ఎలా...
ఆర్టికల్ 1 యొక్క 15
తర్వాతది Arrow right

సంతోషం కోసం 8 బౌద్ధమత చిట్కాలు

సంతోషం అనేది మన జీవితం ఎలా ఉన్నా మనమందరం అనుభవించాలని కోరుకునే విషయం. కానీ జీవితంలో ఏం జరిగినా దానిని ఎదుర్కుంటూ సంతోషంగా ఎలా ఉండాలి? దాని కోసమే ఇక్కడ కొన్ని బౌద్ధమత చిట్కాలు ఉన్నాయి:

  1. మీకు మీరు ప్రతిరోజూ కొంత నిశ్శబ్ద సమయాన్ని కేటాయించుకోండి - మీ శ్వాసపై దృష్టి పెట్టి ప్రశాంతంగా కాసేపు కూర్చోండి.
  2. వేరే వాళ్లతో ఉన్నప్పుడు, మీరు ఎలా ప్రవర్తిస్తారో మరియు ఎలా మాట్లాదుతారో గమనించుకోండి; ఒంటరిగా ఉన్నప్పుడు, మీ మనస్సులో ఏమి జరుగుతుందో గమనించండి - నిర్మాణాత్మక మార్గంలో పనిచేయడానికి, మాట్లాడటానికి మరియు ఆలోచించడానికి ప్రయత్నించండి.
  3. ప్రతిరోజూ ఎవరో ఒకరికి మంచి పనిని చేసి పెట్టండి - వాళ్ళ సంతోషం కోసం హృదయపూర్వకమైన శ్రద్ధను కలిగి ఉండండి.
  4. ఇతరులతో మంచిగా ఉండండి - ఇది మీ సొంత-విలువ యొక్క భావనను పెంచుతుంది.
  5. మీ స్వంత మరియు ఇతరుల బలమైన అంశాలపై దృష్టి పెట్టండి - వాళ్లకు సమస్యలు వచ్చినప్పుడు ఉపయోగకరమైన సూచనలు ఇవ్వండి.
  6. ఇతరులు చేసిన తప్పులను మర్చిపోండి - వాళ్లను క్షమించడం అలవాటు చేసుకోండి.
  7. మీ తప్పులను కూడా మర్చిపోండి - మిమ్మల్ని మీరు క్షమించుకోండి.
  8. నిజాన్ని అంగీకరించండి - జీవితం ఎత్తు పల్లాలతో నిండి ఉంటుంది, కానీ అది ఎంత కష్టం అయినా, అవన్నీ వాటికవే వెళ్లిపోతాయి.

సంతోషంగా ఉండటం ఎక్కడి నుంచో రాదు. మీదే దాని కోసం పని చెయ్యాలి. కానీ కష్టపడటంతో, ప్రతి ఒక్కరూ సంతోషకరమైన జీవితాన్ని గడపవచ్చు.

Top