజలు సాధారణంగా బాగా పేరున్న అభ్యర్థికే ఓటు వేస్తారు.

అందువల్ల, ఇతరుల విజయాలను ఆనందించే బౌద్ధమత పద్ధతి - మరియు ఇతరులకు విజయాన్ని ఇవ్వడం మరియు మన కోసం ఓటమిని అంగీకరించడం - పెట్టుబడిదారీ విధానం మరియు పాశ్చాత్య ఎన్నికల ప్రచార వ్యవస్థ యొక్క సుగుణాలను బలంగా విశ్వసించే పాశ్చాత్యులకు ప్రయత్నించడానికి అత్యంత సరైన మొదటి పరిష్కారం ఇది కాకపోవచ్చు. పాశ్చాత్యులుగా, మనం ముందు మన సాంస్కృతిక విలువల చెల్లుబాటును పునఃసమీక్షించాలి మరియు స్వయంచాలకంగా ఉత్పన్నమయ్యే రూపాలను పరిష్కరించడానికి ముందు, ఆ విలువలను అంగీకరించడం ద్వారా ఉత్పన్నమయ్యే అసూయ, కుళ్ళు మరియు పోటీ యొక్క సిద్ధాంత ఆధారిత రూపాలతో వ్యవహరించాలి.

పాశ్చాత్య సాంస్కృతిక ఆధారిత అసూయ, కుళ్ళు మరియు పోటీతత్వం యొక్క సాపేక్షతను చూడటానికి మనకు సహాయపడే ఒక ఉదాహరణ భారతీయ మార్కెట్. భారతదేశంలో వస్త్ర మార్కెట్లు, నగల మార్కెట్లు, కూరగాయల మార్కెట్లు మొదలైనవి చాలా ఉన్నాయి. ఒక్కొక్కటి వరుసగా స్టాల్స్, షాపులు, పక్క పక్కనే ఉంటాయి, అన్నీ దాదాపు ఒకే రకమైన వస్తువులను అమ్ముతున్నాయి. చాలా మంది దుకాణదారులు ఒకరికొకరు స్నేహితులు మరియు ఎప్పుడూ వారి దుకాణాల బయట కలిసి టీ తాగుతూ కూర్చొంటారు. తమ దుకాణాలు బాగుంటాయా లేదా అనేది వారి కర్మపై ఆధారపడి ఉంటుందనేది వారి ఆలోచనా విధానం.

అసూయలో అంతర్లీనంగా ఉన్న మోసపూరిత రూపాలు

మనం చూసినట్లుగా, అసూయ అనేది ఒక రంగంలో మరొకరు సాధించిన విజయాన్ని భరించలేకపోవడం, ఉదాహరణకు, అతని లేదా ఆమె ఆర్థిక విజయం యొక్క ప్రాముఖ్యతను అతిశయోక్తిగా చూపిస్తాము. దానికి బదులుగా మనం దాన్ని సాధించాలని కోరుకుంటాం. ఎవరైనా ఒకరి నుంచి ప్రేమ లేదా ఆప్యాయత లాంటి దాన్ని పొందినప్పుడు దీని వైవిధ్యం సంభవిస్తుంది. దానికి బదులుగా మనం కూడా దాన్ని స్వీకరించాలని కోరుకుంటున్నాము.

అసూయ యొక్క ఈ ఇబ్బంది పెట్టే భావోద్వేగం రెండు మోసపూరిత రూపాల నుంచి వచ్చింది, గందరగోళం మరియు విషయాలు ఎలా ఉన్నాయో తెలియకపోవడం వల్ల, మన మనస్సులు సృష్టించబడతాయి మరియు ప్రొజెక్ట్ చెయ్యబడతాయి. మొదటిది ద్వంద్వ రూపం (1) ఏదైనా సాధించడానికి లేదా స్వీకరించడానికి స్వతహాగా అర్హుడు కాని అందుకోని ఒక దృఢమైన "నేను", మరియు (2) సహజంగా దానిని పొందడానికి అర్హత లేని దృఢమైన "మీరు". మనకు తెలియకుండానే, ప్రపంచం మనకు ఏదో రుణపడి ఉందని మరియు బదులుగా ఇతరులు దాన్ని పొందినప్పుడు అది అన్యాయమని మనం అనుకుంటాము. మనం ప్రపంచాన్ని రెండు బలమైన వర్గాలుగా విభజిస్తాము: "ఓడిపోయిన వారిగా" మరియు "విజేతలుగా", మరియు ప్రజలు నిజంగా ఉన్నారని మరియు ఈ దృఢమైన నిజమైన వర్గాల పెట్టెలలో కనిపెట్టగలరని ఊహిస్తాము. అప్పుడు మనల్ని మనం "ఓడిపోయినవాడు" అనే పెద్ద శాశ్వత వర్గంలో ఉంచుకుంటాము మరియు అవతలి వ్యక్తిని "విజేత" అనే శాశ్వత వర్గంలో ఉంచుతాము. మనం తప్ప మిగతా వాళ్ళందరిని విజేతల పెట్టెలో పెట్టొచ్చు. మనకు కోపం రావడమే కాదు, వినాశనం కలుగుతుంది. ఇది బాధాకరమైన ఆలోచనకు దారితీస్తుంది, "పాపం నేను" అని.

ప్రవర్తనా కారణం మరియు ప్రభావం గురించి అమాయకత్వం సాధారణంగా అసూయతో పాటు ఉంటుంది. ఉదాహరణకు, ప్రమోషన్ లేదా ఆప్యాయత పొందిన వ్యక్తి సంపాదించడానికి లేదా దానికి అర్హుడు కావడానికి ఏదైనా చేశాడని మనం అర్థం చేసుకోలేము మరియు తిరస్కరించలేము. అంతేకాక, దాన్ని తీసుకురావడానికి మనం ఏమీ చెయ్యకుండా పొందాలని మనం అనుకుంటాము. దీనికి ప్రత్యామ్నాయంగా, మనం చాలా చేసాము, కానీ ఇప్పటికీ ఈ ప్రతిఫలం లభించలేదని మనం అనుకుంటాము. ఈ విధంగా మన మనస్సులు రెండవ మోసపూరిత రూపాన్ని సృష్టిస్తాయి మరియు దాన్ని ప్రొజెక్ట్ చేస్తాయి. అయోమయంలో ఉన్న మన మనస్సులు ఏ కారణం లేకుండా, లేదా ఒకే ఒక కారణంతో జరిగేలా చేస్తాయి: మనం ఒంటరిగా ఏమి చేశామో అది.

మోసపూరితమైన రూపాలను మళ్ళీ నిర్మించడం

ఈ రెండు మోసపూరిత రూపాలను మనం పునర్నిర్మించాల్సిన అవసరం ఉంది. జీవుల ప్రపంచంలో అంతర్లీనంగా ఉన్న చోదక సూత్రం పోటీ అని మన సంస్కృతులు మనకు బోధించి ఉండవచ్చు: గెలవాలనే తపన, మరియు ఉత్తమమైన వారి మనుగడ. కానీ ఆ వాదన నిజం కాకపోవచ్చు. ఏదేమైనా, మనం దాన్ని అంగీకరించినట్లయితే, ప్రపంచం సహజంగా, దాని స్వభావ రీత్యా, విజేతలు మరియు ఓడిపోయిన వారి సంపూర్ణ ద్వంద్వంగా విభజించబడిందని మనం నమ్ముతాము. దాని పర్యవసానంగా, మనం ప్రపంచాన్ని విజేతలు మరియు ఓడిపోయిన వారి యొక్క స్థిరమైన భావనాత్మక వర్గాలలో చూస్తాము మరియు నిజానికి, మనల్ని మనం ఒకే భావనాత్మక ఫ్రేమ్వర్క్తో చూస్తాము.

విజేతలు, ఓడిన వారు, పోటీ అనే భావనలు పరిణామ క్రమాన్ని వర్ణించడానికి ఉపయోగపడుతున్నప్పటికీ, అవి ఏకపక్ష మానసిక నిర్మాణాలు మాత్రమే అని మనం గ్రహించాలి. "విజేత", "ఓడిపోయినవాడు" అనేది కేవలం మానసిక లేబుళ్లు మాత్రమే. అవి ఒక రేసులో ముందుగా రావడం, మరొకరికి బదులుగా పనిలో ప్రమోషన్ పొందడం లేదా క్లయింట్ లేదా విద్యార్థిని మరొకరికి కోల్పోవడం లాంటి కొన్ని సంఘటనలను వివరించడానికి ఉపయోగించే సౌకర్యవంతమైన మానసిక వర్గాలు. మనం "మంచి" ను ఎలా నిర్వచిస్తామో దానిపై ఆధారపడి ప్రజలను "మంచి వ్యక్తులు" మరియు "మంచి వ్యక్తులు కాదు" అనే వర్గాలుగా సులభంగా విభజించవచ్చు.

ఇటువంటి ద్వంద్వ వర్గాలన్నీ కేవలం మానసికంగా నిర్మితమైనవే అని చూసినప్పుడు, మనల్ని దృఢమైన వర్గాలుగా బంధించే "నేను" లేదా "మీరు" వైపు అంతర్లీనంగా ఏమీ లేదని మనం గ్రహించడం ప్రారంభిస్తాము. మనం ప్రాథమికంగా ఓడిపోయిన వాళ్లం కాదు, సహజంగానే, మనల్ని మనం ఓడిపోయిన వారిగా భావించడంలో, చివరికి సత్యాన్ని కనిపెట్టాం - నిజమైన "నేను" ఓడిపోయాను అని. పాపం "నేను." దానికి బదులుగా, ఒక క్లయింట్ ను వేరొకరి చేతిలో కోల్పోవడంతో పాటు మనకు అనేక ఇతర లక్షణాలు ఉన్నాయి, కాబట్టి అదే నిజమైన "నేను" అన్నట్లుగా దాని గురించి మనం ఎందుకు ఆలోచించాలి.

ఇంకా, మన పరిమిత మనస్సులు మరియు "పేద 'నేను', "మీరు "మీరు", అని ఆలోచించడం వల్ల మాత్రమే విజయం మరియు వైఫల్యం, లాభనష్టాలు, ఎటువంటి కారణం లేకుండా లేదా అసంబద్ధమైన కారణాల వల్ల జరిగినట్లు అనిపిస్తుంది. అందుకే మనకు జరిగింది అన్యాయమని మనం అనుకుంటున్నాం. అయితే, ఈ విశ్వంలో జరిగేది కారణం మరియు ప్రభావం యొక్క భారీ నెట్‌వర్క్ వల్ల జరుగుతుంది. మనకు మరియు ఇతరులకు ఏమి జరుగుతుందో చాలా విషయాలు ప్రభావితం చేస్తాయి, ప్రతి అంశాన్ని చేర్చడం మన ఊహలకు అతీతమైనది.

ఈ రెండు మోసపూరిత రూపాలను (విజేతలు, ఓడిపోయినవారు, సరైన కారణం లేకుండా జరిగేవి) అని విడదీసి, వాటిని ప్రదర్శించడం మానేసినప్పుడు, మన అన్యాయ భావనలను తగ్గించుకుంటాం. మన అసూయ కింద ఏం సాధించారో, ఏం జరిగిందోనన్న స్పృహ మాత్రమే ఉంటుంది. మనం ఒక క్లయింట్ ను వేరొకరి చేతిలో కోల్పోయాము మరియు ఇప్పుడు వేరొకరికి ఈ క్లయింట్ దక్కాడు. దీని వల్ల సాధించాల్సిన లక్ష్యం గురించి మనకు అవగాహన వస్తుంది. దానిని సాధించినందుకు లేదా స్వీకరించినందుకు మనం మరొకరిని ప్రశంసించకపోతే, ఆ వ్యక్తి ఈ ఘనతను ఎలా సాధించాలో మనం తెలుసుకోవచ్చు. దీన్ని మనమే ఎలా సాధించాలో చూడటానికి ఇది వీలు కల్పిస్తుంది. ద్వంద్వ రూపాలు మరియు నిర్దిష్ట గుర్తింపులతో ఈ అవగాహనను అతిగా చూపించడం వల్ల మాత్రమే మనకు అసూయ మరియు కుళ్ళు కలుగుతుంది.

సారాంశం

అందువల్ల, బౌద్ధమతం అసూయ యొక్క ఇబ్బంది పెట్టే భావోద్వేగాన్ని ఎదుర్కోవటానికి వివిధ పద్ధతులను అందిస్తుంది, దీన్ని మనం బౌద్ధమత పద్ధతిలో లేదా పాశ్చాత్య మార్గాల్లో నిర్వచించాము. మనం ఇబ్బంది పెట్టే భావోద్వేగంతో బాధపడుతున్నప్పుడు, నిర్వచించే లక్షణాలను మరియు మన సాంస్కృతిక నేపథ్యాలను సరిగ్గా గుర్తించడమే అసలైన సవాలు. ధ్యాన సాధన ద్వారా, వివిధ పద్ధతుల్లో మనం శిక్షణ పొందినప్పుడు, మనం ఎదుర్కొంటున్న ఏవైనా భావోద్వేగ ఇబ్బందులను అధిగమించడానికి సహాయపడటానికి సరైన దాన్ని ఎంచుకోవచ్చు.

దీన్ని చూడండి: వికీపీడియాలో అసూయ గురించిన ఉన్న వ్యాసం.

Top