మూడవ ఉత్తమమైన సత్యం: బాధల యొక్క నిజమైన ముగింపు

జీవితంలో మనం అనుభవించే నిజమైన బాధలను గుర్తించి, వాటి అసలైన కారణాలను గుర్తించిన తర్వాత, వాటిని నిజంగా వదిలించుకోవాలనుకుంటే, అవి రిపీట్ కాకుండా చూసుకోవాలి. బుద్ధుడు తన స్వంత అనుభవం నుంచి గ్రహించి, ఆ తర్వాత బోధించిన మూడవ ఉత్తమమైన సత్యం ఏమిటంటే, అన్ని బాధలు మరియు వాటి కారణాలను వదిలించుకోవడం సాధ్యమవుతుంది, అవి ఎప్పటికీ రాకుండా చెయ్యవచ్చు. మనసు స్వభావం నిర్మలంగా ఉండటం వల్ల ఇది సాధ్యమవుతుంది.

నిజమైన బాధలు మరియు ఈ బాధలకు అసలైన కారణాలు

జీవితంలో మనం ఎదుర్కునే వ్యక్తిగత సమస్యలు చాలా ఉన్నప్పటికీ, మన బాధలు పదే పదే రావడాన్ని నిజమైన బాధ అని బుద్ధుడు బోధించాడు. మనం అసంతృప్తిని, తృప్తి చెందని ఆనందాన్ని నిరంతరం అనుభవిస్తూనే ఉంటాం. ప్రతి పునర్జన్మలోనూ పరిమితమైన శరీరాన్ని, మనస్సును కలిగి ఉండి ఈ భావోద్వేగ ఒడిదుడుకులను అనుభవిస్తాం. వీటిని శాశ్వతంగా కొనసాగించడానికి నిజమైన కారణాలు మన మనస్సులోనే ఉన్నాయని బుద్ధుడు బోధించాడు.

మనపై మరియు ఇతరులపై మన ప్రవర్తన యొక్క ప్రభావాల గురించి మరియు మనం, ఇతరులు మరియు అన్ని దృగ్విషయాల గురించి మన మనస్సులు తప్పుడు రియాలిటీని ప్రదర్శిస్తాయి. "నేను" అని పిలువబడే ఒక నిర్దిష్టమైన, సొంత-నియంత్రిత అస్తిత్వంగా మనం ఉన్నామని తప్పుగా ఊహిస్తాము. మన మనస్సులు కూడా మన తలల్లోని కొన్ని నిర్దిష్ట అస్తిత్వాలు అని మనం తప్పుగా ఊహిస్తాము, ఎందుకంటే మన తలలోని గొంతు మన మనస్సులో ఉన్నట్లు అనిపిస్తుంది, లేదా విషయాలను అర్థం చేసుకోవడానికి మరియు ఆలోచించడానికి మనం ఉపయోగించే ఒక పరికరం లాగా ఉంటుంది. ఈ రెండు అంచనాలు వాస్తవికతకు అనుగుణంగా లేవని మనకు తెలియదు, కానీ, అంతకంటే ఘోరంగా, అవి ఉంటాయని మనం నమ్ముతున్నాము.

"నన్ను ఎవరూ ప్రేమించరు" అనుకుంటూ నీ మీద నీకు ఎప్పుడైనా జాలి కలిగిందా? నేనెవరికీ అవసరం లేదా?" లేదా పూర్తిగా ఒత్తిడికి గురై, "నేను పరిస్థితులను హ్యాండిల్ చెయ్యలేను; అది నాకు మరీ ఎక్కువ?" ఈ సంతోషకరమైన మానసిక స్థితులు ఉన్నాయా? స్పష్టంగా లేవు. మనలో జాలి, దుఃఖం ఉండవచ్చు, కానీ ఈ భావాలు పోవాలని కూడా మనం కోరుకుంటాం. ఈ పరిస్థితిని మనం ఎలా ఊహించుకుంటామన్నదే సమస్య. ఈ దుఃఖం ఒక చీకటి మేఘం, దాని చుట్టూ ఒక ఘన రేఖ లోపల దాచబడి, "నేను" అనే దాని మీద వేలాడుతున్న ఒక రంగుల పుస్తకంలా అనిపిస్తుంది. ఈ మోసపూరిత రూపం రియాలిటీకి అనుగుణంగా ఉంటుందని నమ్మడంతో - అది అలా అనిపిస్తుంది కాబట్టి - ఎవరైనా మనల్ని ప్రేమించాలని కోరుకోవడం లేదా వారు మనకు ప్రేమను చూపించనప్పుడు మరొకరిపై కోపం లాంటి ఇబ్బంది పెట్టే భావోద్వేగాలను అభివృద్ధి చేసుకుంటాము. ఈ ఇబ్బంది పెట్టే భావోద్వేగాలు మనతో సమయం గడపాలని మరియు మనకు ఆప్యాయతను చూపించమని ఒకరిపై అహేతుకమైన డిమాండ్ చెయ్యాలనే బలవంతపు కర్మ కోరికను ప్రేరేపిస్తాయి. వారు మన డిమాండ్ కు అంగీకరించినప్పటికీ, మనం అనుభవించే స్వల్పకాలిక ఆనందం ఎప్పటికీ సరిపోదు, మరియు మనం ఇంకా డిమాండ్ చేస్తాము, ఇది అసంతృప్తికరమైన పరిస్థితిని కొనసాగిస్తుంది.

అటువంటి లూప్ లో, మన మనస్సులు గందరగోళంగా మరియు ఆలోచనలతో కప్పబడి ఉంటాయి. మనం సూటిగా ఆలోచించం, మన ప్రవర్తన అదుపు తప్పుతుంది. కానీ గందరగోళం మనస్సు స్వభావంలో భాగమా? ఈ ప్రశ్నకు సమాధానమివ్వడానికి, బౌద్ధమతంలో "మనస్సు" అంటే ఏమిటో తెలుసుకోవాలి. మనస్సు అనేది మన తలలో ఏదో ఒక సొంత-నియంత్రిత "వస్తువు" కాదు, కానీ ఇది మానసిక పనులను సూచిస్తుంది. ఇది విషయాలను అనుభవించే వ్యక్తిగత, ఆత్మాశ్రయ మానసిక చర్య. విభిన్న పరిస్థితులలో వేర్వేరు విషయాలు అనుభవించబడుతున్నప్పుడు ఇది ఎప్పుడూ మారుతూ ఉంటుంది, కానీ దాని సాంప్రదాయిక స్వభావం ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. దాని లోతైన స్వభావం కూడా ఎప్పుడూ ఒకేలా ఉంటుంది - ఇది ఏదో అసాధ్యమైన మార్గంలో ఉనికిలో ఉండదు.

మన మనస్సు ఉనికిని తప్పుగా ఊహించుకోవడానికి అనేక అసాధ్యమైన మార్గాలు ఉన్నాయి. ఉదాహరణకు, మనస్సు అనేది ఒక కాంక్రీట్ అస్తిత్వమైన "నేను" లేదా అలాంటి ఒక గట్టి అస్తిత్వంగా మనం భావిస్తాము. ఈ తప్పు అభిప్రాయాలు ఏవీ మనస్సు యొక్క అసలైన స్వభావానికి అనుగుణంగా ఉండవు కాబట్టి - అవి కేవలం కల్పనలు కాబట్టి మనస్సు యొక్క స్వభావంలో అవి భాగం కాదు - ఈ తప్పు అభిప్రాయాలపై ఆధారపడిన అన్ని మానసిక స్థితులు మనస్సు యొక్క స్వభావంలో భాగాలు కావు. ఈ మానసిక స్థితులలో "నేను" గురించి మన అపోహలు, ఆ "నేను" సురక్షితంగా ఉండటానికి ప్రయత్నించే ఇబ్బందికరమైన భావోద్వేగాలు మరియు ఆ "నేను" ని బలపరచడానికి మనల్ని అనవసరమైన పనుల్లోకి లాగే బలవంతపు కోరికలు ఉన్నాయి. ఇవేవీ మనస్సు స్వభావంలో భాగాలు కావు మరియు ఆ స్వభావం యొక్క అపోహలపై అవి ఆధారపడి ఉంటాయి కాబట్టి, ఆ అపోహలను సరైన అవగాహనతో తెలుసుకుని తర్వాత వాటిని శాశ్వతంగా తొలగించవచ్చు. మరోవైపు, ప్రేమ మరియు కరుణ లాంటి నిర్మాణాత్మక భావోద్వేగాలు మనస్సు యొక్క స్వభావం యొక్క అపోహలపై ఆధారపడి ఉండవు. ఆ పెద్ద తేడా వల్ల, సరైన అవగాహన వాటిని మార్చలేదు.

కాబట్టి, నిజమైన బాధను నిలిపివేయడం అనేది మన మనస్సులను నిలిపివేయడంలా కాదు. ప్రేమ, కరుణ, సరైన అవగాహన లాంటి అన్ని మంచి లక్షణాలతో మన మనస్సులు జీవితకాలం కొనసాగుతాయి. అజ్ఞానం, ఇబ్బంది పెట్టే భావోద్వేగాలు మరియు బలవంతపు కర్మ కోరికల నియంత్రణలో పరిమిత శరీరాలు మరియు పరిమిత మనస్సులతో నియంత్రణలో లేని రిపీట్ అయ్యే పునర్జన్మ ముగింపుకు వస్తుంది.

నిజమైన ముగింపు యొక్క నాలుగు అంశాలు

మూడవ ఉత్తమమైన సత్యం, నిజమైన ముగింపు, నాలుగు కోణాలను కలిగి ఉంది. 

  • మొదటిది, అన్ని రకాల బాధల పుట్టుకను శాశ్వతం చేసే నిజమైన కారణాలను నిలిపివేయడం. బాధ యొక్క ఏదైనా నిర్దిష్ట ఎపిసోడ్ దానికదే ముగుస్తుంది ఎందుకంటే కారణాలు మరియు పరిస్థితుల ద్వారా ప్రభావితమైన ప్రతిదీ అశాశ్వతం మరియు అనివార్యంగా ఆగిపోతుంది. "నిజమైన ముగింపు" అంటే ఇలాంటి సంఘటనలు ఎప్పటికీ రిపీట్ కావు అని. ఎందుకంటే మనస్సు స్వభావం స్వచ్ఛమైనది - ఈ నిజమైన కారణాలు పూర్తిగా లేనిది అనే అర్థంలో -- ఈ వాస్తవాన్ని అర్థం చేసుకోవడం వల్ల నిజమైన బాధల నుంచి బయటపడే మార్గం లేదనే అపోహను తిప్పికొడుతుంది.
  • రెండవది, నిజమైన ముగింపు అనేది శాంతియుత స్థితి, ఎందుకంటే ఇబ్బంది పెట్టే మానసిక వాటన్నిటినీ ఇవి శాంతపరుస్తాయి. బలమైన పెయిన్ కిల్లర్ ను తీసుకోవడం, ఏమీ అనుభూతి చెందకపోవడం లాంటి లోతైన ఏకాగ్రత స్థితిని సాధించడం మన సమస్యలన్నింటికీ నిజమైన ముగింపు అనే తప్పు ఆలోచనను ఇది తిప్పికొడుతుంది. అలాంటి పరిస్థితిలో ఎంతకాలం ఉన్నా, సమస్యలు, బాధలు లేకుండా ఉన్నా వాటికి అసలు కారణాలను తొలగించలేము. ఇది తాత్కాలిక కాలపరిమితి మాత్రమే. ఏకాగ్రత పోతుంది, మందులు అరిగిపోతాయి మరియు మన సమస్యలు మళ్ళీ తిరిగి వస్తాయి.
  • మూడవది, నిజమైన ముగింపు అనేది ఒక ఉన్నతమైన స్థితి. ప్రాపంచిక రంగంలో సాధించిన సాధన కంటే ఇది గొప్పది. వర్చువల్ ప్రపంచాన్ని మనం సృష్టించి, అన్నిటినీ తప్పించుకున్నప్పటికీ, అక్కడ దాక్కుని నిజమైన బాధలు మరియు వాటి నిజమైన కారణాల నుండి మనం తప్పించుకోలేము. "వాస్తవ ప్రపంచం" అని పిలువబడే మన సమస్యలు ఎప్పటికీ పోవు.
  • చివరగా, నిజమైన ముగింపు అనేది అన్ని నిజమైన బాధలు మరియు వాటి నిజమైన కారణాల నుంచి వచ్చింది మరియు పాక్షిక లేదా తాత్కాలికంగా వచ్చింది కాదు. ఇది దశలలో సంభవించినప్పటికీ - మనం, ఇతరులు మరియు ప్రతిదీ ఎలా ఉనికిలో ఉన్నాము అనే దాని గురించి అవగాహన మరియు అపోహలు మరియు ధోరణులుగా లోతుగా పాతుకు పోయాయి - అయినా కానీ అవి రిపీట్ కాకుండా వాటిని పూర్తిగా వదిలించుకోవడం సాధ్యమే. ఎందుకంటే అవి మనస్సు స్వభావంలో భాగాలు కావు. అవి క్షణికమైన మచ్చలు ఎందుకంటే మనస్సు స్వభావ రీత్యా స్వచ్ఛమైనది.

సారాంశం

మన నిజమైన బాధలను శాశ్వతం వదిలించుకోవడం సాధ్యమైనప్పుడు, వాటిని తగ్గించడానికి లేదా తాత్కాలికంగా అణచివేయడం దగ్గరే మనం ఎందుకు ఆగిపోతాము? వాటిని శాశ్వతంగా వదిలించుకోవడానికి కష్ట పడేటప్పుడు, వాటి ఫ్రీక్వెన్సీ మరియు తీవ్రతను క్రమంగా తగ్గించాల్సిన అవసరం ఉంటుంది, కాని మనమందరం వాటి నిజమైన ముగింపును సాధించగలమని బుద్ధుడు ముందుగానే చెప్పాడు. అలాంటప్పుడు తక్కువ స్థాయి వాటిని లక్ష్యంగా పెట్టుకోవడం ఎందుకు?       

Top