మన గురించి లేదా మన ఫీలింగ్స్ గురించి ప్రత్యేకమైన విషయం ఏదీ లేదు

పరిచయం

మైండ్ ట్రైనింగ్ లేదా యాటిట్యూడ్ ట్రైనింగ్, టిబెటన్ భాషలో లోజాంగ్ అనేది చాలా విస్తృతమైన టాపిక్, ఇది మనం మన జీవితాన్ని ఎలా గడుపుతున్నాము మరియు మనం అనుభవించే దాని గురించి మన ఆలోచనలను ఎలా మార్చుకోవచ్చు అనే దాని గురించి వివరిస్తుంది. జీవితం ఎప్పుడూ ఒడిదుడుకులతో నిండి ఉంటుందని మనందరికీ తెలుసు మరియు సాధారణంగా అది అంత సులభమైనది కాదు. మనకు చాలా విషయాలు ఎప్పుడూ జరుగుతూ ఉంటాయి, మరియు ఇవి చాలా విస్తృతమైన కారణాలు మరియు పరిస్థితుల నుంచి వస్తాయి.

ఒక సులభమైన ఉదాహరణగా, ఈరోజు సాయంత్రం మనమందరం ఇక్కడ కలుసుకోవడం గురించి ఆలోచించండి. మిమ్మల్ని ఇక్కడికి ఏం తీసుకొచ్చింది? దాని మొత్తం భౌతిక భాగం, ట్రాఫిక్ మరియు రవాణా అనేది ఉంది. మీరు నగరంలో నివసిస్తున్నారు, ఆ తర్వాత మీకు ఏ ఆసక్తులు ఉన్నాయి, మీ కుటుంబం, పని మరియు జీవితంలో సాధారణంగా ఏమి జరుగుతోంది. అనేక కారణాలు మరియు పరిస్థితుల ఫలితంగా, మనం ఇక్కడ కలిసి ఉన్నాము, ప్రతి ఒక్కరూ భిన్నమైన నేపథ్యం మరియు వేర్వేరు కారణాలు మరియు పరిస్థితుల నుంచి వచ్చారు.

ఇప్పుడు, మనం ఇక్కడ కూర్చొన్నప్పుడు, మీరందరూ ఉన్నారు మరియు నేను మరియు ఒక అనువాదకుడిని ఉన్నాను. వీడియో కెమెరా కూడా రికార్డ్ చేస్తుంది. మీరు నన్ను చూడటానికి, కెమెరాని చూడటానికి తేడా ఏమిటి? మనలాగే, కెమెరా వివిధ కారణాలు మరియు పరిస్థితుల వల్ల ఇక్కడ ఉంది: ఎవరో దానిని తయారు చేశారు, మరొకరు కొన్నారు, వేరొక వ్యక్తి దాన్ని ఏర్పాటు చేశారు. కెమెరా మరియు మనం అందరం సమాచారాన్ని తీసుకుంటాము. అయితే, నిజమైన తేడా ఏమిటంటే, మనం తీసుకునే సమాచారం ఆధారంగా మనం భావాలను అభివృద్ధి చేసుకుంటాము, అంటే ఒక స్థాయి సంతోషం లేదా విచారం. కెమెరాలు, కంప్యూటర్లు తాము తీసుకునే సమాచారాన్ని అవి అనుభవించవు..

Top