నాలుగు ఉత్తమమైన సత్యాలు ఏమిటి?

What are four noble truths

నాలుగు ఉత్తమమైన సత్యాలు మన సమస్యలను అధిగమించడానికి ఒక మార్గాన్ని సూచించే ప్రాథమిక నిజాలు. ఇది బుద్ధుని మొదటి బోధన, ఇది ఇతర బౌద్ధ బోధనలన్నింటికీ ఒక ఫ్రేమ్ వర్క్ ని అందిస్తుంది.

మొదటి ఉత్తమ సత్యం: నిజమైన బాధలు

మొదటి సత్యం ఏమిటంటే, సాధారణంగా, జీవితం అసంతృప్తిగా ఉంటుంది. పుట్టుక నుండి మరణం వరకు, సంతోషమైన సమయాలు చాలా వస్తాయి, కానీ అవి ఎక్కువ కాలం ఉండవు. అలాగే బాధను కలిగించే సమయాలు కూడా ఉంటాయి:

  • దుఃఖం - అనారోగ్యం, నిరాశ, ఒంటరితనం, ఆందోళన మరియు అసంతృప్తి ఇవన్నీ గుర్తించడం మరియు అర్థం చేసుకోవడం సులభం. ఇది అసలు మన పరిసరాలతో సంబంధాన్ని కలిగి ఉండదు - మనకు ఇష్టమైన ఆహారాన్ని తినే మన మంచి స్నేహితుడితో ఉన్నా కానీ మనం సంతోషంగా ఉండలేము.
  • స్వల్పకాలిక సంతోషం - మనం ఆనందించేది, నిజానికి అది ఎక్కువ సేపు ఉండి మనల్ని సంతృప్తి పరచదు, అది త్వరలోనే బాధగా మారిపోతుంది. మనం గడ్డకట్టే చలిలో ఉన్నప్పుడు, ఒక వెచ్చని గదిలోకి వెళ్తాము, చివరికి ఆ వేడి భరించలేనంతగా అయి మంచి గాలి కోసం బయటకు వచ్చేస్తాం. ఇలాంటి ఆనందం చాలా సేపు ఉంటే బాగుంటుంది, కానీ ఇక్కడి సమస్య ఏమిటంటే అలా ఎప్పటికీ జరగదు. 
  • ఎప్పుడూ రిపీట్ అయ్యే సమస్యలు - అత్యంత దారుణమైన విషయం ఏమిటంటే, జీవితంలోని కష్టాల నుంచి బయటపడటానికి వాడే మార్గాలు మనకు ఇంకొన్ని సమస్యలను సృష్టిస్తాయి. ఉదాహరణకు, మనం చెడు సంబంధంలో ఉన్నప్పుడు మన ప్రవర్తనా విధానం దానిని మరింత కష్టంగా మారుస్తుంది. మనం విడిపోతాము, చెడు అలవాట్లకు అలవాటయి మన తర్వాతి సంబంధంలో అదే పనులనే మళ్ళీ చేస్తాము. అది కూడా చెడుగానే మారుతుంది.

రెండవ ఉత్తమ సత్యం: బాధలకు అసలైన కారణం

మన దుఃఖం మరియు స్వల్పకాలిక ఆనందం ఎలా పడితే అలా వచ్చెయ్యవు, ఇవి అనేక రకాల కారణాలు మరియు పరిస్థితుల నుంచి వస్తాయి. మనం నివసిస్తున్న సమాజం పని తీరు నుంచే ఇలాంటి సమస్యలు వస్తాయి; కానీ ఒక నిజమైన కారణం కోసం, బుద్ధుడు మన మనస్సులను చూడమని ఆదేశించాడు. ద్వేషం, అసూయ, దురాశ మొదలైనవి మనల్ని బలవంతంగా ఆలోచించడానికి, మాట్లాడటానికి మరియు అంతిమంగా స్వీయ-విధ్వంసక మార్గాల్లో వ్యవహరించడానికి ప్రేరేపిస్తాయి.

బుద్ధుడు ఈ భావోద్వేగ స్థితులకు ఆధారమైన నిజమైన కారణాన్ని మరింత లోతుగా పరిశీలించి కనిపెట్టాడు: అదే వాస్తవికతను మనం అర్థం చేసుకునే విధానం. మన ప్రవర్తన యొక్క దీర్ఘకాలిక ప్రభావాల గురించి అవగాహన, మరియు ప్రపంచంలో మనం ఎలా ఉన్నాము అనే దాని గురించి బలమైన అపోహ ఇందులో ఉన్నాయి. ప్రతి దాని యొక్క పరస్పర సంబంధాన్ని చూడటానికి బదులుగా, బాహ్య కారకాలతో సంబంధం లేకుండా, ఇవన్నీ వాటికవే జరుగుతాయని మనం అనుకుంటాము.

మూడవ ఉత్తమ సత్యం: బాధల నుంచి అసలైన విముక్తి

దీన్ని మనం సహించనవసరం లేదని, అసలైన కారణాన్ని రూపుమాపగలిగితే ఇలాంటివేవీ జరగవని బుద్ధుడు సూచించాడు. రియాలిటీ గురించి మన అనుమానాన్ని వదిలించుకుంటే, అలాంటి సమస్యలు మళ్లీ మనకు రావు. అతను మనకు ఉండే ఒకటి రెండు సమస్యల గురించి మాత్రమే మాట్లాడటం లేదు - మనకు వచ్చే కొత్త సమస్యలన్నింటినీ పూర్తిగా ఆపెయ్యగలమని చెప్తున్నాడు.

నాలుగవ ఉత్తమ సత్యం: మనస్సు యొక్క నిజమైన మార్గం

నిజాన్ని సరిగ్గా అర్థం చేసుకుని అజ్ఞానాన్ని తొలగించినప్పుడు సమస్యలు పోతాయి. దీనికి మనం ప్రతి ఒక్కరూ అందరి మీద ఆధారపడి ఉన్నామని గ్రహించడం ద్వారా ఇలా చెయ్యగలము. దీని ఆధారంగా సమస్త ప్రాణుల పట్ల సమానంగా ప్రేమను, కరుణను పెంపొందించుకుంటాం. మనం మరియు ఇతరులు ఎలా ఉన్నారనే దానిపై మన అనుమానాన్ని తీసేసిన తర్వాత, ఇతరులతో ప్రయోజనకరంగా ఉండగలుగుతాము.

మన అమాయకత్వాన్ని, మరియు అజ్ఞానాన్ని వదిలించుకోవడానికి, వాటిని సూటిగా వ్యతిరేకించే విషయాలను మనం తెలుసుకోవాలి:

  • తక్షణ సంతృప్తి కోసం వెంటనే రియాక్ట్ అవ్వకుండా దీర్ఘకాలిక ప్రణాళికను వేసుకోవాలి.
  • జీవితంలోని ఒక చిన్న అంశంపై దృష్టి పెట్టడానికి బదులుగా అసలు విషయాన్ని తెలుసుకోవాలి.
  • మన పనుల పర్యవసానాలు ఇప్పుడు మనకు సులభమైనవిగా చేయడానికి బదులుగా, మన మిగిలిన జీవితాలపై మరియు భవిష్యత్తు ఎలా ఉంటుందో ఆలోచించాలి.

కొన్నిసార్లు, జీవితంలోని నిరాశలను ఎదుర్కొనేటప్పుడు, దీర్ఘకాలిక పరిణామాల గురించి ఆలోచించకుండా, తాగటం లేదా జంక్ ఫుడ్ తినడమే మన దృష్టిని మారుస్తుందని మనం అనుకుంటాము. దీన్ని మనం ఒక అలవాటుగా మార్చుకుంటే మన ప్రాణాలకే కాదు, మన కుటుంబాలపై కూడా వినాశకరమైన ప్రభావం చూపిస్తుంది. మన పనుల పర్యవసానాల నుంచి మనం పూర్తిగా వేరుగా ఉన్నామన్న భావన దీనిలో ఉంటుంది. మన గందరగోళానికి బలమైన విషయం ఇలా ఉంటుంది:

  • మిగిలిన మానుషులతో, భూగోళంతో మనం సన్నిహితంగా ముడిపడి ఉన్నామని గ్రహించండి, మనం ఎలా ఉన్నామనే మన కల్పనలు వాస్తవికతకు అనుగుణంగా లేవని అర్థం చేసుకోండి.

పదే పదే ధ్యానం చేయడం ద్వారా మనం ఈ అంతర్దృష్టికి అలవాటు పడగలిగితే, మన ఇబ్బందులన్నిటిని తొలగించుకోగలుగుతాము.

మనమందరం సంతోషంగా ఉండాలని కోరుకుంటాం, కానీ అది ఏదో విధంగా మనకు దొరక్కుండా పోతుంది. ఆనందాన్ని కనుగొనడానికి బుద్ధుని విధానం పై నాలుగు ఉత్తమమైన సత్యాలలో వివరించబడింది. ఇది విశ్వవ్యాప్తమైనది మరియు ఇది బుద్ధుడు మొదట బోధించిన 2,500 సంవత్సరాల తర్వాత కూడా బాగా పనిచేస్తుంది.

మన రోజువారీ సమస్యలను పరిష్కరించడానికి ఈ నాలుగు ఉత్తమ సత్యాల ప్రయోజనం పొందడానికి మనం బౌద్ధుడిగా మారాల్సిన అవసరం లేదు. పరిస్థితులు ఎప్పుడూ మనం కోరుకున్న విధంగా ఉండవు, కానీ నిరాశ చెంది ఆశను కోల్పోవటం సరైనది కాదు. నిజమైన ఆనందాన్ని కనుగొనడానికి మరియు మన జీవితాలను నిజంగా అర్ధవంతం చేసుకోవడానికి అవసరమైనవి ఈ నాలుగు ఉత్తమమైన సత్యాలు.

అసలు బాధ ఏమిటో మనం ముందు తెలుసుకోవాలి; దానిని వదిలించుకోవాలి; ఆ బాధలకు నిజంగా ఎలా తొలగించుకోవాలో మనకు తెలియాలి; అలా మనం మనస్సు యొక్క నిజమైన మార్గాన్ని గ్రహించగలుగుతాం.

Top