బౌద్ధమతం మరియు అద్వైత వేదాంతంలో అద్వైతవాదం

మిగతా భాషలు

బౌద్ధమతంలో అద్వైతవాదం

చిత్తమాత్ర వ్యవస్థ

భారతీయ బౌద్ధమత సిద్ధాంతాల చిత్తామాత్ర (మనస్సు మాత్రమే ఉండే) వ్యవస్థలో, అద్వైతవాదం అనేది జ్ఞానానికి సంబంధించిన (వస్తువు) స్వరూపం (శూన్యత) మరియు వివిధ జన్మ మూలాల (సం. ద్రవ్య) నుంచి వచ్చే జ్ఞాన పరమైన విషయం. రొట్టె తయారీ కోసం వాడే పొయ్యి లేదా మట్టి కుండ తయారీ కోసం వాడే కుమ్మరి చక్రం లాంటిది ఏదైనా అది పుట్టిన దాని నుంచి మరియు దాన్ని ఉత్పత్తి చేసేదే దాని పుట్టుక మూలం ఒక వస్తువు యొక్క ఆవిర్భావం, చైతన్యం మరియు దాన్ని గ్రహించే మానసిక విషయాలు రెండింటికి జన్మ మూలం కర్మ ధోరణి (బీజా, విత్తనం), ఇది అలయవిజ్ఞానంపై (సర్వాంతర్యామి పునాది యొక్క చైతన్యం, భాండాగార చైతన్యం) ఆధారపడిన ఒక ప్రేరణ. 

  • ఒక ప్రేరణ దానికదే ఉనికిలో ఉండదు మరియు అది ఏ ఆధారం లేకుండా స్వతంత్రంగా గుర్తించబడదు. 

ఒక వస్తువు యొక్క రూపం దాని పుట్టుక మూలం "బయటి" వస్తువు నుంచి వస్తుందని కాదు. "బయటి" అంటే దాన్ని గ్రహించే మనస్సు నుంచి ఒక ప్రత్యేకమైన జనన మూలాన్ని కలిగి ఉండటం. వస్తువులు మరియు వాటి చైతన్యం వేర్వేరు జనన మూలాల నుంచి వచ్చినట్లు అనిపిస్తాయి, కాని ఆ అద్వైతవాదం ఒక భ్రమ లాంటిది. ఇది నిజమైన పరిస్థితికి అనుగుణంగా ఉండదు.

ఏదేమైనా, చిత్తామాత్ర వ్యవస్థ, గ్రహణ వస్తువులు (చూడటం, వినడం మొదలైనవి) మాత్రమే, వాటి చైతన్యం, అలయవిజ్ఞానం, అలాగే శూన్యత (అశాశ్వతత్వం) అన్నీ తిరుగులేని ఉనికిని కలిగి ఉన్నాయని చెప్తుంది, అంటే వాటి ఉనికిని ఇది లేదా వాటి వైపులా లక్షణాలను నిర్వచించడం ద్వారా స్థాపించబడుతుంది, అవి ఒక ప్రాతిపదికపై ఒక ప్రేరణ లాగా కాకుండా స్వతంత్రంగా (నిజంగా లేని వర్గానికి భిన్నంగా,  కొన్ని లక్షణాలను పంచుకునే వ్యక్తిగత వస్తువులపై ఒక ప్రేరణ విషయంగా) ఉంటాయి.

గెలుగ్ రహిత మధ్యమాక వ్యవస్థలు 

సాక్య, నైంగ్మా, కాగ్యు మధ్యమాక వ్యవస్థలలో అద్వైతవాదంకు ఇలాంటి అర్థమే ఉంటుంది. ఇది కనపడే రూపాన్ని (వస్తువు) కోల్పోవడం అని మరియు జ్ఞానం యొక్క అభిజ్ఞా అంశం ఒకదానికొకటి ప్రత్యేకమైన ఉనికిని కలిగి ఉండటం మరియు వివిధ మూలాల నుంచి రావడాన్ని సూచిస్తుంది (అవి "జనన మూలం" అనే పదాన్ని ఉపయోగించనప్పటికీ). వాళ్ళు అలయవిజ్ఞానాన్ని చిత్తమాత్ర నుంచి వేరుగా చెప్తారు, మరియు ఈ మూడు టిబెటన్ వ్యవస్థలలో ప్రతి ఒక్కటి స్పష్టమైన కాంతి (సూక్ష్మమైన) మానసిక స్థాయి పరంగా దాని సొంత వ్యక్తిగత వివరణను కలిగి ఉన్నాయి. ఈ మూడు వ్యవస్థలకు చిత్తమాత్రానికీ ఉన్న ముఖ్యమైన తేడా ఏమిటంటే నిజమైన తిరుగులేని ఉనికి దేనికీ లేదు అనేదే.

ఈ మూడు వ్యవస్థలకు చెందిన అనేక మంది గురువులు సొంత-శూన్యతను మరియు ఇతర-శూన్యతను వేరుగా చెప్తారు. ఈ రెండింటికీ అనేక వివరణలు ఉన్నాయి. పదాలు మరియు భావనలకు అతీతమైన సొంత శూన్యత అనేది ఉనికిలో ఉన్న, ఉనికిలో లేని, రెండూ మరియు ఏ రెండూ కాదు అని తెలిసిన విషయాలకు మించిన శూన్యతను సూచిస్తుంది. ఇతర-శూన్యత అనేది పదాలు మరియు భావనలకు అతీతంగా ఉండి ఇది భావనాత్మక స్థాయి కంటే ఇంకా సూక్ష్మమైన మానసిక స్థాయిని సూచిస్తుంది.

గెలుగ్ ప్రాసంగిక వ్యవస్థ

గెలుగ్ ప్రాసంగిక-మధ్యమాక వ్యవస్థలో, అద్వైతవాద రహితం అనేది నిజంగా కనిపెట్టగలిగే ఉనికి లేకపోవడాన్ని సూచిస్తుంది. నిజంగా కనిపెట్టగలిగే ఉనికి "అద్వైతవాదం", అది నిజంగా కనిపెట్టగలిగే ఉనికి లేకపోవడం కాకుండా రెండవ రకమైన ఉనికి అవుతుంది. నిజమైన ఉనికిని గ్రహించే ప్రవృత్తులను కలిగి ఉన్న మనస్సు నిజంగా కనిపెట్టగలిగే ఉనికి యొక్క రూపానికి దారితీసినప్పటికీ, ఆ రూపం నిజంగా ఉండే దేనితోనూ సరిపోలదు, ఎందుకంటే నిజంగా కనిపెట్టగలిగే ఉనికి అనేది అసలు ఏదీ లేదు. "నిజంగా కనిపెట్టగలిగే ఉనికి" అంటే ఒక వస్తువు వైపు కనిపెట్టగలిగే మరియు నిర్వచించదగిన లక్షణాల ద్వారా స్థాపించబడిన ఉనికి అని అర్ధం.

సాక్య, నైంగ్మా మరియు కాగ్యు మధ్యమాక మరియు గెలుగ్ ప్రాసంగిక-మధ్యమాక అభిప్రాయాలు రెండూ నాగార్జునుడి నుంచి వచ్చాయి. అదంతా భ్రమేనని ఎవరూ చెప్పరు. మనిషిని చంపడానికి, మరియు మనిషి అనే భ్రమను చంపడానికి తేడా ఉందని శాంతిదేవుడు స్పష్టంగా చెప్పాడు. అయితే తెలుసుకోకపోవడం (అజ్ఞానం) బారిన పడిన మనసుకు కనిపించేవన్నీ భ్రమలేనని గెలుగ్ రహిత వ్యవస్థలు వాదిస్తాయి. ఈ వ్యవస్థలు గెలుగ్ లాగా కాకుండా, ఒక వస్తువు యొక్క రూపానికి మరియు అది ఎలా ఉనికిలో ఉందో చూడటానికి మధ్య తేడాను గుర్తించవు. అజ్ఞానంతో నిండిన మనస్సుకు కనిపించేవన్నీ నిజంగా ఉనికిలో ఉన్నట్లు కనిపిస్తాయి కాబట్టి, ఆ రూపాలన్నీ ఒక భ్రమ. మరోవైపు, అలాంటి దృశ్యాలన్నీ కేవలం భ్రమ లాంటివేనని గెలుగ్ సాంప్రదాయం చెప్తుంది. అవి ఎలా ఉనికిలో ఉన్నాయనేది ఒక భ్రమ, ఇది వస్తువులు ఎలా ఉన్నాయో దానికి అనుగుణంగా ఉండదు, కానీ వాటి వాలిడ్ అయ్యే సాంప్రదాయక రూపం ఒక భ్రమ కాదు.

అద్వైత వేదాంతం

అద్వైత వేదాంతం మధ్యమాక వ్యవస్థలతో కొంత పరిభాషను పంచుకుంటుంది, అలా అది అనేక సమానతలను కలిగి ఉంటుంది. అయితే, శంకరుని వ్యవస్థలో అనేక ముఖ్యమైన తేడాలు ఉన్నాయి:

సాంప్రదాయకమైనది

సాంప్రదాయకంగా ఉనికిలో ఉన్న, అనుభవపూర్వక సజీవ ఆత్మ (జీవం) అనేది నిష్క్రియాత్మక పరిశీలక చైతన్యం (సాక్షి) మరియు క్రియాశీల అంతర్గత భౌతిక అవయవం (అంతఃకరణ) రెండింటి కలయిక అని శంకర చెప్పాడు. ముక్తికి (మోక్షం) ముందు, ఈ రెండూ ఎప్పుడూ కలిసి ఉండేవి, అయినా కానీ, గాఢ నిద్రలో, పరిశీలక చైతన్యం అజ్ఞానం (అవిద్య) లోకి వెళుతుంది, ఇది ప్రతి ఒక్కరికి ఉండే భ్రమ (మాయ). సాంప్రదాయకంగా ఉనికిలో ఉన్న ఆత్మ అనేది సమ్మేళనాల యొక్క వ్యక్తిగత కొనసాగింపుపై ఆధారపడిన ఒక ప్రేరణ అని బౌద్ధమతం నొక్కి చెబుతుంది, కానీ ఇది వీటి యొక్క కలయిక కాదు.

ఆత్మకు, మరియు బ్రహ్మ లేదా శూన్యతకు మధ్య ఉన్న సంబంధం 

ప్రతి పరిశీలకుని చైతన్యం నిర్గుణ బ్రహ్మం (గుణాలు లేని బ్రహ్మం)తో సమానమని, ముక్తితో ఆ పరిశీలక చైతన్యంతో ముడిపడి ఉన్న అంతర్గత భౌతిక అవయవం మాయ భ్రమలోకి తిరిగి వస్తుందని, పరిశీలక చైతన్యం గుణాలు లేని బ్రహ్మంతో కలిసిపోతుందని శంకర వాదిస్తాడు. బౌద్ధమతంలో సాంప్రదాయకంగా ఉనికిలో ఉన్న ఆత్మ మరియు సొంత-శూన్యత (నిజమైన ఉనికి లేకపోవడం) మధ్య సంబంధాన్ని పరిశీలిస్తే, బౌద్ధమతం రెండూ ఒకేలా ఉన్నాయని లేదా అవి ముక్తి లేదా జ్ఞానోదయంతో కలిసిపోతాయని ఎప్పుడూ చెప్పలేదు. సొంత-శూన్యత అనేది సాంప్రదాయక ఆత్మ ఎలా ఉనికిలో ఉంటుంది అని అర్ధం, అంటే నిజమైన ఉనికిలో లేని ఆత్మ. నిజంగా ఉనికిలో ఉన్న ఆత్మ విషయానికొస్తే, అసలు అలాంటిదేమీ లేదు. మనం ఇతర శూన్యత పరంగా విశ్లేషించి, స్పష్టమైన-కాంతి మనస్సును సూచించడానికి ఇతర-శూన్యతను పరిగణలోకి తీసుకుంటే నిజంగా ఉనికిలో లేని ఆత్మ యొక్క రూపం మరియు నిజంగా ఉనికిలో ఉన్న ఆత్మ యొక్క రూపం రెండూ స్పష్టమైన-కాంతి మనస్సు యొక్క రూప అంశాలు అవుతాయి, అయినా కానీ అవి స్పష్టమైన కాంతి మనస్సుతో సమానంగా ఉండవు. బౌద్ధమతంలో "సమానం" అంటే పూర్తిగా ఆ రెండూ ఒకటే అని అర్ధం. జ్ఞానోదయంతో ఇకపై నిజంగా ఉనికిలో ఉన్న ఆత్మ కనిపించనప్పటికీ, ఒకదానిపై ఉన్న నమ్మకం పక్కన పెడితే, నిజమైన ఉనికిలో ఉన్న ఆత్మ స్పష్టమైన కాంతి మనస్సుతో కలిసిపోయిందని దీని అర్థం కాదు. అలాగే, జ్ఞానోదయంతో కూడా, నిజంగా ఉనికిలో లేని ఆత్మ యొక్క ప్రేరణ ఇప్పటికీ ఉంటుంది.

మాయ భ్రమ మాత్రమే ఈశ్వరుని శక్తి అని శంకరుడు ఎప్పుడూ చెప్తాడు. అందరూ బహిరంగంగా గ్రహించే అనుభావిక వాస్తవం ఈశ్వరుని (ఈశ్వర- సృష్టి) సృష్టి మరియు ఆచరణాత్మక జ్ఞానంతో ఉన్న ప్రపంచం (వ్యావహారిక). వ్యక్తిగతంగా గ్రహించబడిన వ్యక్తిగత రియాలిటీ, ప్రతి జీవి యొక్క సృష్టి (జీవ-సృష్టి) మరియు కనపడే ప్రపంచం (ప్రతిభాశిక). అనుభవ ప్రపంచం మరియు వివిధ వ్యక్తిగత ప్రపంచాలు రెండూ మాయ-భ్రమ నుంచి వస్తాయి. శంకరుని సృష్టి (పుట్టుక, సృష్టి) భావనను జన్మ మూలాలు, అలయవిజ్ఞానం గురించి చిత్తమాత్ర చర్చతో ఎలా పోలుస్తారో నాకు తెలియదు. అవి రెండూ ఒకటే అని నా అనుమానం.

అద్వైతంలోని మాయ-భ్రమ అనేది ఉనికిలో ఉన్న ప్రాథమిక పదార్థం (ప్రకృతి) యొక్క సాంఖ్య వాదన లాంటిది కాదు, అన్ని వస్తువులు ప్రాథమిక పదార్థం యొక్క భ్రమ (మాయ) కలతలే (వికారాలు).

శంకరుని అభిప్రాయం ప్రకారం, మాయ-భ్రమను ఉనికిలో లేదా ఉనికిలో లేనిదిగా వర్గీకరించలేము. అజ్ఞానం అంటే మన వ్యక్తిగత ప్రపంచాన్ని ప్రజల ప్రపంచంతో చూసి భ్రమ పడడం. వ్యక్తిగతంగా గ్రహించిన వస్తువులు ఒక నిర్దిష్ట జీవి చేత గ్రహించబడేంత వరకు మాత్రమే ఉంటాయి, అయితే గ్రహించిన వస్తువులు ఎప్పుడూ ఈశ్వరుని చేత గ్రహించబడతాయి కాబట్టి వాటిని ఏ జీవి గ్రహించనప్పుడు కూడా అవి కనిపిస్తూనే ఉంటాయి. పైన చర్చించిన విధంగా చిత్తమాత్ర, మధ్యమాక రెండింటిలోనూ బౌద్ధమతం దీనికి చాలా వేరుగా ఉంటుంది.

స్పేస్ మరియు టైమ్

వివిధ జీవరాశులు, అలాగే మాయ భ్రమలు, ఈశ్వరుడు కూడా స్పేస్, టైమ్ లో లేరని శంకరుడు వాదిస్తాడు. బహిరంగంగా మరియు వ్యక్తిగతంగా గ్రహించిన వస్తువులన్నీ స్పేస్ మరియు టైమ్ లో ఉంటాయి, మరియు స్పేస్ అనేది టైమ్ లో ఉంటుంది. టైమ్ అనేది వివిధ జీవరాశులకు, మాయ భ్రమలకు సంబంధించినది.

మధ్యమాకలో టైమ్ మరియు స్పేస్ ని వస్తువులకు సంచులుగా భావించరు. టైమ్ అనేది మార్పు యొక్క కొలత, మరియు స్పేస్ అనేది ఒక భౌతిక వస్తువు మూడు డైమెన్షన్ లను ఆక్రమించకుండా నిరోధించే స్పష్టమైన లేదా అడ్డంకి ఏదీ లేకపోవడం. టైమ్ మరియు స్పేస్ రెండూ నిజమైన ఉనికిని కలిగి ఉండవు.

అద్వైతం

గుణాలు లేని బ్రహ్మం (నిర్గుణ బ్రహ్మం) స్పేస్ మరియు టైమ్ లో మాయ భ్రమ నుంచి వచ్చిన వివిధ వస్తువులుగా, అలాగే వివిధ వ్యక్తిగత జీవులు మరియు ఈశ్వరులుగా తనను తాను చూపించుకుంటుంది లేదా అనువదిస్తుంది (వివర్త, అక్షరాలా: మలుపులు). అయితే గుణాలు లేని బ్రహ్మం అస్సలు మారదు. మాయ భ్రమ నుంచి వచ్చే అర్థంలో ఈ విభిన్న ప్రదర్శనలన్నింటి ఐక్యత (ఐక్యం) అన్నీ లక్షణాలతో కూడిన బ్రహ్మం (సగుణ బ్రహ్మ). అయితే గుణాలు లేని బ్రహ్మం, ఏకత్వం, భిన్నత్వం అనే భేదానికి అతీతం అనే అర్థంలో అద్వైతం (అద్వైతం). అందువల్ల శంకరుని అద్వైత వేదాంత సిద్ధాంతం రామానుజుల విశిష్ట వేదాంత సిద్ధాంతంతో సమానం కాదు. ఇది మాయ భ్రమ మరియు బ్రహ్మం నుంచి జీవులు దాని పరివర్తనగా (పరిణమ) పరిణామం చెందుతాయి. భిన్నత్వంలో ఏకత్వం (భేదా-అభేదం) అనే కుమారిల పూర్వ మీమాంస సిద్ధాంతం అలాంటిది కాదు.

మధ్యమాక ఒకరి లేదా ఎక్కువ మంది వాదనను ఉపయోగించినప్పుడు, ఆత్మ మరియు సమూహం లాంటివి నిజంగా ఉనికిలో ఉంటే, అటువంటిది ఒకటి మాత్రమే ఉండాలి (ఈ సందర్భంలో ఆత్మ మరియు సమూహాలు ఒకేలా ఉంటాయి, అంటే పూర్తిగా సమానంగా ఉంటాయి) లేదా అనేక నిజమైన ఉనికిలో ఉన్న విషయాలు అవసరం అనే నిజాన్ని ఇది సూచిస్తుంది. ఒకదానికొకటి పూర్తిగా వేరుగా ఉంటాయి. ఈ రెండూ లాజికల్ గా ఉండవు కాబట్టి, నిజమైన ఉనికి అనేదే ఏదీ లేదు. శూన్యత అనేది నిజమైన ఉనికి లేకపోవడమే - ఒకటి లేదా అనేక నిజంగా ఉనికిలో ఉన్న వస్తువులు లేదా జీవులు ఉండకపోవడమే.

Top