భయం: ఇబ్బంది పెట్టే భావోద్వేగాలతో వ్యవహరించడం

08:57
జీవితంలో ఏదైనా పాజిటివ్ విషయాన్ని సాధించడానికి భయం బలమైన అడ్డంకులలో ఒకటి. అయోమయ మానసిక స్థితిగా, ఇది అజ్ఞానంపై ఆధారపడి ఉంటుంది, ముఖ్యంగా సురక్షితంగా అనిపించే దానితో. అయితే, అనేక రకాల అత్యవసర మరియు తాత్కాలిక పద్ధతులతో, భయం యొక్క పక్షవాతం నుంచి మనల్ని మనం విముక్తి చేసుకోవచ్చు.

భయంతో డీల్ చెయ్యడానికి అత్యవసరమైన పద్ధతులు

టిబెటన్ బౌద్ధమతంలో, స్త్రీ బుద్ధుని ఆకారమైన తారా భయం నుంచి మనల్ని రక్షించే బుద్ధుని కోణాన్ని సూచిస్తుంది. తారా నిజానికి శరీరం మరియు శ్వాస యొక్క శక్తి-గాలులకు ప్రాతినిధ్యం వహిస్తుంది. శుద్ధి చెయ్యబడినప్పుడు, ఆమె మన లక్ష్యాలను నెరవేర్చే మరియు పనిచేసే సామర్థ్యానికి కూడా ప్రాతినిధ్యం వహిస్తుంది. ఈ సింబాలిజం శ్వాసతో మరియు భయాన్ని నిర్వహించడానికి సూక్ష్మ శక్తులతో పనిచెయ్యడానికి అనేక అత్యవసర పద్ధతులను సూచిస్తుంది.

అత్యవసర పద్ధతులు ధ్యానం చెయ్యడానికి, అధ్యయనం చెయ్యడానికి లేదా బోధనలను వినడానికి ముందు మనం చేసే సన్నాహక పద్ధతుల (ప్రిలిమినరీ) నుంచి వస్తాయి. ఈ అభ్యాసాలు అత్యవసర పరిస్థితుల్లో, మనం చాలా భయపడినప్పుడు లేదా భయాందోళనలకు గురైనప్పుడు మనల్ని శాంత పరచడానికి ఉపయోగపడతాయి. లోతైన పద్ధతులను అప్లై చేసే ముందు మనం తీసుకోవాల్సిన మొదటి దశలుగా కూడా ఇవి పనిచేస్తాయి. వాటిలో ఒక దాన్ని మాత్రమే మనం అప్లై చెయ్యవచ్చు లేదా ఈ క్రింది క్రమంలో మొత్తం ఆ ఐదింటిని అభ్యసించవచ్చు:

  1. కళ్లు మూసుకుని శ్వాస తీసుకునే సైకిల్స్ ని లెక్కించి, లోపలికి, బయటకు శ్వాసను తీసుకుంటూ, లోపలికి రావడం, కిందకు వెళ్లడం, పొత్తికడుపు కింది భాగం పెరగడం, ఆపై తగ్గిపోవడం, శ్వాస బయటకు వెళ్లడం లాంటి వాటిపై దృష్టి పెట్టాలి.
  2. శ్వాస సైకిల్స్ ని సగం తెరిచి, వదులుగా కేంద్రీకరించి, నేల వైపు చూస్తూ, బయటి శ్వాస, విరామం మరియు శ్వాసను చక్రంగా తీసుకొని, పైన పేర్కొన్న అదే దృష్టితో, కొద్దిసేపటి తర్వాత, కుర్చీ లేదా నేలను తాకిన మన అడుగు భాగాల అనుభూతి గురించి అవగాహనను జోడించండి.
  3. మనం ఏమి సాధించాలనుకుంటున్నామో (ప్రశాంతంగా మారడం) మరియు ఎందుకు సాధించాలనుకుంటున్నామో దాని ప్రేరణ లేదా లక్ష్యాన్ని పునరుద్ఘాటించండి.
  4. కెమెరా లెన్స్ లాగా మనసు, ఎనర్జీ ఫోకస్ లోకి వస్తాయని ఊహించుకోండి.
  5. శ్వాసను లెక్క చేయకుండా, శ్వాస తీసుకునేటప్పుడు పొత్తికడుపు కింది భాగం పైకి, కింద పడటంపై దృష్టి పెట్టి, శరీరంలోని శక్తులన్నీ సామరస్యంగా వెళుతుందనే భావన కలగాలి.  
Top