ఎనిమిది ప్రాపంచిక ఆందోళనలు
మన మనస్సులోని అనుభవాలు, అనుభూతులతో పాటు, మన జీవితంలోని కంటెంట్ కూడా ఉంటుంది. ఇక్కడ కూడా అంతే. వీటన్నిటి గురించి పెద్ద సీన్ చెయ్యకుండా ఉండటానికి మనం ప్రయత్నించాలి. బౌద్ధమత బోధనలు జీవితంలోని ఎనిమిది తాత్కాలిక విషయాల లిస్ట్ ను చెబుతాయి - వాటిని "ఎనిమిది ప్రాపంచిక ఆందోళనలు" లేదా "ఎనిమిది ప్రాపంచిక ధర్మాలు" అని పిలుస్తారు - ప్రతిదీ ఎప్పుడూ కదలికలో ఉంటుంది, మరియు ఎప్పుడూ మారుతుందనే ఒకే ఒక సూత్రాన్ని అనుసరిస్తుంది.
లాభాలు మరియు నష్టాలు
కొన్నిసార్లు మనకు లాభాలు, కొన్నిసార్లు మనకు నష్టాలు ఉంటాయి. ఆర్థికంగా, కొన్నిసార్లు మనం డబ్బు సంపాదిస్తాము మరియు కొన్నిసార్లు డబ్బును పోగొట్టుకుంటాము. కొన్నిసార్లు మనం ఏదైనా కొంటాం మరియు అది చాలా మంచిది (ఇది లాభం), కానీ కొన్నిసార్లు అది త్వరగా పాడయిపోతుంది (ఇది నష్టం). ఇక ఇందులో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏమీ లేదు. ఇది పేకాట లేదా పిల్లలు ఆట లాంటిది; కొన్నిసార్లు మనం గెలుస్తాం, కొన్నిసార్లు ఓడిపోతాం. అయితే ఏమైంది? దీనిలో ప్రత్యేకమైనది ఏమీ లేదు.
నిజానికి ఓడిపోయాక "నేను గెలవాలనుకుంటున్నా" అని అరుస్తూ ఏడ్చే ఆ చిన్న పిల్లాడిలా ఉండకూడదని మనల్ని మనం గుర్తు చేసుకోవాలి. మీరు ఎప్పుడూ ఎందుకు గెలవాలి? ఎందుకంటే ఇది అందరూ నన్ను ఇష్టపడతారనే ఆశ లాంటిది. బౌద్ధమతంలో ఒక ఉపయోగకరమైన సామెత ఉంది, "ప్రతి ఒక్కరూ బుద్ధుడిని ఇష్టపడరు, కాబట్టి మన కోసం మనం ఏమి ఆశిస్తాము - ప్రతి ఒక్కరూ మనల్ని ఇష్టపడతారు అనా?" స్పష్టంగా అది అయితే కాదు. మన ఫేస్ బుక్ పేజీలో లైక్ బటన్ ను అందరూ ప్రెస్ చెయ్యరు. కొందరికి మనం అంటే ఇష్టం ఉండదు. అప్పుడు ఏమీ చెయ్యాలి? ఇది పూర్తిగా మామూలేనా?
ఇవన్నీ లాభనష్టాలే. మనం ఎవరితోనైనా రిలేషన్ షిప్ లోకి వెళ్లినప్పుడు, చివరికి అది ముగుస్తుంది. మనం ఇంతకు ముందు మన కిటికీ దగ్గర ఉండే అడవి పక్షి యొక్క ఉదాహరణను ఉపయోగించాము, అక్కడ అది కొద్ది సేపు ఉండటానికి వస్తుంది, కానీ అది ఫ్రీ కాబట్టి అక్కడి నుంచి ఎగిరిపోతుంది. రిలేషన్ షిప్ లోనూ అంతే. "నన్ను ఎప్పటికీ విడిచిపెట్టకు, నువ్వు లేకుండా నేను బతకలేను" అని మీరు చెప్పినా, మీరు జీవితాంతం వాళ్లతో కలిసి ఉన్నప్పటికీ, మీలో ఒకరు నిస్సందేహంగా వేరొకరి కంటే ముందే మరణిస్తారు. మనం ఒక స్నేహితుడిని పొందుతాము, ఒక స్నేహితుడిని కోల్పోతాము, దానిలో ప్రత్యేకత ఏమీ లేదు. జీవితం అలానే ఉంటుంది. ఆ స్నేహితుడు ఉన్నప్పుడు మనం సంతోషంగా ఉండలేమని మరియు వారిని కోల్పోయినప్పుడు విచారంగా ఉంటామని దీని అర్థం కాదు - ఏదీ "ఏమైనా" అనే వైఖరి లేదని భావించడం మరియు అక్కడ "ప్రత్యేకంగా ఏమీ లేదు" అని అనుకోవడం కాదు - కానీ మనం విపరీతాలకు వెళ్ళము మరియు దాని నుంచి పెద్ద సీన్ చేసుకోము.\
లాభనష్టాలకు మనల్ని మనం ఎలా స్పందిస్తాం అనేది ఆసక్తికరంగా ఉంటుంది. నేను ఎప్పుడూ నన్ను ఒక ఉదాహరణగా చూస్తాను ఎందుకంటే నేను నా వెబ్‌సైట్ అంటే నాకు చాలా ఇష్టం; రోజంతా నేను దాని పని మీదే ఉంటాను. నిజానికి, మనకు ఒక స్టాటిస్టిక్ ప్రోగ్రామ్ ఉంది కాబట్టి ప్రతిరోజూ ఎంత మంది చదువుతున్నారో నాకు తెలుసు. ఒక రోజులో పెరుగుదల ఉంటే, అది నిజంగా చాలా మంచి విషయం, కానీ అది ఒక నిర్దిష్ట సంఖ్యకు చేరుకోకపోతే లేదా నేను అనుకున్నది జరగకపోతే, అది అంత మంచిది కాదు. కాబట్టి అది ఒక రకంగా లాభం, మరియు నష్టం.
ఒక రకంగా చెప్పాలంటే నాకు చాలా తక్కువ స్థాయిలో ఆనందం కలుగుతుంది. ఇది డ్రామా కాదు. కొన్ని వారాల క్రితం, మనం ఒకే రోజులో 6,000 విసిట్స్ కు చేరుకున్నాము, అది నిజంగా, "వావ్, 6,000, అది చాలా ఎక్కువే!" కానీ దాని నుంచి వచ్చే ఆనందం చాలా చిన్నది. ఇది పెద్ద విషయం కాదు ఎందుకంటే దాని వల్ల నిజంగా ఏమీ జరగలేదు. ఆ ఫీలింగ్, "బాగుంది. ఇప్పుడు ఏమిటి? కొత్తగా ఇంకేముంది?" ఆ తర్వాత రోజు అది 4,500 విసిట్స్ కి పడిపోయింది, "అయ్యో, ఈ రోజు ఎక్కువ మంది చూడలేదు" అని నేను కొంచెం నిరాశ చెందాను. కానీ అన్నివేళలా గణాంకాలను చూడాలనే సొంత-నిశ్చితాభిప్రాయం బాగా ముఖ్యమైనదిగా కనిపిస్తుంది. "నా" గురించి ఆలోచించడం చాలా సహజమైనది కాబట్టి ఇతర విషయాలలో నిమగ్నం కంటే ఆత్మ గురించి ఈ చింతన చాలా బలంగా ఉందని బౌద్ధమతం చెబుతుంది. తనను తాను చాలా అద్భుతంగానో, గొప్పవాడిగానో, మనల్ని ఎవరూ ప్రేమించడంగానో భావించాల్సిన అవసరం కూడా లేదు, కానీ ఈ అంతర్లీన ఆలోచన ఎప్పుడూ ఉంటుంది.
మీరందరూ మీ స్వంత ఉదాహరణల గురించి ఆలోచించవచ్చు, బహుశా ఫేస్ బుక్ లేదా టెక్స్ట్ మెసేజ్ లతో సంబంధాన్ని కలిగి ఉండవచ్చు. ఈ రోజు నాకు ఎన్ని మెసేజ్ లు వచ్చాయి? ఈ రోజు నా పోస్టులను ఎవరు లైక్ చేశారు? మనం ఫేస్ బుక్ ను ఎంత తరచుగా చెక్ చేస్తాము లేదా ఏదైనా వచ్చిందా అని మన జేబుల నుంచి ఫోన్లు తీస్తాము? ఇంతకుముందు, ఈ ఇంటర్నెట్ విషయాలు ఏవీ ఉండేవి కావు, కానీ ప్రజలు పోస్ట్ మ్యాన్ తో అలాంటి పనే చేశారు. "ఈ రోజు నాకోసం ఏమైనా ఉత్తరాలున్నాయా?" "అయ్యో, నన్ను ఎవరూ ఇష్టపడరు" అని ఉత్తరాలు రాలేదు అని అనుకుంటారు. లేదా కేవలం ప్రకటనలు మాత్రమే ఉండేవి, అవి మనకు నచ్చేవి కాదు. "ప్రత్యేకమైనది ఏమీ లేదు" అనే ఈ ఆలోచన భావోద్వేగ హెచ్చుతగ్గులను చాలా తక్కువ తీవ్రతరం చెయ్యడానికి సహాయపడుతుంది, ఎందుకంటే ఏమి జరుగుతుందో దాని గురించి మనకు ఎక్కువ భావోద్వేగ సమతుల్యత మరియు సమతూకం ఉంటుంది. ఇంకా కష్టమైన విషయం ఏమిటంటే, ఏమి వచ్చిందో అని ఎప్పుడూ చెక్ చేసి చూడాలనుకునే నిమగ్నతతో వ్యవహరించడం.
మన ఆలోచనలను మార్చుకోవడం ఒక నెమ్మది మరియు సుదీర్ఘమైన ప్రక్రియ. పరిస్థితులు త్వరగానే కాదు, క్రమంగా మారిపోతాయి. మిమ్మల్ని మీరు మరింత రియలిస్టిక్ గా చూడటం ప్రారంభించినప్పుడు చాలా ఆసక్తికరంగా ఉంటుంది, అక్కడ మీరు, "నేను కంప్యూటర్ మరియు నా సెల్ ఫోన్ కు బానిసగా మారాను ఎందుకంటే నేను ఎప్పుడూ వాటిని చూడవలసి ఉంటుంది. నాకు ఎంత మంది స్పందిస్తున్నారో నేను ఎప్పుడూ చెక్ చేయాలి. నేనెందుకు బానిసను అయ్యాను?" అని అనుకుంటారు. సబ్ వేలో ఉన్న ప్రజలందరినీ చూడండి మరియు ఎంత మంది చేతిలో సెల్‌ఫోన్లు ఉంటాయి. ఎందుకని? "నేను దేనినీ మిస్ అవ్వడానికి ఇష్టపడను" అనే మనస్తత్వంతో సొంత-ప్రేమ మరియు అభద్రత ఉంటుంది. ఎందుకు? అసలు అంత ముఖ్యమైనది ఏముంది? కొన్ని విషయాలు ముఖ్యమైనవి కావచ్చు, ఏదీ ముఖ్యం కాదని మనం చెప్పడం లేదు, కానీ నిరంతరం టచ్లో ఉండటం, నిరంతరం ఆన్‌లైన్లో ఉండటం యొక్క ప్రాముఖ్యతను మనం అతిశయోక్తి చేస్తాము. దీన్ని మన భావోద్వేగాల సమతుల్యత పరంగా విశ్లేషించడం మంచిది.
కాబట్టి, కొన్నిసార్లు మనం గెలుస్తాము, కొన్నిసార్లు ఓడిపోతాము. ఇది ఒక సెట్.
విషయాలు బాగా జరుగుతున్నాయి మరియు విషయాలు సరిగ్గా జరగడం లేదు
రెండవ సెట్ ఏమిటంటే, కొన్నిసార్లు విషయాలు బాగా జరుగుతాయి, కొన్నిసార్లు అవి సరిగ్గా జరగవు. దీన్ని మనం అనేక స్థాయిలలో అర్థం చేసుకోవచ్చు, కానీ మళ్ళీ, ప్రతిస్పందన "ప్రత్యేకమైనది ఏమీ లేదు" అని ఉంటుంది. ఒక రోజు చాలా బాగా జరుగుతుంది, మరుసటి రోజు అడ్డంకులతో నిండి ఉంటుంది, ప్రజలు మనకు కష్ట సమయాన్ని ఇస్తారు అప్పుడు ప్రతిదీ తప్పుగా అనిపిస్తుంది. ఇది మామూలే. ఉదయం మన శక్తి ఎక్కువగా ఉంటుంది, మధ్యాహ్నం చాలా తక్కువగా ఉంటుంది. కొన్నిసార్లు మనం ఆరోగ్యంగా ఉంటాం, కొన్నిసార్లు మనకు జలుబు వస్తుంది. ఇందులో ప్రత్యేకమైనది ఏమీ లేదు.
ప్రశంసలు, విమర్శలు
తదుపరి సెట్ ప్రశంసలు మరియు విమర్శలకు సంబంధించినది. కొందరు మనల్ని ప్రశంసిస్తారు, మరికొందరు విమర్శిస్తారు. దీన్ని ఎలా ఎదుర్కోవాలి? అందరూ బుద్ధుడిని పూజించరు. కొంతమంది, ముఖ్యంగా అతని బంధువులు, చాలా విమర్శనాత్మకంగా ఉన్నారు. కాబట్టి అందరూ మనల్ని ప్రశంసిస్తారని మనం ఎందుకు ఆశించాలి?
నేను మళ్ళీ నా స్వంత ఉదాహరణను ఉపయోగిస్తాను. నా వెబ్ సైట్ గురించి నాకు చాలా ఇమెయిల్స్ వస్తాయి, మరియు చాలా మంది వెబ్ సైట్ తమకు ఎంత ఉపయోగకరంగా ఉందో చెప్పినప్పటికీ, అప్పుడప్పుడు విమర్శలు కూడా వస్తాయి. నిజానికి, ప్రశంసలతో వ్యవహరించడం సులభం; విమర్శలు మన మనస్సులను బాగా ఇబ్బంది పెట్టేస్తాయి.
పొగడ్తలతో, మనం చాలా గొప్పవాళ్లమో, దానికి వ్యతిరేకమో అనుకునే స్థాయికి వెళ్లకూడదు, "నేను దానికి అర్హుడిని కాదు. వాళ్లకు నిజంగా నేను తెలిస్తే వాళ్లు నన్ను ఇష్టపడరు. కానీ పొగడ్తలను చూడటం చాలా సులభం. విమర్శలు ఎందుకు అంత కష్టంగా ఉంటాయి? ఎందుకంటే మనల్ని మనం ప్రేమిస్తాం. యాటిట్యూడ్ ట్రైనింగ్ తో, మనం వారిని చూస్తాము, కాబట్టి మనం ఏమి చేశామో ఆలోచిస్తాము, అది వారి విమర్శలను మనకు పంపడానికి కారణమవుతుంది. మనం ఏదైనా సహాయం చెయ్యగలిగితే, అది కేవలం క్షమాపణ అయినప్పటికీ, "ఇది మీకు కష్టమైన సమయాన్ని ఇచ్చిందని నేను అంగీకరిస్తున్నాను. నన్ను క్షమించండి, అది నా ఉద్దేశం కాదు" అని నెమ్మదిగా మన దృష్టిని ఇతరులను ఆదరించడం వైపు మళ్లించవచ్చు.
ఇతరులతో మన సాధారణ, రోజువారీ పరస్పర పనులలో మనం దీన్ని చేయవచ్చు. కొన్నిసార్లు వాళ్ళు మనతో సంతోషంగా ఉంటారు మరియు కొన్నిసార్లు అలా ఉండరు. ప్రజలు మనతో సంతోషంగా ఉంటే, అది సులభమే. మన జీవితంలో కొంతమంది వ్యక్తులు ఉంటారు, వాళ్ళను ఎదుర్కోవడం కష్టం మరియు వాళ్ళు ఎప్పుడూ మనల్ని విమర్శిస్తారు లేదా మన పట్ల నెగెటివ్ గా ఉంటారు. వారి పట్ల మన వైఖరి ఏమిటి? మనం వారిని చాలా కష్టమైన, అసహ్యకరమైన వ్యక్తిగా గుర్తిస్తామా? లేక వారు చాలా అసంతృప్తిగా ఉన్నారని మనం గుర్తిస్తామా? మీ అందరి జీవితాల్లో ఇలాంటి వ్యక్తులు ఉన్నారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. వాళ్ళు మీకు కాల్ చేస్తారు లేదా కలుసుకుని భోజనం చెయ్యాలనుకుంటున్నారు మరియు ఇది 100% తమ గురించి మాట్లాడటం మరియు కంప్లయింట్ చెయ్యడం కోసమే అని మీకు తెలుసు. "అయ్యో, ఈ వ్యక్తి మళ్ళీ వచ్చాడా" అని మీరు అనుకోవచ్చు. కానీ మీరు ఎప్పుడూ బిజీగా ఉన్నారని అతనికి చెప్పలేరు!
వారితో ఉండటం మరియు వారి కంప్లైంట్ వినడం నాకు ఎంత చెడుగా అనిపించిందో ఆలోచించడం మన ప్రతిస్పందన అయితే, అప్పుడు మనం మన అభిప్రాయాన్ని మార్చవచ్చు: ఈ వ్యక్తి ఎప్పుడూ కంప్లైంట్ చేస్తున్నాడు ఎందుకంటే అతను చాలా దుఃఖంలో మరియు ఒంటరిగా కూడా ఉన్నాడు అని. సాధారణంగా కంప్లైంట్ చేసే వ్యక్తులతో ఉండటానికి ఎవరూ ఇష్టపడరు. కాబట్టి మనం వారితో కొంత సమయం గడపాల్సి వస్తే, మనం ఎక్కువ సానుభూతిని పెంపొందించుకోవచ్చు, మరియు ఇది అంత భయంకరమైన అనుభవం కాదు, ఎందుకంటే మనం వారి గురించే ఆలోచిస్తాము, "నా" గురించి కాకుండా.
మంచి వార్తలు మరియు చెడు వార్తలు వినడం
నాలుగో సెట్ లో మంచి, మరియు చెడు వార్తలు వింటున్నారు. ఇది మునుపటిలా ఉంటుంది: ప్రతిదీ ఎప్పుడూ మారుతూ ఉంటుంది. నిజానికి, నాలుగు సెట్లు ఒకదానికొకటి అతివ్యాప్తి చెందుతాయి మరియు "ప్రత్యేకమైనది ఏమీ లేదు" అనే సూత్రం ఈ ఎనిమిదింటికి వర్తిస్తుంది. మంచి లేదా చెడు వార్తలు వినడంలో ప్రత్యేకత ఏమీ లేదు, ఇది ప్రతి ఒక్కరి జీవితంలో జరుగుతుంది.
ఇప్పుడు, కొంతమంది ఈ రకమైన శిక్షణను వ్యతిరేకిస్తారు, వారు భావోద్వేగ రోలర్కోస్టర్లో ఉండటానికి ఇష్టపడతారు, ఎందుకంటే ఒడిదుడుకులు లేకపోతే, వాళ్ళు నిజంగా సజీవంగా ఉండలేరు. కానీ ఇది సహాయక ఆలోచన అవునా కాదా అని మనం పరిశీలించాలి.
ముందుగా, మనం భావోద్వేగ రోలర్కోస్టర్లో ఉన్నా లేకపోయినా, మనం ఇంకా బతికే ఉన్నాము. అది కాస్త వెర్రి అభ్యంతరమే. కాబట్టి, మనం భావోద్వేగ రోలర్కోస్టర్లో ఉన్నప్పుడు ఏమి జరుగుతుంది? సరే, మనం నిజంగా హేతుబద్ధంగా ఆలోచించడం లేదు, ఎందుకంటే మనం భావోద్వేగాలతో మునిగిపోతాము. మనం ప్రశాంతంగా ఉంటే, మన జీవితం అంత నాటకీయంగా ఉండదు మరియు పరిస్థితులను బాగా మెరుగైన మార్గంలో ఎదుర్కోగలుగుతాము. మీరు స్పష్టంగా ఆలోచించకపోతే మరియు కోపంగా ఉంటే, మీరు తర్వాత పశ్చాత్తాపం పడే విషయాలను చెబుతారు. మన భావోద్వేగాల పరంగా సమదృష్టితో ఉండటం అంటే మనం ఇలాంటి పనులు ఇక చెయ్యం అని అర్థం. ప్రతి ఒక్కరూ ఆనందాన్ని కోరుకునే విషయంలో, ఈ రకమైన ప్రశాంతమైన, ఆనందం నాటకీయమైన "ఓహ్ హూపీ!" రకం ఆనందం కంటే చాలా స్థిరంగా ఉంటుంది.
"ప్రత్యేకమైనది ఏమీ లేదు" కోసం కాన్సెప్ట్ ఫ్రేమ్ వర్క్
మనం మాట్లాడుకుంటున్న ఈ విధానానికి ఆధారం లేదా భావనాత్మక ఫ్రేమ్ వర్క్ ను చూద్దాం. ఇక్కడ భావనాత్మక ఆలోచనలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. భావనాత్మక ఆలోచన అంటే ఏమిటి? భావనాత్మక ఆలోచన అనేది విషయాలను చూడటం లేదా విషయాలను ఒక రకంగా అనుభవించడం, ఇది "ఏదో ప్రత్యేకమైనది" లాంటిది కావచ్చు. ఇది ఒక రకమైన మానసిక బాక్స్ ను కలిగి ఉండటం లాంటిది, మరియు మనం ఏదైనా అనుభవించినప్పుడు దానిని "ఏదో ప్రత్యేకమైనది" అనే మానసిక బాక్స్ లో ఉంచుతాము.
మనం ఎప్పుడూ ఇలా చేస్తాము ఎందుకంటే మనం ఇలాగే విషయాలను అర్థం మరియు ప్రాసెస్ చేసుకోగలుగుతాము. "స్త్రీ" అనే మానసిక బాక్స్ ఒకటి ఉంది. నేను ఒక వ్యక్తిని చూసి ఆమెను "స్త్రీ" అనే మానసిక బాక్స్ లో ఉంచాను. ఇలా మనం అనుభవించే వివిధ విషయాలను వేర్వేరు మానసిక బాక్సులలో ఉంచగలుగుతాం. ఉదాహరణకు, "పురుషుడు" లేదా "స్త్రీ" లో మనం ఉంచే అదే వ్యక్తి "యువకుడు" లేదా "వృద్ధుడు" లేదా "బంగారు జుట్టు వ్యక్తి" లేదా "ముదురు జుట్టు వ్యక్తి" లోకి కూడా వెళ్ళవచ్చు. కాబట్టి, ఇలా చాలా బాక్సులు ఉన్నాయి.
నిజానికి బాక్సులలో వస్తువులు ఉండవు. ఇది స్పష్టంగా అనిపించినప్పటికీ, నిజంగా అర్థం చేసుకోవడం మరియు జీర్ణించుకోవడం ఇప్పటికీ చాలా కష్టమైనదే. ఉదాహరణకు, మనం ఎవరినైనా "భయంకరమైన వ్యక్తి" బాక్స్ లో ఉంచవచ్చు, కాని ఎవరూ భయంకరమైన వ్యక్తిగా ఉండరు, ఎందుకంటే వాళ్ళు నిజంగా అలా ఉంటే, ప్రతి ఒక్కరూ వారిని అలా చూస్తారు, మరియు వారు చిన్నప్పటి నుంచి అలానే ఉండాలి.
ఈ మెంటల్ బాక్స్ లు విషయాలను అర్థం చేసుకోవడానికి మనకు సహాయపడతాయి, మరియు ఇతరుల పట్ల మన ఆలోచన మనం వస్తువులను ఉంచే మానసిక బాక్స్ రకాన్ని బట్టి నిర్ణయించబడుతుంది. ఈ మెంటల్ బాక్స్ లు కేవలం మానసిక నిర్మాణం మాత్రమేనని, రియాలిటీని సూచించవని మనం గుర్తుంచుకోవాలి - బయట బాక్సులు ఉన్నాయా, లేవు కదా?!
ఈ బాక్సులను మనం ఎలా సృష్టించాలి?
ఆ తరహా మెంటల్ బాక్స్ లో కాకుండా వస్తువులను ఎలా గుర్తించాలో, ఎలా ఉంచాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. వస్తువు యొక్క ఒక నిర్దిష్ట లక్షణం ఆధారంగా మనం దీన్ని చేస్తాము, అది నిజంగా ఇతర విషయాల నుంచి భిన్నంగా ఉంటుందని మనం అనుకుంటాము. దీనిని "నిర్వచించే లక్షణం" అని పిలుస్తారు, దీనికి ఇది సాంకేతిక పదం. ఒక సాధారణ ఉదాహరణ ఏమిటంటే, మనం వస్తువులను "చతురస్రాకారం" అనే బాక్స్ లో ఉంచినప్పుడు నిర్వచించే లక్షణం ఏమిటో చూడటం. సరే, ఇది నాలుగు సమాన భుజాలను కలిగి ఉండాలి - కాబట్టి ఇది ఉన్న వస్తువులను మేము "స్క్వేర్" అని పిలువబడే మానసిక బాక్స్ లో ఉంచుతాము.
అది ఒక సాధారణ వర్గం, కానీ "చికాకు కలిగించే వ్యక్తి" వర్గం అంటే ఏమిటి? "మీరు చికాకు కలిగించే వ్యక్తి" అనే ఈ బాక్స్ లో వారిని చూసేలా చేసే వ్యక్తికి ఉన్న లక్షణాలు ఏమిటి? చిరాకు కలిగించేది ఏమిటో ప్రయత్నించడం ఆసక్తికరంగా ఉంటుంది. మీ తల చుట్టూ చక్కర్లు కొడుతున్న ఈగకు, ఈ వ్యక్తికి ఉన్న సారూప్యత ఏమిటి, అది మన ఇద్దరినీ "చికాకు కలిగించే" బాక్స్ లో ఉంచేలా చేస్తుంది?
నేను చెప్పేది ఏమిటంటే, రెండూ నా భావోద్వేగ సమతుల్యతను మరియు మనశ్శాంతిని, నా ప్రశాంతమైన మానసిక స్థితిని కోల్పోయేలా చేస్తాయి. కాబట్టి, నిజానికి, మనం మానసిక బాక్స్ ను నా వైపు నుంచి నిర్వచిస్తున్నాము,వాళ్ళ వైపు నుంచి కాదు, ఎందుకంటే నాకు చిరాకు కలిగించేది మీకు చిరాకు కలిగించకపోవచ్చు. నా మనశ్శాంతిని కోల్పోయేలా చేసే విషయాల విషయానికొస్తే, అది కూడా నేను పూర్తిగా ఆకర్షించే విషయం కావచ్చు, అది నన్ను వెర్రివాడిని చేస్తుంది. కాబట్టి ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, మనం వస్తువులను ఎలా నిర్వచిస్తాము మరియు వాటిని బాక్స్ లలో ఎలా ఉంచుతాము అనేది నిజంగా మన గురించి మనం ఆందోళన చెందడమే.
అప్పుడు మనకు ఈ ఫీలింగ్స్ అన్నీ ఉంటాయి. ఇప్పుడు అది ఆసక్తికరంగా మారడం మొదలవుతుంది (బహుశా ఇది అప్పటికే ఆసక్తికరంగా ఉండవచ్చు). కాబట్టి, మనకు "సంతోషం" అనే మానసిక బాక్స్ ఉంటుంది. ఆ "సంతోషం" బాక్స్ లో వస్తువులను ఎలా ఉంచుతారు? అని చెప్పడం చాలా కష్టం. "మీరు సంతోషంగా ఉన్నారా?" అని ఎవరైనా మమ్మల్ని అడుగుతారు మరియు మనకు ఏమి సమాధానం చెప్పాలో కూడా తెలియదు. "నేను సంతోషంగా ఉన్నానా?" అని మనల్ని మనం ప్రశ్నించుకుంటే, దాని అర్థం ఏమిటో కూడా మనకు తెలియదు. కాబట్టి, సంతోషంగా ఉండటానికి నిర్వచించే లక్షణం ఏమిటి? మనం సంతోషంగా ఉండాలని బాగా కోరుకుంటాం, కానీ సంతోషం అంటే ఏమిటో కూడా మనకు తెలియదు. విచిత్రం, కదా? దాని అర్ధం ఏమిటంటే, మీరు దాన్ని అనుభవించినప్పుడు, మీరు దాని నుంచి విడిపోవడానికి ఇష్టపడరు; ఇది అలాగే కొనసాగాలని కోరుకుంటారు. బౌద్ధమత సాహిత్యంలో మనకు కనిపించే నిర్వచనం అదే, కాబట్టి అది మనకు సహాయపడుతుంది.
ఫేస్ బుక్ సంగతేంటి? విషయాలను "లైక్" అని ఎలా నిర్వచించాలి? ఇది మనల్ని నవ్వించే మరియు మంచి అనుభూతిని కలిగించే విషయం కావచ్చు. కానీ మీరు రోజంతా చూడవలసి వస్తే, మనకు ఇకపై అది నచ్చదు కదా? కాబట్టి ఇది వింతగా ఉంటుంది, కదా?
మీకు భావనాత్మక ఆలోచన ఉన్నప్పుడు, వర్గానికి ప్రాతినిధ్యం వహించే దాని యొక్క మానసిక చిత్రం ఎప్పుడూ ఉంటుంది. కాబట్టి, మీరు "కుక్క" అని అనుకున్నప్పుడు, మీకు కుక్క యొక్క మానసిక చిత్రం ఉంటుంది, ఇది ప్రతి ఒక్కరికి భిన్నంగా ఉంటుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. సెక్సీ పర్సన్ లేదా చిరాకు కలిగించే వ్యక్తికి ప్రాతినిధ్యం వహించే మానసిక ఇమేజ్ విషయంలోనూ అంతే.
కాబట్టి, నేను ఇష్టపడేదాన్ని ఏది చూపిస్తుంది? అది ఇంకా కష్టం. "నాకు ఈ స్టైల్ అంటే ఇష్టం, నాకు ఈ తరహా ఫుడ్ అంటే ఇష్టం, నాకు ఈ తరహా సినిమా అంటే ఇష్టం, ఆ అమ్మాయి నా టైప్ కాదు, ఆ అబ్బాయి నా టైప్" అని చెప్పుకుంటూ ఉంటాం కదా. నేను ఇష్టపడేదాన్ని ఏది చూపిస్తుంది? ఫేస్ బుక్ లో ఒక ఇమేజ్ తో, మనకు నచ్చిన దాన్ని మన అనుభవంతో పోల్చి, తర్వాత దాన్ని మన "లైక్" కేటగిరీలో ఉంచుతామా? ఇవన్నీ వస్తువు నుంచి కాకుండా మన మనసుల వైపు నుంచి వస్తున్నాయని గుర్తుంచుకోవాలి. వస్తువు నుంచి ఏదైనా వస్తుంటే, ఆ వస్తువులో నిజమైన పోలిక ఉంటే, అది అందరికీ నచ్చుతుంది. కాబట్టి, ఇదంతా సబ్జెక్టివ్ గా ఉంటుంది.
"ప్రత్యేకమైనదానిని" డిఫైన్ చెయ్యడం
తర్వాతి స్టెప్ అసలు ఒక దాన్ని అది ప్రత్యేకమైనదిగా ఏది చేస్తుందో తెలుసుకోవడం. వస్తువు ప్రక్కన ఏదైనా ఉందా లేదా మనల్ని మనం నిర్వచించుకున్న "ఏదైనా ప్రత్యేకమైనది" అనే మానసిక బాక్స్ ఉందా? ఏదైనా ప్రత్యేకతను మనం చూసినప్పుడు, "ప్రత్యేకమైనది ఏమీ లేదు" అనే సైద్ధాంతిక ఆధారాన్ని అర్థం చేసుకోవడం ప్రారంభిస్తాము. వస్తువు ప్రక్కనే ప్రత్యేకత ఏమీ లేదు. "ప్రత్యేకమైనది" యొక్క ఏదైనా ఆలోచన పూర్తిగా మన స్వంత ఆలోచనల నుంచి వస్తుంది, మన స్వంత "ప్రత్యేకమైన" మానసిక బాక్స్ నుంచి వస్తుంది. ఇది మనం విషయాలను గ్రహించే ఫిల్టర్: ఇది ప్రత్యేకమైనది మరియు అది కాదు అని.
అలాంటప్పుడు ప్రత్యేకతను ఎలా నిర్వచించాలి అని మనల్ని మనం ప్రశ్నించుకోవచ్చు. "ఇది నిజంగా ప్రత్యేకమైన పెయింటింగ్" లేదా "ఇది ప్రత్యేకమైన భోజనం" అని కొంతమంది చెబుతారు. కానీ ప్రతిదీ ప్రత్యేకమైనది కాదా? ఏ రెండు విషయాలు ఒకేలా ఉండవు. క్యాబేజీల గుంపులో ఉన్న ప్రతి క్యాబేజీ ఒక ప్రత్యేకమైన క్యాబేజీ.
అప్పుడు మీరు ఇలా అనుకోవచ్చు, "సరే, పరిస్థితులు వేరు వేరుగా ఉండాలి. స్పెషల్ గా ఉండాలంటే అవి డిఫరెంట్ గా ఉండాలి. కానీ అవి ఎంత భిన్నంగా ఉండాలి? సాధారణ మరియు ప్రత్యేకమైన మధ్య రేఖను మనం ఎలా మరియు ఎక్కడ గీయాలి? మనం ఎలా నిర్ణయించగలం? అని.
అప్పుడు ఏదైనా ప్రత్యేకత కొత్తగా ఉండాలని మీరు చెప్పొచ్చు. కానీ అది నాకు కొత్తదా, విశ్వానికి కొత్తదా? మనం సాధారణంగా ప్రతిదాన్ని "నేను" అనే విధంగా నిర్వచిస్తాము మరియు మనకు లభించే ప్రతి అనుభవం కొత్తది, కదా? నేను నిన్న అనుభవించిన అనుభవాన్ని ఈ రోజు అనుభవించడం లేదు. ఈ రోజు నిన్నటిది కాదు. కాబట్టి, ఒక విధంగా, ప్రతిదీ ప్రత్యేకమైనది, అంటే నిజానికి ఏదీ ప్రత్యేకమైనది కాదు. ప్రతిదీ ప్రత్యేకమైనది, ప్రతిదీ భిన్నమైనది, మరియు ప్రతిదీ వ్యక్తిగతమైనది, కాబట్టి మనం ప్రత్యేకమైనదిగా ఏమీ చెప్పలేము. మనకు నచ్చడం వల్ల ఏదైనా ప్రత్యేకత ఉందని చెబితే, మనకు నచ్చినవి ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయని మనందరికీ తెలుసు. అది మనకు ఎక్కువగా దొరికితే, అది మనకు ఇంక నచ్చదు, మరియు ఎక్కువసేపు ఉంటే, మనం విసుగు చెందుతాము.
వస్తువులను "ప్రత్యేక" బాక్స్ లో ఉంచే మన వ్యసనం నుంచి బయటపడటానికి మనకు సహాయపడటానికి ఇవి పనిచేస్తాయి. "ఇప్పుడు నేను అనుభవిస్తున్నది చాలా ముఖ్యం." ఎందుకు? ఇది "ముఖ్యమైన" బాక్స్ లో ఎందుకు ఉంది? అని. కాబట్టి, అనవసరమైన మెంటల్ బాక్స్ లలో దేనినీ చూడకుండా ఉండటానికి మనం ప్రయత్నిస్తాము. నిజానికి, ఉపయోగకరమైన, అవసరమైన బాక్సులు ఉన్నాయి; అవి లేకుండా మనం భాషను అర్థం చేసుకోలేము. ఒకే పదాన్ని చెప్పడానికి ప్రజలు వేర్వేరు ఉచ్ఛారణలు మరియు వాల్యూమ్ లతో వేర్వేరు శబ్దాలను చేస్తారు, ఇది పదానికి మానసిక బాక్స్ ను కలిగి ఉండటం వల్ల మాత్రమే మనకు అర్థం అవుతుంది.
కాబట్టి, మనం అన్ని బాక్స్ లను విసిరివేయలేము. కానీ కొన్ని మానసిక బాక్సులు సహాయపడవు, ఎందుకంటే అవి "ఏదో ప్రత్యేకమైనవి" లాగా పూర్తిగా సబ్జెక్టివ్. మీరు దాన్ని విశ్లేషించడం ప్రారంభించినప్పుడు, ఇదంతా మన ఆలోచనలలో ఉంటుంది: ప్రత్యేకత ఏమిటో చెప్పలేక పోయినా, మనం దానిని ప్రత్యేకమైనదిగా నమ్ముతాము.
ఈ విధంగా, మనం సొంత నియంత్రణ మరియు క్రమశిక్షణను ఉపయోగించడం లేదు, "నేను విషయాలను ప్రత్యేకమైనదిగా చూడను" ఎందుకంటే వాటిని నిజానికి అమలు చెయ్యడం చాలా కష్టం. కానీ అవగాహన ద్వారా, అదంతా కేవలం మానసిక నిర్మాణం కాబట్టి, నిజంగా ప్రత్యేకమైనది ఏదీ లేదని మనం తెలుసుకోవచ్చు.
భావనాత్మక ఆలోచనను అర్థం చేసుకోవడం ద్వారా మైండ్ ట్రైనింగ్
మైండ్ ట్రైనింగ్ ద్వారా మన ఆలోచనలతో పనిచెయ్యడానికి చాలా స్థాయిలు ఉన్నాయి. వివిధ మానసిక బాక్స్ ల ద్వారా మనం విషయాలను గ్రహించగలము మరియు మనం గ్రహించే వస్తువులను ఒక బాక్స్ నుంచి మరొక బాక్స్ కు మార్చవచ్చు. కాబట్టి ఒకరిని "చికాకు కలిగించే, ఫిర్యాదు చేసే “వ్యక్తిలో” ఉంచడానికి బదులుగా, మనం వారిని "అసంతృప్తికరమైన, ఒంటరి “వ్యక్తిలో” ఉంచుతాము, ఇది ఆ వ్యక్తితో వ్యవహరించే మన పూర్తి విధానాన్ని మారుస్తుంది. వ్యక్తి వైపు అంతర్లీనంగా ఏమీ లేదని మనం గ్రహిస్తాము, కానీ మనం వారిని ఎలా గ్రహిస్తాము అనే దానిపై మన ఆలోచనే వారిని ఎలా అనుభవిస్తాము అనే దానిపై ప్రభావం చూపిస్తుంది.
"ప్రత్యేకమైనది" లాంటి కొన్ని మానసిక వర్గాలు అస్సలు సహాయపడవు. ప్రత్యేక వ్యక్తులు, ప్రత్యేక సందర్భాలు, అన్ని రకాలు ఉంటాయి. కానీ పుట్టినరోజులు లేదా న్యూ ఇయర్ చాలా స్పెషల్ అని తలచుకుంటే ఎంత నిరంకుశంగా ఉంటుందో ఆలోచించారా? దీని ప్రత్యేకత ఏమిటి? అది ప్రత్యేకం అని ప్రజలు నిర్ణయించారు అంతే. జనవరి 1 గురించి ఏమీ ప్రత్యేకత లేదు, మరియు ఆ తేదీ ఖగోళ పరంగా దేనినీ సూచించదు. భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది, మరియు మీరు ప్రారంభాన్ని సూచించలేరు: "అయ్యో! ఇది ఈ సంవత్సరపు మొదటి రోజు" అని. మొదటి రోజు అనేది ఏదీ ఉండదు, అందుకే ప్రతి సంస్కృతికి దాని స్వంత కొత్త సంవత్సరం ఉంటుంది. అందులో ప్రత్యేకత ఏమీ లేదు. మీరు కొత్త సంవత్సరాన్ని జరుపుకునే సంస్కృతిలో ఉంటే, అది మూర్ఖంగా భావించాల్సిన అవసరం లేదు, కానీ అంత అతిగా ఉత్సాహపడి దాని గురించి పెద్ద సీన్ చెయ్యాల్సిన అవసరం కూడా లేదు.
భావనాత్మక ఆలోచన ఎలా పనిచేస్తుందనే దాని యొక్క ప్రాథమిక స్వభావాన్ని, మానసిక బాక్స్ లు మరియు వర్గాలు మరియు ఈ నిర్వచించే లక్షణాలను మనం అర్థం చేసుకున్నప్పుడు, అది సహాయకారిగా ఉన్నప్పుడు దాన్ని ఉపయోగించవచ్చు మరియు అలా లేనప్పుడు దాన్ని వదిలివేయవచ్చు.
చివరిగా, మన ఆలోచనలను మార్చినప్పుడు మరియు మెరుగుపర్చుకున్నప్పుడు, కొంచెం ప్రేరణ మరియు సహనం ఉండాలి. పదే పదే సాధన చెయ్యడం ద్వారా మార్పు గురించి మనం ఎంత ఎక్కువగా తెలుసుకుంటే, అది మన జీవితంలోకి అంత సహజంగా వస్తుంది. మనం అసంతృప్తిగా ఉన్నప్పుడు మనం చేయాల్సిందల్లా, "హేయ్, నేను నా గురించి, మాత్రమే ఆలోచిస్తున్నాను" అని మనల్ని మనం గుర్తు చేసుకోవడమే.
యాటిట్యూడ్ ట్రైనింగ్ ఒక సుదీర్ఘ ప్రక్రియ, కానీ ఇది చాలా విలువైనది.
సారాంశం
మనం ప్రతిరోజూ ఉదయం ఒకే లక్ష్యంతో మేల్కుంటాము: మనం మంచి, సంతోషకరమైన భవిష్యత్తును కోరుకుంటున్నాము. ఇందులో మనమంతా ఒకటే. "నేను" విశ్వానికి కేంద్రం అని అనుకోవడంలో మనమందరం సమానం, ఈ రియాలిటీ మనకు చెప్పలేని సమస్యలను తెచ్చిపెడుతుంది. "నన్ను" చూసుకోవడం వల్ల చాలా ఆకర్షణీయంగా కనిపించే స్వంత-ప్రేమ కారణంగా, మనం నిజానికి దుఃఖం వైపు పరిగెత్తుతాము మరియు మనం కోరుకునే ఆనందానికి దూరంగా పోతాము. మనం వాస్తవికతను అర్థం చేసుకోవడం ప్రారంభించినప్పుడు, విషయాలు అవి ఎలాగైతే అలా ఉన్న విధానం మారిపోతాయి. జీవితం ఎప్పుడూ మారుతూ ఉంటుంది, అది ఎప్పుడూ ఒకేలా ఉండదు; మనం దీన్ని నియంత్రించలేము, కానీ మన స్వంత వైఖరిని మనం నియంత్రించగలము: మనం అనుభవించే విషయాలకు ప్రతి క్షణం ఎలా ప్రతిస్పందిస్తామో దాన్ని మార్చుకోగలం. శ్రమతో, బయటి పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ, మన గురించి మరియు ఇతరుల గురించి నిజంగా శ్రద్ధ వహించే మన జీవితాలను సంతోషకరమైనవిగా మార్చవచ్చు.