వస్తువులు కేవలం శారీరక సౌకర్యాన్ని మాత్రమే ఇస్తాయి, మానసిక సౌకర్యాన్ని ఇవ్వవు. భౌతిక వాది యొక్క మెదడు, మరియు మన మెదడు ఒకేలా ఉంటాయి. కాబట్టి, మనందరం మానసిక బాధ, ఒంటరితనం, భయం, అనుమానం మరియు అసూయను ఒకేలా అనుభవిస్తాము. అవి ఎవరి మనసునైనా ఇబ్బంది పెడతాయి. డబ్బుతో వీటిని పోగొట్టలేం - అది అసాధ్యం. కలత చెందిన మనస్సు ఉన్నవారు, అధిక ఒత్తిడితో, కొన్ని మందులను తీసుకుంటారు. అవి తాత్కాలికంగా ఒత్తిడిని తగ్గిస్తాయి, కానీ ఇతర అనేక నష్టాలను తీసుకొస్తాయి. మీరు మనశ్శాంతిని కొనుక్కోలేరు. దాన్ని ఎవరూ అమ్మరు, కానీ ప్రతి ఒక్కరికి మనశ్శాంతి అవసరం. దీని కోసం చాలా మంది మందులు కూడా తీసుకుంటారు, కానీ ఒత్తిడికి గురైన మనస్సుకు నిజమైన మందు కరుణ మాత్రమే. కాబట్టి, భౌతిక వాదులకు కరుణ అనేది చాలా అవసరం.
మనశ్శాంతి మంచి ఆరోగ్యానికి సరైన ఔషధం. ఇది భౌతిక అంశాలకు మరింత సమతుల్యతను తెస్తుంది. సరైన నిద్రకు కూడా ఇలాగే వర్తిస్తుంది. మనశ్శాంతితో మనం నిద్రపోతే మనకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని, నిద్రమాత్రలు వేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదని అందరూ చెప్తూ ఉంటారు. ఒక అందమైన ముఖం కోసం చాలా మంది జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ నీకు కోపం వస్తే ఆ ముఖానికి ఎన్ని రంగులు వేసినా ప్రయోజనం ఉండదు. నువ్వు అలా అయినా అందంగా కనపడవు. కానీ నీకు కోపం లేకుండా, చిరునవ్వు ముఖ్యం మీద ఉంటే, నీ ముఖం ఆకర్షణీయంగా, మరింత అందంగా కనిపిస్తుంది.
కరుణలో మనం బలమైన ప్రయత్నం చేస్తే, ఎప్పుడైనా కోపం వస్తే, అది కొద్ది సేపు మాత్రమే ఉంటుంది. ఇది బలమైన రోగనిరోధక శక్తిని కలిగి ఉండటం లాంటిది. వైరస్ వచ్చినప్పుడు మనకు పెద్దగా ఎలాంటి ఇబ్బంది ఉండనట్టు. కాబట్టి, మనకు సమగ్ర దృక్పథం మరియు కరుణ అవసరం. అప్పుడు, ప్రతి ఒక్కరి పరస్పర సంబంధాన్ని తెలుసుకోవడం ద్వారా, మనకు మరింత బలం లభిస్తుంది.
మంచితనంలో మనందరికీ ఒకే రకమైన సామర్థ్యం ఉంది. కాబట్టి, మిమ్మల్ని మీరే చూసుకోండి. అన్ని పాజిటివ్ సామర్థ్యాలను చూసుకోండి. నెగెటివ్ వి కూడా అలాగే ఉంటాయి. కానీ మంచి పనులకు అవకాశం చాలా ఉంటుంది. ప్రాథమిక మానవ స్వభావంలో నెగెటివ్ వాటికంటే పాజిటివ్ విషయాలే ఎక్కువ ఉంటాయి. మన జీవితం కరుణతోనే మొదలవుతుంది. కాబట్టి కోపం కన్నా కరుణ అనేదే బలంగా ఉంటుంది. కాబట్టి, మీలో మంచితనాన్ని చూసుకోండి. ఇది మీకు మరింత ప్రశాంతమైన మానసిక స్థితిని ఇస్తుంది. అప్పుడు ఏవైనా సమస్యలు వచ్చినప్పుడు వాటిని సులభంగా ఎదుర్కోగలరు.
ఒక గొప్ప భారతీయ బౌద్ధ గురువు అయిన శాంతిదేవుడు ఒక సమస్యను మనం ఎదుర్కోబోతున్నప్పుడు, దానిని నివారించడానికి లేదా అధిగమించడానికి ఒక మార్గాన్ని విశ్లేషించి చూస్తే, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పాడు. మనం దానిని దాట లేకపోతే, ఎలాంటి బాధ పడటం అవసరం లేదు అని కూడా చెప్పాడు. నిజాన్ని అంగీకరించాలి అని చెప్పాడు.