ఇబ్బంది పెట్టే భావోద్వేగం అంటే ఏమిటి?

10:11
కోపం, మమకారం, స్వార్థం లేదా దురాశ వల్ల మన మనస్సులు ఇబ్బంది పడినప్పుడు, మన శక్తులు కూడా దెబ్బతింటాయి. మనకు అసౌకర్యంగా అనిపిస్తుంది; మన మనస్సులు ప్రశాంతంగా ఉండవు; మన ఆలోచనలు క్రూరంగా ఉంటాయి. తర్వాత మనం పశ్చాత్తాపం పడే విషయాలు చెబుతాం, చేస్తాము. అకస్మాత్తుగా మన మనస్సుల్లో, శక్తుల్లో చికాకు ఏదైనా కనిపిస్తే, అది ఏదో ఇబ్బంది పెట్టే భావోద్వేగాల పని అని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. కనిపించిన వెంటనే దాన్ని పట్టుకొని, ప్రత్యర్థి మానసిక స్థితి అయిన ప్రేమ, కరుణలను అప్లై చేసి, ఇబ్బంది పెట్టే భావోద్వేగాలకు తగ్గట్టు పనిచేసి మనం సృష్టించే సమస్యలను నివారించడానికి ఇది ఒక ట్రిక్.

"ఇబ్బంది పెట్టే భావోద్వేగం" అంటే ఏమిటి?

ఇబ్బంది పెట్టే భావోద్వేగాన్ని మానసిక స్థితిగా చెప్తారు, దాన్ని మనం అభివృద్ధి చేసినప్పుడు, మనం మన మనశ్శాంతిని కోల్పోతాము మరియు సొంత నియంత్రణను కోల్పోతాము.

మనం మన మనశ్శాంతిని కోల్పోతాం కాబట్టి, అది ఇబ్బంది పెడుతుంది; మన మనశ్శాంతికి భంగం కలిగిస్తుంది. మనశ్శాంతిని కోల్పోయినప్పుడు మనం ఇబ్బంది పడతాము కాబట్టి, మన ఆలోచనలో లేదా మన భావాలలో స్పష్టత ఏమీ ఉండదు. ఆ స్పష్టత లేకపోవడం వల్ల, సొంత నియంత్రణ కలిగి ఉండటానికి అవసరమైన వివక్ష భావనను కోల్పోతాము. ఏది సహాయం చేస్తుందో ఏది చెయ్యదో మనం గుర్తించగలగాలి; ఏది సరైనదో మరియు ఏది నిర్దిష్ట పరిస్థితులలో సరైనది కాదో కూడా.

ఇబ్బంది పెట్టే భావోద్వేగాలు కూడా నిర్మాణాత్మక మానసిక స్థితులతో కలిసి ఉంటాయి.

ఇబ్బంది పెట్టే భావోద్వేగాలకు ఉదాహరణలు, అనుబంధం, కోరిక, కోపం, అసూయ, అహంకారం, అహంకారం మొదలైనవి. ఈ ఇబ్బంది పెట్టే భావోద్వేగాలలో కొన్ని వినాశకరమైన పనులకు దారితీయవచ్చు, కానీ అది ఎప్పుడూ అలా ఉండదు. ఉదాహరణకు, మమకారం మరియు కోరిక మనల్ని వినాశకరమైన పనులకు దారితీయవచ్చు - ఉదాహరణకు, బయటకు వెళ్లి ఏదైనా దొంగిలించడం లాంటిది. కానీ, మనం ప్రేమించబడాలనే కోరికను కలిగి ఉండవచ్చు మరియు మనం దానితో జతచేయబడతాము, కాబట్టి ఇతరులు వారిచే ప్రేమించబడటానికి మనం సహాయపడతాము.

కోపానికి సంబంధించిన విషయాన్ని పరిగణనలోకి తీసుకోండి. కోపం మనల్ని వినాశకరమైన పనులు చేసేలా చేస్తుంది, బయటకు వెళ్లి ఎవరినైనా బాధపెట్టవచ్చు లేదా మనం చాలా కోపంగా ఉన్నందుకు వారిని చంపడానికి కూడా అది దారితీస్తుంది. కాబట్టి, అది వినాశకరమైన ప్రవర్తన. కానీ, ఒక నిర్దిష్ట వ్యవస్థ లేదా ఒక నిర్దిష్ట పరిస్థితి యొక్క అన్యాయం గురించి మనం కోపంగా ఉన్నామని అనుకుందాం - మరియు మనం దానిపై చాలా కోపంగా ఉన్నాము, దాన్ని మార్చడానికి మనం ఏదైనా చేస్తాము. ఇది మనం చేసే హింసాత్మకమైన పని కానవసరం లేదు. కానీ ఇక్కడ విషయం ఏమిటంటే, ఇక్కడ నిర్మాణాత్మకంగా లేదా పాజిటివ్ గా ఏదైనా చేయడం కూడా ఇబ్బంది పెట్టే భావోద్వేగంతో ప్రేరేపించబడుతుంది. మనకు మనశ్శాంతి ఉండదు, ఆ మనశ్శాంతి లేకపోవడం వల్ల, మనం ఆ  పాజిటివ్ పని చేస్తున్నప్పుడు, మన మనస్సులు మరియు భావాలు స్పష్టంగా ఉండవు మరియు మన భావోద్వేగ స్థితి స్థిరంగా ఉండదు.

ఈ సందర్భాలలో, కోరికతో లేదా కోపంతో, అవతలి వ్యక్తి మనల్ని ప్రేమించాలని లేదా ఒక అన్యాయాన్ని అంతం చెయ్యాలని కోరుకుంటాము. అవి స్థిరమైన మానసిక స్థితులు లేదా స్థిరమైన భావోద్వేగ స్థితులు కావు. కాబట్టి మనం ఏమి చెయ్యాలి మరియు మన ఉద్దేశాలను ఎలా అమలు చెయ్యాలనే దాని గురించి మనం చాలా స్పష్టంగా ఆలోచించడం లేదు. దాని ఫలితంగా మనకు సొంత నియంత్రణ ఉండదు. ఉదాహరణకు, మనం ఎవరికైనా ఏదైనా చెయ్యడానికి సహాయపడటానికి ప్రయత్నించవచ్చు, కానీ సహాయం చెయ్యడానికి మంచి మార్గం వారు స్వయంగా చెయ్యడానికి అనుమతించడం. మనకు ఒక పెద్ద కూతురు ఉందనుకుందాం మరియు మనం తనకు వంట చెయ్యడానికి లేదా ఇంటిని చక్కగా చూసుకోవడానికి లేదా పిల్లలను చూసుకోవటానికి సహాయపడాలని అనుకుంటున్నాము, ఇది మనం అనేక విధాలుగా చెయ్యవచ్చు. మన అమ్మాయికి వంట ఎలా చేయాలో, పిల్లల్ని ఎలా పెంచాలో చెప్పడం నచ్చక పోవచ్చు. కానీ మనం తన చేత ప్రేమించబడాలని అనుకుంటున్నాము మరియు ఉపయోగంగా ఉండాలని అనుకుంటున్నాం, కాబట్టి మనం ఆమెపై ఒత్తిడి తెస్తాము. మనం నిర్మాణాత్మకంగా ఏదో చేస్తున్నాము, కానీ అలా చెయ్యడంలో, "నా అభిప్రాయాన్ని చెప్పకుండా, నా సహాయాన్ని అందించకుండా నోరు మూసుకోవడం మంచిది" అని అనుకునేలా చేసే సొంత నియంత్రణను మనం కోల్పోయాం.

అవతలి వ్యక్తికి సహాయం చెయ్యడానికి తగిన పరిస్థితిలో మనం సహాయం చేసినప్పటికీ, దాని గురించి మనం రిలాక్స్ అవ్వము, ఎందుకంటే దానికి ప్రతిఫలంగా మనం ఇంకేదైనా ఆశించవచ్చు. మనం ప్రేమించబడాలని కోరుకుంటాం; మనం అవసరం పడాలని కోరుకుంటాం; మనం ప్రశంసించబడాలని కోరుకుంటాం. ఈ రకమైన కోరిక మన మనస్సులో ఒక షరతుగా ఉండి, మన కూతురు మనం కోరుకున్న విధంగా స్పందించకపోతే, మనం చాలా ఇబ్బంది పడతాము.

మనశ్శాంతిని కోల్పోవడానికి, సొంత నియంత్రణ కోల్పోవడానికి కారణమయ్యే భావోద్వేగాలను ఇబ్బందిగా ఈ విధానం మనం అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడబోతున్నప్పుడు ఎక్కువ స్పష్టంగా కనిపిస్తుంది. దాని గురించి చిరాకు పడటం వల్ల, మనం నిజంగా బాధ పడతాము. మనం ఇబ్బంది పడి ఆ ప్రాతిపదికన పనిచేయాలనుకుంటే, సాధారణంగా మనం ఏమి చేయాలో చాలా స్పష్టంగా ఆలోచించము. అలా, మనం కోరుకున్న మార్పును తీసుకురావడానికి సరైన కార్యాచరణను అనుసరించము.

క్లుప్తంగా చెప్పాలంటే, మనం వినాశకరంగా వ్యవహరించినా లేదా నిర్మాణాత్మకంగా ఏదైనా చేసినా, మనం చేసే పని ప్రేరేపితమై, ఇబ్బంది పెట్టే భావోద్వేగంతో కలిసి ఉంటే, మన ప్రవర్తన సమస్యలను తెచ్చిపెడుతుంది. ఇది ఇతరులకు సమస్యలను కలిగిస్తుందో లేదో ఖచ్చితంగా అంచనా వేయలేనప్పటికీ, ఇది ప్రధానంగా మనకు సమస్యలను కలిగిస్తుంది. ఈ సమస్యలు వెంటనే జరిగేవి కావు; అవి దీర్ఘకాలిక సమస్యలు, అంటే ఇబ్బంది పెట్టే భావోద్వేగాల ప్రభావంతో పనిచేయడం వల్ల పదే పదే అలాంటి మార్గాల్లో ప్రవర్తించే అలవాట్లు ఏర్పడతాయి. ఈ విధంగా, ఇబ్బంది పెట్టే భావోద్వేగాలపై ఆధారపడిన మన బలవంతపు ప్రవర్తన దీర్ఘకాలిక సమస్యలను సృష్టిస్తుంది. ఇంక మనకు ఎప్పుడూ మనశ్శాంతి అనేది ఉండదు.

దానికి ఒక స్పష్టమైన ఉదాహరణ ఏమిటంటే, మనం ప్రేమ మరియు ప్రశంసలను పొందాలని కోరుకోవడం వల్ల ఇతరులకు సహాయం చెయ్యడానికి మరియు మంచి పనులు చెయ్యడానికి ప్రేరేపించబడటం. దాని వెనుక మనం అభద్రతా భావంతో ఉన్నాం. కానీ ఈ రకమైన ప్రేరణతో నటించడం ఎక్కువైతే, సంతృప్తి ఉండదు, "సరే, ఇప్పుడు నేను ప్రేమించబడుతున్నాను. అది చాలు, నాకు ఇంకేమీ అక్కర్లేదు" అని. మనకెప్పుడూ అలా అనిపించదు. కాబట్టి, మన ప్రవర్తన బలవంతంగా అనుభూతి చెందే అలవాటును బలపరుస్తుంది, అలా "నేను ప్రేమను అనుభవించాలి, నేను ముఖ్యమైన వాడిగా భావించబడాలి, నేను ప్రశంసించబడాలి" అని ఉంటుంది. మీరు ప్రేమించబడతారనే ఆశతో ఎక్కువగా ఇస్తారు, కానీ మీరు ఎప్పుడూ నిరాశ చెందుతారు. ఎందుకంటే ఎవరైనా మీకు కృతజ్ఞతలు చెప్పినప్పటికీ, "అది సరైన అర్ధంలో లేదు" అని మీరు అనుకుంటారు. దానివల్ల మనకు మనశ్శాంతి ఉండదు. మరియు ఇది మరింత అధ్వాన్నంగా మారుతుంది, ఎందుకంటే ఇది మళ్ళీ రిపీట్ అవుతుంది. దీన్ని "సంసారం" అని పిలుస్తారు - నియంత్రణలో లేని రిపీట్ అయ్యే సమస్యాత్మక పరిస్థితి.

ఇబ్బంది పెట్టే భావోద్వేగం నెగెటివ్ గా లేదా వినాశకరంగా వ్యవహరించడానికి కారణమైనప్పుడు ఈ రకమైన విధానాన్ని గుర్తించడం అంత కష్టం కాదు. ఉదాహరణకు, మనకు ఎప్పుడూ చిరాకు ఉండవచ్చు, దాని వల్ల చిన్న చిన్న విషయాలకు మనకు కోపం వస్తుంది, అప్పుడు ఇతరులతో మన సంబంధాలలో మనం ఎప్పుడూ కఠినంగా మాట్లాడుతాము లేదా చెడు విషయాలు చెబుతాము. ఎవరూ మనతో ఉండటానికి ఇష్టపడరని మరియు ఇది మన సంబంధాలలో చాలా సమస్యలను కలిగిస్తుందని తెలుస్తుంది. అక్కడ ఏం జరుగుతోందో గుర్తించడం చాలా సులభం. కానీ పాజిటివ్ గా నటించడం వెనుక ఇబ్బంది పెట్టే భావోద్వేగం ఉన్నప్పుడు దాన్ని గుర్తించడం అంత సులభం కాదు. కానీ ఈ రెండు సందర్భాల్లోనూ మనం దాన్ని గుర్తించాలి.

ఇబ్బంది పెట్టే భావోద్వేగం, వైఖరి లేదా మానసిక స్థితి యొక్క ప్రభావానికి గురయ్యాం అని మనం ఎలా గుర్తించాలి

ఇక్కడ, ఇబ్బంది పెట్టే భావోద్వేగం లేదా వైఖరి ప్రభావంతో మనం ప్రవర్తిస్తున్నామని ఎలా గుర్తించాలి అనేదే ప్రశ్న. ఇది కేవలం భావోద్వేగం మాత్రమే కాదు; అది జీవితం పట్ల ఆలోచనా విధానం కావచ్చు లేదా మన పట్ల కావచ్చు. అందుకోసం మనం కాస్త సున్నితంగా ఉండి మనలోపల ఎలా ఫీలవుతున్నామో గమనించాలి. దీనికోసం, ఇబ్బంది పెట్టే భావోద్వేగం లేదా వైఖరి యొక్క నిర్వచనం చాలా సహాయపడుతుంది: ఇది మన మనశ్శాంతిని కోల్పోవటానికి మరియు సొంత నియంత్రణను కోల్పోవటానికి కారణమవుతుంది.

మనం ఏదైనా చెప్పబోతున్నప్పుడు లేదా ఏదైనా చెయ్యబోతున్నప్పుడు, మనం లోపల కొంచెం ఆందోళనలో ఉంటే, మనం పూర్తిగా రిలాక్స్ గా ఉండలేము, అది ఏదో ఇబ్బంది పెట్టే భావోద్వేగం యొక్క సంకేతం ఇస్తుంది.

ఇది అపస్మారక స్థితిలో ఉండవచ్చు మరియు దాని వెనుక కొంత ఇబ్బంది పెట్టే భావోద్వేగం ఉండవచ్చు.

మనం ఎవరికైనా ఒక విషయం గురించి వివరించడానికి ప్రయత్నిస్తున్నాము అనుకుందాం. మనం ఆ వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు మన కడుపులో కొంచెం అసౌకర్యం ఉందని మనం గమనించినట్లయితే, దాని వెనుక కొంచెం గర్వం ఉందని మంచి సూచన ఉంటుంది. "నేనెంత తెలివైన వాడినో నాకు అర్థమౌతుంది. నేను మీకు దీనిని అర్థం చేసుకోవడానికి సహాయం చేస్తాను" అని మనకు అనిపించవచ్చు. అలా అవతలి వ్యక్తికి ఏదైనా వివరించడం ద్వారా మనం నిజాయితీగా సహాయం చెయ్యాలని అనుకోవచ్చు, అక్కడ కొంత గర్వం ఉంటుంది. మన విజయాల గురించి లేదా మన మంచి లక్షణాల గురించి మాట్లాడినప్పుడు ఇది ప్రత్యేకంగా జరుగుతుంది. చాలా తరచుగా, మేము దాన్ని కొంచెం అసౌకర్యంతో అనుభవిస్తాము.

ఇబ్బంది పెట్టే వైఖరిని పరిశీలి౦చ౦డి, "ప్రతి ఒక్కరూ నా పట్ల శ్రద్ధ చూపి౦చాలి" అనే ఆలోచన మనకు ఎప్పుడూ ఉ౦టు౦ది. మనం పట్టించుకోకుండా ఉండడానికి ఇష్టపడము - అలా ఎవరూ ఇష్టపడరు - కాబట్టి మనం ఇలా అనుకుంటాము, "ప్రజలు నాపై శ్రద్ధ వహించాలి మరియు నేను చెప్పేదే వినాలి" అని. సరే, అది కూడా లోపల కొంత ఆందోళనతో ఉండవచ్చు, ప్రత్యేకించి ప్రజలు మనపై దృష్టి పెట్టకపోతే. అసలు వాళ్ళు మన గురించి ఎందుకు ఆలోచించాలి? దీని గురించి మీరు ఆలోచిస్తే, సరైన కారణం లేకపోలేదు.

సంస్కృత పదం "క్లెషా" - టిబెటన్ భాషలో "నియోన్-మోంగ్" - చాలా కష్టమైన పదం, దీన్ని నేను ఇక్కడ "ఇబ్బంది పెట్టే భావోద్వేగం" లేదా "ఇబ్బంది పెట్టే వైఖరి" అని అనువదిస్తున్నాను. ఇది కష్టం ఎందుకంటే వాటిలో కొన్ని భావోద్వేగాలు లేదా ఆలోచనలు, ఉదాహరణకు, అమాయకత్వానికి సరిపోవు. ఇతరులపై లేదా మనపై మన ప్రవర్తన యొక్క ప్రభావం గురించి మనం చాలా అమాయకంగా ఉండవచ్చు. లేదా మనం ఒక పరిస్థితి గురించి, ఏమి జరుగుతుందో అనే రియాలిటీ గురించి అమాయకంగా ఉండవచ్చు. ఉదాహరణకు, ఒకరికి ఆరోగ్యం బాగోలేదని లేదా ఎవరైనా బాధ పడుతున్నారని మనం అమాయకులమని అనుకుందాం. అటువంటి పరిస్థితులలో, వారికి ఏదైనా చెబితే దాని ఫలితం ఎలా ఉంటుందో మనం ఖచ్చితంగా అమాయకంగా ఉండవచ్చు; మనకు మంచి ఉద్దేశాలు ఉన్నప్పటికీ, వాళ్ళు మనపై చాలా కోపంగా ఉండవచ్చు.

మనకు ఆ విధమైన ఇబ్బంది పెట్టే మానసిక స్థితి ఉన్నప్పుడు, దాన్ని మనలో అసౌకర్యాన్ని తెచ్చిపెట్టేదిగా పిలుద్దాం. కానీ మనం మనశ్శాంతిని కోల్పోయినప్పుడు, మన మనస్సు అస్పష్టంగా మారుతుంది. కాబట్టి మనం అమాయకంగా ఉన్నప్పుడు, మన మనస్సులు స్పష్టంగా ఉండవు; మనం మన చిన్న ప్రపంచంలో ఉన్నాము. మనం మన చిన్న ప్రపంచంలో ఉన్నందుకు, ఒక పరిస్థితిలో ఏది సరైనది మరియు ఏది కాదు అనే అర్థంలో మనం సొంత నియంత్రణను కోల్పోతాము. ఆ వివక్ష లేకపోవడం వల్ల మనం సరిగ్గా వ్యవహరించలేకపోతున్నాం. మరో మాటలో చెప్పాలంటే, సరిగ్గా వ్యవహరించడానికి మరియు చెడు పనిని చెయ్యకుండా ఉండటానికి మనకు సొంత నియంత్రణ లేదు. ఆ విధంగా, అమాయకత్వం ఇబ్బంది పెట్టే మానసిక స్థితి యొక్క ఈ నిర్వచనానికి సరిపోతుంది, అయినా కానీ అమాయకత్వాన్ని ఒక భావోద్వేగం లేదా ఆలోచనా విధానంగా భావించడం కష్టం. నేను చెప్పినట్లు , "క్లెషా" అనేది చాలా కష్టమైన పదం, దీనికి మంచి అనువాదం కనిపెట్టడం చాలా కష్టం.

ఇబ్బంది పెట్టని భావోద్వేగాలు

సంస్కృతం మరియు టిబెటన్ భాషలలో "భావోద్వేగాలు" అనే పదం లేదు. ఈ భాషలు మానసిక విషయాల గురించి మాట్లాడతాయి, ఇవి మన మానసిక స్థితి యొక్క ప్రతి క్షణాన్ని రూపొందించే వివిధ భాగాలు. వారు ఈ మానసిక విషయాలను ఇబ్బంది పెట్టనివిగా మరియు వినాశకరమైనవిగా విభజిస్తారు. ఆ రెండు జంటలు ఒకదానికొకటి పూర్తిగా కలవవు. దీనికి తోడు ఈ కేటగిరీల్లోకి రాని మానసిక విషయాలు కూడా ఉన్నాయి. కాబట్టి, పాశ్చాత్య దేశాలలో మనం "భావోద్వేగాలు" అని పిలిచేవి, కొన్ని ఇబ్బంది పెట్టేవి మరియు కొన్ని ఇబ్బంది పెట్టేవి కావు. అన్ని భావోద్వేగాలను వదిలించుకోవడం బౌద్ధమతం యొక్క లక్ష్యం కాదు, అస్సలు కాదు. ఇబ్బంది పెట్టే వాటిని వదిలించుకోవాలని మనం అనుకుంటున్నాం. ఇది రెండు దశలలో జరుగుతుంది: మొదటి దశ వాటిపై నియంత్రణలోకి రాకపోవడం మరియు రెండవది అవి రాకుండా వాటిని వదిలించుకోవడం.

ఇబ్బంది పెట్టని భావోద్వేగం ఏమిటి? సరే, "ప్రేమ" అనేది ఇబ్బంది పెట్టని భావోద్వేగం లేదా "కరుణ" లేదా "సహనం" అని మనం అనుకోవచ్చు. కానీ మన యూరోపియన్ భాషలలో ఉన్న ఈ పదాలను విశ్లేషించినప్పుడు, ఈ భావోద్వేగాలలో ప్రతి ఒక్కటి ఇబ్బంది పెట్టే మరియు ఇబ్బంది పెట్టని వైవిధ్యాన్ని కలిగి ఉండవచ్చని మనం చూడొచ్చు. కాబట్టి ఇక్కడ కాస్త జాగ్రత్తగా ఉండాలి. "నేను నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాను, నాకు నువ్వు కావాలి, నన్ను ఎప్పటికీ విడిచిపెట్టకు" అనే భావనే ప్రేమ అయితే, ఈ రకమైన ప్రేమ చాలా ఇబ్బంది పెట్టే మానసిక స్థితి. ఇది ఇబ్బంది పెడుతుంది ఎందుకంటే ఆ వ్యక్తి మనల్ని తిరిగి ప్రేమించకపోతే లేదా మన అవసరం లేకపోతే, మనం చాలా బాధ పడతాము. మనకు చాలా కోపం వస్తుంది మరియు అకస్మాత్తుగా, మన భావోద్వేగాలు మారుతాయి, "నేను ఇక నిన్ను ప్రేమించను" అని.

కాబట్టి, మనం ఒక మానసిక స్థితిని విశ్లేషించినప్పుడు, దాన్ని భావోద్వేగ స్థితిగా భావించి "ప్రేమ" అని పిలవవచ్చు, నిజానికి ఈ మానసిక స్థితి అనేక మానసిక విషయాల కలయిక. మనం ఒక భావోద్వేగాన్ని దానికదే ఉన్నట్లుగా అనుభవించలేము. మన భావోద్వేగ స్థితులు ఎప్పుడూ కలిసిపోయి ఉంటాయి; అందులో చాలా భాగాలు ఉన్నాయి. "నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు లేకుండా నేను జీవించలేను" అని భావించే ఆ రకమైన ప్రేమ ఒక రకమైన ఆధారపడటం మరియు ఇబ్బంది పెట్టేదిగా ఉంటుంది. కానీ అవతలి వ్యక్తి ఏం చేసినా సంతోషంగా ఉండాలని, ఆ సంతోషానికి కారణాలు ఉండాలనే ఆకాంక్ష మాత్రమే ఉండే ప్రేమ ఉంటుంది. అక్కడ వారి నుంచి మనం ఏమీ ఆశించలేము.

ఉదాహరణకు, మన పిల్లల పట్ల మనకు ఆ విధమైన ఇబ్బంది కలగని ప్రేమ ఉ౦డవచ్చు. వారి నుంచి మనం ఏమీ ఆశించము. సరే, కొంతమంది తల్లిదండ్రులు ఇలా ఉంటారు. కానీ సాధారణంగా పిల్లలు ఏం చేసినా మనం వాళ్ళను ప్రేమిస్తాం. పిల్లలు సంతోషంగా ఉండాలని మనం కోరుకుంటాం. కానీ, ఎప్పుడూ, ఇది మరొక ఇబ్బందికరమైన స్థితితో కలిసిపోయి ఉంటుంది, అంటే మనమే వారిని సంతోష పెట్టగలగాలి అని కోరుకుంటాము. మన పిల్లలను సంతోషపెట్టడానికి మనం ఏదైనా చేస్తే, అది వారికి సంతోషాన్ని కలిగించకపోతే, ఆ తర్వాత వాళ్ళు వెళ్లి కంప్యూటర్ గేమ్ ఆడటానికి ఇష్టపడతారు, అప్పుడు మనం చాలా బాధ పడతాము. మన పిల్లల ఆనందానికి కారణం కావాలనుకున్నాం తప్ప కంప్యూటర్ గేమ్ కాదు. కానీ ఇప్పటికీ మన పిల్లల పట్ల ఆ భావాన్ని "ప్రేమ" అని పిలుస్తాము. "నువ్వు సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను, నేను నిన్ను సంతోషపెట్టడానికి ప్రయత్నిస్తాను, కానీ నీ జీవితంలో అది చేస్తున్న అత్యంత ముఖ్యమైన వ్యక్తిగా ఉండాలనుకుంటున్నాను" అని అంటాము.

కాబట్టి, ఈ విస్తృతమైన చర్చ యొక్క పాయింట్ ఏమిటంటే, మన భావోద్వేగ స్థితులను మనం చాలా జాగ్రత్తగా గమనించాలి మరియు వివిధ భావోద్వేగాలను లేబుల్ చెయ్యడానికి మనం ఉపయోగించే పదాలలో చిక్కుకోకూడదు. మన మానసిక స్థితికి సంబంధించిన ఏ అంశాలు ఇబ్బంది పెడుతున్నాయో, మన మనశ్శాంతిని, స్పష్టతను, సొంత నియంత్రణను కోల్పోతాయో తెలుసుకోవడానికి పరిశోధించాలి. ఆ విషయాలపైనే మనం పని చెయ్యాలి.

ఇబ్బంది పెట్టే భావోద్వేగాలకు అసలైన కారణం అజ్ఞానం

ఈ ఇబ్బంది పెట్టే మానసిక స్థితులు లేదా భావోద్వేగాలు లేదా వైఖరుల నుంచి మనల్ని మనం వదిలించుకోవాలనుకుంటే, మనం వాటి మొదలుకు చేరుకోవాలి. వాటి వెనుక ఉన్న కారణాన్ని మనం తొలగించగలిగితే, వాటిని మనం వదిలించుకోవచ్చు. ఇది మన సమస్యలకు కారణమవుతున్న ఆందోళన కలిగించే భావోద్వేగాలను వదిలించుకోవడం మాత్రమే కాదు; ఆందోళన కలిగించే భావోద్వేగం యొక్క మూలాల వరకు మనం వెళ్ళి వాటిని వదిలించుకోవాలి.

అయితే, ఈ ఇబ్బంది పెట్టే మానసిక స్థితికి అసలైన కారణం ఏమిటి? మనకు కనిపించేది తరచుగా "అజ్ఞానం" లేదా, "తెలియకపోవడం" అని అనువదించబడుతుంది. మనకు ఒక విషయం తెలియదు. మనకు అది అసలు తెలియదు. అజ్ఞానం మనం మూర్ఖులమని చూపిస్తుంది. అలా అని మనం మూర్ఖులం కాదు. ఇది మనకు తెలియదు, లేదా మనం గందరగోళంలో ఉండవచ్చు: మనం ఏదైనా తప్పుగా అర్థం చేసుకోవచ్చు.

మనం దేని గురించి అయోమయంలో ఉన్నాము, లేదా మనకు తెలియనిది అసలు ఏమిటి? ఇది మన ప్రవర్తన మరియు పరిస్థితుల ప్రభావం. మనం చాలా కోపంగా లేదా అనుబంధంతో లేదా ఏదో ఒక విధంగా ఇబ్బంది పడతాము, మరియు ఇది ఇంతకుముందు అలవాట్లు మరియు ధోరణుల ఆధారంగా బలవంతంగా వ్యవహరించడానికి కారణమవుతుంది. కర్మ అంటే అదే, ఇబ్బంది పెట్టే భావోద్వేగం లేదా ఇబ్బంది పెట్టే వైఖరిపై ఆధారపడిన విధంగా వ్యవహరించాల్సిన బలవంతం, కాబట్టి మన సొంత నియంత్రణ లేకుండా ఇది జరుగుతుంది. 

ఆ బలవంతపు ప్రవర్తన వెనుక అజ్ఞానం ఉంటుంది: మనం చేసిన లేదా చెప్పిన దాని ప్రభావం ఎలా ఉంటుందో మనకు తెలియదు. లేదా మనం అయోమయంలో ఉంటాము: ఏదైనా దొంగలించడం మనకు సంతోషాన్ని ఇస్తుందని మనం అనుకుంటాము, కానీ అలా ఉండదు. లేదా సహాయం చేస్తే నాకు అవసరం మరియు ప్రేమగా అనిపించవచ్చని మనం అనుకుంటాం; అది అలా ఉండదు. కాబట్టి, దాని ప్రభావం ఎలా ఉంటుందో మనకు తెలియదు. "నేను అలా చెబితే నీకు బాధ కలుగుతుందని నాకు తెలియదు." అనే అయోమయంలో ఉన్నాం. "ఇది సహాయపడుతుందని నేను అనుకున్నాను మరియు అలా జరగలేదు." "ఇది నాకు సంతోషాన్ని ఇస్తుందని నేను అనుకున్నాను, కానీ అలా జరగలేదు." లేదా అది మీకు సంతోషాన్ని కలిగిస్తుంది, కానీ అలా జరగలేదు. లేదా పరిస్థితుల గురించి, "మీరు బిజీగా ఉన్నారని నాకు తెలియదు." లేదా "నీకు పెళ్లయిందని నాకు తెలియదు." అని మనం అయోమయంలో ఉండవచ్చు, "మీకు చాలా సమయం ఉందని నేను అనుకున్నాను." కానీ అలా ఏమీ లేదు. "మీరు ఒంటరిగా ఉన్నారని, ఎవరితోనూ సంబంధాన్ని పెట్టుకోలేదని నేను అనుకున్నాను, కాబట్టి నేను శృంగార సంబంధాన్ని కొనసాగించడానికి ప్రయత్నించాను" అని అంటే ఇది సరైనది కాదు. కాబట్టి, మళ్ళీ, మనకు పరిస్థితుల గురించి ఏమీ తెలియదు: మనకు అవి తెలియవు లేదా వాటి గురించి గందరగోళంలో ఉంటాము: మనం వాటిని తప్పు మార్గంలో చూస్తాము.

ఇప్పుడు మన నటనకు అవగాహన లోపమే మూలమన్నది నిజం. కానీ ఇది ఇబ్బంది పెట్టే భావోద్వేగాలకు మూలం మరియు ఇబ్బంది పెట్టే భావోద్వేగాలు బలవంతపు ప్రవర్తనతో చాలా ముడిపడి ఉన్నాయని స్పష్టంగా తెలీదు. కాబట్టి, ఈ పాయింట్లను మనం కొంచెం జాగ్రత్తగా పరిశీలించాలి.

Top