థెరవాడలో, మహాయాన, మరియు తంత్రంలో బుద్ధుని యొక్క పాత్ర: అన్నీ ఒకటేనా?

బుద్ధుని జీవితానికి సంబంధించిన వివిధ వెర్షన్లు, లేదా ప్రెజెంటేషన్లను ఒక కష్టమైనా చారిత్రక సందర్భంలో కేవలం వాస్తవాల వైపు నుంచి చూడకూడదు, లేదా వాటిని విరుద్ధమైనవిగా పరిగణించకూడదు. అలా కాకుండా, ప్రతి ప్రజంటేషన్ నిజంగా రాసి ఉందని మరియు దాన్ని శ్రద్ధగా చదవాలని మరియు ప్రతి ఒక్కటి సరైనది మరియు వాలిడ్ అవుతుందని మనం అర్థం చేసుకోవాలి. ఈ వివిధ సందర్భాలు మనకు కావలసిన బోధనలను ఎలా అందిస్తాయో అని పరిశీలిస్తే, మనం బుద్ధుని బోధనల గురించి లోతైన అవగాహనను పొందడం మాత్రమే కాకుండా, ఈ వివిధ విషయాలలో ఉండే బోధనలను మన జీవితాలలో ఎలా అన్వయించాలో కూడా నేర్చుకుంటాము. బుద్ధుని జీవితంలోని దశలను మనం అనుసరిస్తూ, బోధనలను ఈ విధంగా అన్వయిస్తే, బుద్ధుడు స్వయంగా పొందిన జ్ఞానోదయాన్ని గ్రహించి, ఇతరులకు కరుణతో సహాయం చెయ్యాలనే లక్ష్యాన్ని మనం సాధించగలుగుతాము.

పరిచయం

బౌద్ధమత స్థాపకుడు అయిన శాక్యముని ఎవరో అని మనం తెలుసుకోవాలనుకుంటే, బుద్ధుని జీవిత గాథకు అనేక రూపాలు ఉన్నట్టు మనకు తెలుస్తుంది. అలాంటప్పుడు, వాళ్ళంతా ఒకే వ్యక్తి గురించి మాట్లాడుతున్నారా అని మనం అడుగవచ్చు. సమాధానం చెప్పడానికి ఇది అంత సులభమైన ప్రశ్న కాదు.

బుద్ధుని జీవితం యొక్క ఒక వెర్షన్ థెరవాడ సంప్రదాయం యొక్క గ్రంథాలైన పాళీ క్యానన్ నుంచి వచ్చింది. వాటిలో ఆయన జీవితానికి సంబంధించిన పూర్తి వివరాలు ఒకేచోట లేవు, కానీ వివిధ గ్రంథాల నుంచి ముక్కలుగా ఒక దానిని ఇంకో దానితో జత చెయ్యవచ్చు. ఆ తర్వాత బౌద్ధమత సాహిత్యం ఈ స్కెలిటన్ కి అనేక వివరాలను జోడించింది.

బుద్ధుని గుర్తింపుపై గొప్పగా విస్తరిస్తున్న మహాయాన, బుద్ధుని జీవితం గురించి ఉన్న మరొక రకం, ఇది థెరవాడకు భిన్నంగా ఉంటుంది. థెరవాడ వెర్షన్ లో, బుద్ధుడు క్రీస్తుపూర్వం 566 నుండి 485 వరకు జీవించాడని సాధారణంగా అంగీకరించబడిన ఒక చారిత్రక వ్యక్తి, మరియు అతను తన జీవితకాలంలో జ్ఞానోదయం పొంది మరణంతో తన ఉనికిని ముగించాడు. మహాయాన రకం పాళీ పురాణంలో ప్రదర్శించిన కథను బాగా విస్తారంగా చెప్తుంది మరియు బుద్ధుడు అనేక జన్మలలోనే జ్ఞానోదయం పొంది శాక్యముని రూపంలో భూమిపైకి ఎలా దిగి వచ్చాడో చెప్తుంది. అతను ఈ భూమ్మీద, దాన్ని ఎలా పొందవచ్చో అని ఇతరులకు చూపించడానికి ఉదాహరణగా జ్ఞానోదయం పొందిన పన్నెండు పనులను ప్రదర్శించాడు, మరియు మరణంలో అతని ఉనికి అనేక ఇతర రంగాలలో ఉండేలా చేస్తూ, సమస్త ప్రాణులకు బోధిస్తూ, ప్రయోజనం అందించేలా చూసుకున్నాడు.

బుద్ధుని యొక్క మరొక రకం తంత్రాలలో మనకు కనిపించేది. ఈ రకంలో బుద్ధుడు ఒకేసారి వివిధ రూపాల్లో దర్శనమిస్తాడు. వీటిని "ధ్యాన దేవతలు" అని పిలుస్తారు వీటిల్లో వివిధ రంగులు, అనేక చేతులు, ముఖాలు మరియు కాళ్ళు ఉంటాయి, ఇవన్నీ బుద్ధుని సాక్షాత్కారాల యొక్క వివిధ అంశాలను సూచిస్తాయి. బుద్ధుడు ఈ విభిన్న రూపాల్లో కనిపిస్తాడు, మరియు అదే సమయంలో మానవ రూపంలో బోధిస్తాడు, ఉదాహరణకు భారతదేశంలోని రాబందు శిఖరం వద్ద, అక్కడ అతను సూత్రాలను కూడా బోధించాడు.

నిర్దిష్ట సందర్భాలలో బుద్ధుని జీవితం

ఇన్ని రకాలు ఉన్న ఈ వివిధ వెర్షన్లు గందరగోళంగా కనిపిస్తాయి, కాబట్టి, అసలు బుద్ధుడు అంటే ఎవరు? ఈ వివిధ వెర్షన్లను మనం అర్థం చేసుకోవడానికి, బుద్ధుని జీవితంలోని ప్రతి వెర్షన్ బౌద్ధమతానికి సంబంధించి అంటే ఒక నిర్దిష్ట సందర్భంలో గ్రంథాలను బోధించిన ప్రాథమిక బౌద్ధ సూత్రాన్ని మనం ముందు అర్థం చేసుకోవాలి. పాళీ క్యానన్ లో వివరించిన బుద్ధుని రకాన్ని థెరవాడ బోధనల నేపధ్యంలో బోధించారు. కాబట్టి, ఆ బుద్ధుడే సాధారణ మహాయానాన్ని, తాంత్రిక బోధనలను బోధించాడనడంలో అర్థం ఏమీ లేదు.

మహాయాన గ్రంథాలలో వర్ణించబడిన బుద్ధుని రకం "చారిత్రక బుద్ధుడు" కాదు (అంటే ఒక జన్మలో జ్ఞానోదయం పొంది, అతని ఉనికి మరణంతో పూర్తవ్వడం). తాంత్రిక బోధనలలో వివరించిన బుద్ధుని రకానికి సంబంధించి కూడా ఇదే వర్తిస్తుంది.

సంక్షిప్తంగా, బుద్ధుని జీవితం, లేదా నిజానికి ఇతర విషయాలను చర్చించేటప్పుడు, గుర్తుంచుకోవాల్సిన ప్రాథమిక బౌద్ధమత సూత్రం ఏమిటంటే, వివిధ బోధనలలో వర్ణించబడిన లేదా సూత్రీకరించిన వాటిని ఒక నిర్దిష్ట సందర్భంలో మనం అర్థం చేసుకోవాలి. ఒకే విషయాన్ని వేర్వేరు సందర్భాల్లో పరిగణనలోకి తీసుకోవడానికి మరొక మార్గం కొన్ని ప్రశ్నలు అడగడం, అవి: నా జీవితంలో వీటి గురించి నేర్చుకోవడం వల్ల ఉపయోగం ఏమిటి? బౌద్ధమత ఆధ్యాత్మిక మార్గంలో వీటి వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి? అని.

బుద్ధ శాక్యముని జీవితాన్ని వివిధ సందర్భాల్లో చూడటం ద్వారా మనం ఈ క్రింది సమస్యాత్మక ప్రశ్నలను తొలగించుకోవచ్చు: మహాయాన సూత్రాలను బుద్ధుడు బోధించాడా? అతను తంత్రాన్ని బోధించాడా? బుద్ధుని కాలంలో, బోధనలు మౌఖికంగా మాత్రమే బోధించబడ్డాయి మరియు ఏవీ రాయబడలేదు కాబట్టి, బుద్ధుడు మహాయాన మరియు తాంత్రిక బోధనలను బోధించాడా లేదా అనే ప్రశ్నపై బౌద్దులలో అనేక చర్చలు జరిగాయి. గొప్ప భారతీయ గురువు అయిన శాంతిదేవుని "భోధిసత్వ ప్రవర్తనలో నిమగ్నం కావడం" అనే గ్రంథంలో ఒక చర్చ జరిగింది, అందులో అతను ఇలా చెప్పాడు, "మా మహాయాన సూత్రాలను అనర్హులుగా ప్రకటించడానికి మీ హినయానిస్టులు (థెరవాడలు) ఏ కారణాలు చెప్పినా, మిమ్మల్ని అనర్హులుగా చెయ్యడానికి నేను ఆ కారణాలనే ఉపయోగించగలను" అని. మరో మాటలో చెప్పాలంటే, హినయాన మరియు మహాయాన అనే రెండు పాఠశాలలు తమ బోధనలు మౌఖిక రూపంలో చెప్పబడతాయని చెబుతున్నాయి. కాబట్టి, థెరవాడలు మహాయనిస్టులతో "మీ బోధనలు బుద్ధునిచే బోధించబడలేదు కాబట్టి అవి ప్రామాణికమైనవి కావు, ఎందుకంటే అవి తర్వాత వచ్చాయి" అని చెబితే, మహాయనిస్టులు ఇలా ప్రతిస్పందించారు, "మీ విషయంలో కూడా అదే నిజం. మీ బోధనలు మౌఖిక రూపంలో చెప్పబడ్డాయి మరియు చాలా ఆలస్యంగా రాయబడ్డాయి. కాబట్టి మా బోధనలు ప్రామాణికం కాకపోతే మీది కూడా అంతే.

ఈ ఆర్టికల్ లో ఇంతకు ముందు చెప్పిన మరో వాదన ఏమిటంటే, థెరవాడ, మహాయాన రెండింటిలో బుద్ధుని గురించి వేరుగా చెప్పబడింది. థెరవాడ రకం బుద్ధుడు థెరవాడ గ్రంథాలను, మహాయాన రకం బుద్ధుడు మహాయాన గ్రంథాలను బోధించాడు. ఈ మూడు సంప్రదాయాలలోని ఈ సందర్భాల నుంచి: హినయానానికి ప్రతినిధిగా బుద్ధుడు, మహాయాన సూత్ర సంప్రదాయం మరియు మహాయాన తాంత్రిక సంప్రదాయం నుంచి, బుద్ధుని సాధారణ జీవితం గురించి మనం తెలుసుకోవచ్చు.

బుద్ధుని కాలం

ముందుగా మనం అడగాల్సింది: బుద్ధుడు ఎప్పుడు జీవించాడు? అని. అతను ఒక నిర్దిష్ట కాలంలో, అంటే ఒక నిర్దిష్ట సందర్భంలో జీవించాడు. ఈ సమాజానికి అప్పటికే కొన్ని ప్రాథమిక నమ్మకాలు ఉన్నాయి, వాటిని బుద్ధుడు ఉద్దేశించి ప్రసంగించాడు. ఈ నమ్మక వ్యవస్థలో, అన్ని భారతీయ ఆలోచనా విధానాలలో కనిపించే ప్రాథమిక థీమ్ లు ఆ సమయంలో ఉన్నాయి మరియు అవి చరిత్ర అంతటా అభివృద్ధి చెందాయి. కర్మ (వ్యక్తిగత చర్యలు) ప్రకారం నిర్ణయించబడే పునర్జన్మ మరియు ఈ పునర్జన్మ చక్రం నుంచి విముక్తిని ఎలా పొందాలో బుద్ధుడు ఈ థీమ్ లను వివరించాడు. అన్ని భారతీయ వ్యవస్థలు సాధారణంగా జ్ఞానం లేదా రియాలిటీను అర్థం చేసుకోవడం అంటే ఒక వ్యక్తిని పునర్జన్మ నుంచి విముక్తి చెయ్యడానికి వీలు కల్పించే పద్ధతి అని చెబుతాయి. ఆ సమయంలో వివిధ తత్వాలు, మతాల సమాధానాలతో సంతృప్తి చెందని బుద్ధుడు సత్య సాక్షాత్కారాన్ని పొందాలని ఆలోచించి, ధ్యానం చేసి, వివిధ అభ్యాసాలు చేశాడు.

భారతదేశంలో, బుద్ధుని కాలంలో, నిరంకుశ వ్యవస్థ గురించి బలమైన ఉద్యమం జరిగింది. వివిధ రకాల రాజ్యాలలో మర్చంట్ లు ధనవంతులుగా మారి, వారి సంపదలో రాజులకు పోటీగా ఉండేవారు. దానికి ప్రతిస్పందనగా రాజులు ఇంకా నిరంకుశంగా మారారు. భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో, చిన్న రిపబ్లిక్ లు సాధారణ జనాభా ఆధారంగా సరిగ్గా క్రమబద్ధం లేని ఆలోచనా విధానాన్ని స్థాపించడం ప్రారంభించాయి. ఈ రిపబ్లిక్ లలో ఒకదానిలో [లేదా సమీపంలో] జన్మించిన బుద్ధుడు ఈ వ్యవస్థచే ప్రభావితుడై తన సన్యాస సంస్థను స్థాపించాడు, దీనిలో సభ్యులందరూ కలిసి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది.

అలాగే, ఆ సమయంలో, పాత వేదిక్ మతానికి వ్యతిరేకంగా దాని ఆచారాలు మరియు పూజారులు మొదలైన వాటితో ప్రతిస్పందించే ప్రజల ఉద్యమం జరిగింది, ఈ మతాన్ని రిపబ్లిక్ లు మరియు నిరంకుశత్వం ఉన్న వాళ్ళతో సహా అందరూ అనుసరించారు. దీనికి ప్రతిస్పందించిన వాలు "శ్రమనేరులు", సమాజాన్ని వదిలేసినా సన్యాసులు లేదా "మానేసినవారు", సమాజాన్ని వదిలేసి వీళ్ళు అడవిలో తిరగడానికి, ధ్యానం చెయ్యడానికి మరియు వారి ఆధ్యాత్మిక అభివృద్ధి చేసుకోవడానికి వెళ్లారు. ఈ రకమైన ఉద్యమ ప్రతినిధులలో బుద్ధుడే కాకుండా ఇతర పాఠశాలలు మరియు అనుచరులు కూడా ఉన్నారు. ఒక వ్యక్తి ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరించాలనుకుంటే - సత్యాన్ని అన్వేషించడానికి స్వతంత్రంగా ఉండటానికి కనీసం ఒక నిర్దిష్ట కాలానికి సమాజం నుంచి దూరంగా వెళ్లడం చాలా ముఖ్యం. ఒకసారి మనం సత్యాన్ని కనిపెట్టమని భావిస్తే దాన్ని క్రమపద్ధతిలో, నిరంకుశంగా ఇతరులపై రుద్దకుండా మరింత "ప్రజాస్వామిక" పద్ధతిలో బయట పెట్టాలి.

జీవిత చరిత్రల యొక్క ఉద్దేశ్యం మరియు వాలిడిటి

బౌద్ధమత సందర్భంలో - భారతీయ లేదా టిబెటన్ - జీవిత చరిత్రలు కేవలం నిజాలను ప్రదర్శించడానికి బదులుగా ఒక గొప్ప వ్యక్తి జీవిత కథలోని కొన్ని విషయాలను బోధించడానికి మరియు వివరించడానికి ఉపయోగిస్తారు. ఈ నేపధ్యంలో ఒక గొప్ప ధార్మిక వ్యక్తి జీవితం ఇతరులకు ప్రేరణను ఇస్తుంది కాబట్టి పాశ్చాత్య ఆలోచనా విధానం నుంచి, ఆ కథలోని కొన్ని భాగాలు చాలా అద్భుతంగా అనిపించవచ్చు. ఉదాహరణకు, బుద్ధుని జీవితం నుంచి డి, తల్లికి కలలో ఆరు దంతాలు ఉన్న తెల్ల ఏనుగు కనిపించినప్పుడు, లేదా బుద్ధుడు తల్లి వైపు నుంచి పుట్టి ఏడు అడుగులు వేస్తూ "నేను ఇక్కడ ఉన్నాను!" అని చెప్పడం లాంటివి. భారతీయ/టిబెటన్ విధానం నుంచి, కథ చారిత్రాత్మకంగా ఖచ్చితమైనదా కాదా అనేది ముఖ్యం కాదు. కథ ప్రేక్షకులకు దేనికి ప్రాతినిధ్యం వహిస్తుంది లేదా ఏమి బోధిస్తుంది అనేది ముఖ్యం. బుద్ధుడు ఏం చేశాడో, అతని అనుచరుల మధ్య ఏం జరిగిందో తెలుసుకోవడానికి బుద్ధుని జీవితాన్ని చారిత్రాత్మకంగా విడదీయాలనుకుంటున్నామా అనేది సముచితం. లేదా, ఒక భారతీయుడు లేదా టిబెటన్ ఈ కథను ఎలా చదువుతారో అనే కోణంలో చూడాలనుకుంటే. ప్రతి సందర్భంలోనూ, ఈ జీవిత కథ మనకు ఏదో ఒకటి నేర్పుతుంది, ఒక మార్గం మరొక దాని కంటే ఎక్కువ వాలిడ్ గా అనిపిస్తుంది. బౌద్ధ చింతన ఎలా పనిచేస్తుందో అని తెలుసుకోవడానికి ఒక ముఖ్యమైన సూత్రం ఏమిటంటే, వివిధ ఆలోచనల నుంచి అనేక విభిన్న స్థాయిలలో విషయాలను అర్థం చేసుకోగలగడం మరియు వీటిలో చాలా వాలిడ్ అవుతాయని అనుకోవడం; కానీ ఈ విషయంలో ఒకటి కంటే ఎక్కువ నిజాలు ఉన్నాయి.

బౌద్ధమత సాహిత్యంలో ఒక ప్రసిద్ధ ఉదాహరణ ద్రవం. మానవులకు ఈ ద్రవం నీటిలా కనిపిస్తుంది. ఆకలితో ఉన్న దెయ్యాలకు అది చీములా కనిపిస్తుంది; నరక జీవులకు అది యాసిడ్ లా కనిపిస్తుంది; దేవతలకు ఇది అమృతంలా కనిపిస్తుంది. వీటిలో ఏది సరైనది? బౌద్ధమత ఆలోచనా విధానం ప్రకారం, అవన్నీ సరైనవే, ఎందుకంటే ఒక నిర్దిష్ట సందర్భంలో మాత్రమే ఒకదాని యొక్క వాలిడిటి రిలేటివ్ గా ఉంటుంది.

ఇంకొక ఉదాహరణ సందర్భోచిత చికిత్స అని పిలువబడే కుటుంబ చికిత్స యొక్క ఒక వర్గంలో ఉంటుంది, దీనిలో ఒక కుటుంబ పరిస్థితిలో ప్రతి కుటుంబ సభ్యుడి అభిప్రాయాలను అడుగుతారు. తండ్రి ఒక రకంగా, తల్లి మరో రకంగా, పిల్లలు ఒక్కొక్కరు ఒక్కో రకంగా చెబుతారు. ఈ రకాలలో ప్రతి ఒక్కటి సరైనవి మరియు కుటుంబ సభ్యులందరూ వారి మార్గంలో పరిస్థితిని అనుభవిస్తారు కాబట్టి సమాన గౌరవం ఇవ్వబడుతుంది. ఇది బౌద్ధమత ఆలోచనా విధానం మరియు దీన్ని బుద్ధుని జీవిత కథకు మనం అప్లై చెయ్యవచ్చు. ఆ కథను మనం అనేక విధాలుగా చదివితే, ప్రతి రకం సరైనది మరియు మనకు ఏదో ఒకటి నేర్పుతుంది అని అనిపిస్తుంది.

బుద్ధుని జీవితంలోని ముఖ్యమైన నిజాలు మరియు మన ఆచరణలో వాటి ఉపయోగం

బుద్ధుడు ఒక ప్రత్యేకమైన మరియు సంపన్న కుటుంబంలో జన్మించాడు (అతను యువరాజు కాదా అనేది ఒక చర్చనీయాంశం), అందువల్ల మంచి విద్యతో సహా గొప్ప ఆనందాలు మరియు ప్రయోజనాలను అతను అనుభవించాడు. అతనికి పెళ్లయి ఒక కొడుకు కూడా ఉన్నాడు. వృత్తి పరంగా, రిపబ్లిక్ అధిపతిగా తన తండ్రి స్థానాన్ని చేపట్టడానికి అతనికి ఆఫర్ చెయ్యబడింది, కాని శ్రామనేర ఉద్యమ అనుచరుడు అయిన బుద్ధుడు దాన్ని తిరస్కరించాడు. ఇక్కడ, బుద్ధుడు తన భార్యా పిల్లలను విడిచిపెట్టడానికి తాను బాధ్యుడు కాదని చెప్పడం ముఖ్యం. భారతీయ సమాజంలో, భార్యలు మరియు పిల్లలను తాతలు మరియు ఇతర సభ్యుల కుటుంబాలలో చూసుకుంటారు. అలాగే, బుద్ధుడు యోధుల కులంలో జన్మించాడు, ఈ కులంలో పురుషులు యుద్ధాలు చెయ్యడానికి ఇంటిని విడిచిపెట్టారు. బుద్ధుడు అజ్ఞానం, మరియు ఇబ్బంది పెట్టే భావోద్వేగాలకు వ్యతిరేకంగా తన లోపలే అంతర్గత యుద్ధం చేశాడు.

మంచి స్థానం, అధికారం, డబ్బు కలిగి ఉండటం కంటే సత్యాన్వేషణ, అంటే పునర్జన్మ లేదా మానసిక, భావోద్వేగ బాధల పరంగా బాధల ముగింపు చాలా ముఖ్యమని కుటుంబ జీవితాన్ని విడిచిపెట్టాలని బుద్ధుడు తీసుకున్న నిర్ణయం మనకు బోధిస్తుంది. మన కోసం అధికారం, డబ్బును వెతుక్కోవడం కంటే కోపం, దురాశ, స్వార్థం మొదలైన సార్వత్రిక వ్యక్తిగత సమస్యలకు లేదా సామాజిక సమస్యలకు ఎలా పరిష్కారాలను కనిపెట్టాలో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. అదే బుద్ధుని జీవితం మనకు నేర్పే పాఠం.

ఆధ్యాత్మిక జీవితాన్ని నూటికి నూరు శాతం అనుసరించడం అందరికీ కుదరదని, మీ జీవన నాణ్యత, మీ చుట్టుపక్కల వారి జీవితమే ముఖ్యమని దలైలామా గారు చెప్పారు. బుద్ధుడు రాజభవనాన్ని రథం (భగవద్గీత నుంచి తీసుకున్న ఒక ఉదాహరణ) వదిలి ఆధ్యాత్మిక మార్గాన్ని పూర్తిగా అనుసరించాడు మరియు అనారోగ్యం, వృద్ధాప్యం మరియు మరణం యొక్క వివిధ రకాల బాధలను మరియు రాజభవనంలో కనిపించని చాలా విషయాలను చూశాడు.

బుద్ధుని జీవితంలోని ఈ వివిధ కథల్లోని ప్రతీకలను జుంగియన్ సిద్ధాంతానికి అప్లై చెయ్యవచ్చు, ఇక్కడ బుద్ధుడు సంపద మరియు ఇంద్రియ సుఖాల వల్ల ప్రాపంచిక బాధలను చూడలేడు. తన ఆధ్యాత్మిక ప్రయాణానికి నాంది పలికిన రథంపై రాజభవనం నుంచి బయటకు వెళ్లినప్పుడే అందరూ పడుతున్న బాధలను చూపించి, ప్రతి ఒక్కరూ ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నాడు.

బుద్ధుని కథ మరియు బౌద్ధమత బోధనలలో చాలా ముఖ్యమైన అంశం ఏమిటంటే, ఆచరణలో మతోన్మాద విపరీతాలకు వెళ్ళకూడదు. రాజభవనాన్ని విడిచిపెట్టిన తర్వాత, బుద్ధుడు తీవ్రమైన ధ్యానం మరియు సన్యాస అభ్యాసాలలో నిమగ్నమయ్యాడు, దీనిలో అతను దాదాపు ఆకలితో మరణించబోయాడు. ఒక చెట్టు కింద కూర్చొని, ఈ పద్ధతులు ప్రయోజనకరంగా ఉండవని గ్రహించి, తన ఉపవాస దీక్షను విరమించి, ఒక గొర్రెల కాపరి బాలిక నుంచి పెరుగును తీసుకుని తిన్నాడు. భారతీయ ఆలోచనలో ఆవు (పెరుగు, పాలు) మాతృ ప్రేమ మరియు కరుణకు వర్ణిస్తుంది, కాబట్టి ప్రపంచ బాధలకు సంబంధించిన సరైన మార్గాన్ని కనిపెట్టడానికి వీలుగా ఆత్మరక్షణ నుంచి మనలను మేల్కొలిపేది కరుణ అని బోధించడానికి బుద్ధుడికి ఆవు ప్రొడక్ట్ లను సమర్పించడం ప్రతీక.

జ్ఞానోదయం పొందడానికి ముందు, బుద్ధుడు బోధి చెట్టు కింద కూర్చొన్నాడు (భారతీయ ఆలోచనలో పవిత్ర చెట్లు ఒక సాధారణ థీమ్) మరియు అక్కడికి మారా వచ్చాడు. మరణానికి సంస్కృత పదమైన మారా అనేది అడ్డంకులు, ఇబ్బందులు, ప్రలోభాలు మొదలైన వాటిని సూచిస్తుంది. దీన్నిబట్టి బుద్ధుడు కూడా జ్ఞానోదయం పొందక ముందే, మంచిని సాధించే ప్రయత్నంలో అడ్డంకులను, ఇబ్బందులను ఎదుర్కున్నాడని మనం గమనించవచ్చు.

జ్ఞానోదయం పొందడానికి ముందు, బుద్ధుడు చాలా ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందాడు; ఆ సమయంలో, అతను పూర్తి ప్రారంభకుడి నుంచి ఒక జ్ఞానోదయ జీవిగా మారలేదు. తన అభ్యాసం యొక్క చివరి దశలలో కూడా, అడ్డంకులు మరియు ఇబ్బందులు చాలా ఎదురయ్యాయి, మరియు బుద్ధుడు తన లక్ష్యాన్ని సాధించడానికి వాటిని ఎదుర్కోవలసి వచ్చింది, కాబట్టి మనం కూడా అలాగే చేస్తాము. మనం సాధించాలనుకున్న పని ఎంత పాజిటివ్ గా ఉంటే అడ్డంకులు అంత ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మనం నిరుత్సాహ పడకుండా, ఒక యోధుడిలా పూర్తి శక్తితో ఆ అడ్డంకులను అధిగమించి పోరాడాలనేది ఇక్కడి బోధన. ఇది బుద్ధుడు యోధుల కులం నుంచి వచ్చాడనే భావనకు సంబంధించినది ఎందుకంటే ఇది మన భ్రమలు, భయాలు మొదలైన వాటికి వ్యతిరేకంగా జరిగే అంతర్గత పోరాటం.

బుద్ధుడు జ్ఞానోదయం పొందిన తర్వాత, అతను బోధించడానికి సంకోచించాడు మరియు తన బోధనలను ప్రపంచంలో ఎవరు అర్థం చేసుకోగలరు అని ఆలోచించాడు. అయితే అతనిని బోధించమని కోరడంతో, అతను ప్రయత్నించాలని అనుకున్నాడు. బోధలను ఇతరులకు బోధించడం లేదా వివరించడం చాలా కష్టమైనప్పటికీ, కరుణతో అలా చెయ్యాలని ఇది మనకు బోధిస్తుంది.

ఇతరులకు బోధించిన తర్వాత, చాలా మంది బుద్ధుడిని అనుసరించాలని అనుకున్నారు, మరియు దీని నుంచి సన్యాసం ఉద్భవించింది. మొదట్లో సన్యాస నియమాలు ఏమీ ఉండేవి కావు. ఏదేమైనా, సన్యాసులు సమాజంలో నివసిస్తున్నందున, ఒక సంఘం మరియు సమాజంలో జీవించే సమస్యలను నివారించడంలో సహాయపడటానికి "వినయ" అని పిలువబడే వివిధ క్రమశిక్షణ నియమాలు ప్రవేశపెట్టబడ్డాయి. ఈ నియమాలను పెట్టినవారు ఏమీ రూపొందించలేదు కానీ సమస్యలు రావడంతో వాటిని ప్రవేశపెట్టారు. ఉదాహరణకు, సన్యాసులు ఆహారం కోసం ఇతరులను అడిగినప్పుడు వారు అత్యాశపరులని ప్రజలు భావించకుండా ఉండటానికి (ఆ సమయంలో ఇది శ్రామికుల పద్ధతి), వారు ఆహారం అడగడానికి వీలులేని నియమాలు రూపొందించబడ్డాయి; వాళ్లకు ఏది ఇస్తే వాళ్ళు అదే తీసుకోవాలి; వాళ్ళు ఆ ఆహారాన్ని నిల్వ చెయ్యలేరు; ఇంకా ఎక్కువ కావాలని అడగలేరు, ఇలా మొదలైనవి. ఈ నియమాలు సమాజం సన్యాసులను తిరస్కరించకుండా చూడటానికి పెట్టారు, అందుకే అవి ఇప్పటికీ నడుస్తూ ఉన్నాయి.

పురుషులు, స్త్రీలు కలిసి అడవిలో అనుచితమైన ప్రవర్తనను కలిగి ఉంటారని అందరూ అనుకుంటారని భావించి బుద్ధుడు మొదట్లో మహిళలను సన్యాసంలో చేర్చడానికి సంకోచించాడు. కానీ, చివరికి అతను మహిళలను ఆర్డర్‌లోకి స్వీకరించినప్పుడు, అతను సమాజానికి తప్పుడు ఆలోచన రాకుండా ఉండటానికి చాలా నిర్దిష్టమైన నియమాలను ఏర్పాటు చేశాడు, ఉదాహరణకు సన్యాసి మరియు సన్యాసినులు కలిసి ఒంటరిగా ఉండటానికి అనుమతించబడలేదు, ఒక చాపెరోన్ (నన్) ఎప్పుడూ ఉండాలి మరియు వారు ఒకే సీటు లేదా మంచంపై కూర్చోకూడదు. బుద్ధుడు ఒకవైపు సత్యాన్ని కనిపెట్టడానికి సమాజంలోని మహిమలన్నింటినీ తిరస్కరించాడని, మరోవైపు సమాజానికి తప్పుడు ఆలోచన ఇవ్వడానికి ఇష్టపడలేదని ఈ నియమాలు మనకు బోధిస్తాయి. ఈ విలువల పరంగా సమాజంలోని అన్ని సూత్రాలతో ఏకీభవించకపోయినా, సమాజం నుంచి దూరంగా ఉండాలని ఎవరూ అనుకోరు. సమాజపు విలువలు ఏమిటో వారు విభేదించినప్పటికీ, ఈ రోజుల్లో రాజకీయ నాయకులు దౌత్య పరంగా ఉండటం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది, నిరాధార అనుమానాలను ఎలా కలిగించకూడదో అర్థం చేసుకోవాలి.

బుద్ధుడికి దేవదత్తుడు అనే ఒక కజిన్ ఉన్నాడు, అతను బుద్ధుడిని అస్సలు ఇష్టపడలేదు మరియు ఎప్పుడూ అతనికి ఇబ్బంది కలిగించేవాడు. పాలి క్యానన్ లో ఇంకా లోతుగా పరిశీలిస్తే చాలా మంది అతన్ని ఇబ్బంది పెట్టారు మరియు అసహ్యించుకున్నారు. ఇది మనకు ఒక విలువైన పాఠాన్ని నేర్పుతుంది: అది ఏమిటంటే బుద్ధుడు కూడా కొంతమంది చేత ఇష్టపడలేదు మరియు అందరినీ మెప్పించలేడు, అలాంటప్పుడు మనం అలా ఎలా ఉండగలం? అందువల్ల మనం రియలిస్టిక్ గా ఉండాలి మరియు ఇతరులు మనల్ని ఇష్టపడకపోతే మరియు మనం అందరినీ మెప్పించలేకపోతే నిరాశ చెందకూడదు. 

జీవిత కథలలో బుద్ధుని మరణం గురించి ప్రస్తావించినప్పుడు, ఆనందుడు (బుద్ధుని ప్రధాన శిష్యులలో ఒకడు) బుద్ధుడిని మరణించవద్దని కోరాడు, కానీ అతను అలా చెయ్యలేదు, అందువల్ల బుద్ధుడి జీవితం ముగిసింది. బుద్ధుడు అడిగినప్పుడు మాత్రమే బోధిస్తాడని, అతనిని అడిగినప్పుడు మాత్రమే అక్కడ ఉంటాడని ఇది మనకు బోధిస్తుంది. అక్కడ ఉండాలని ఎవరూ కోరుకోకపోతే అతను వెళ్లిపోతాడు. ప్రజలు మన సహాయం కోరుకోకపోతే లేదా మన అవసరం వాళ్లకు లేకపోతే, మనల్ని మనం వారిపై నెట్టకూడదు. మిగతా వాళ్ళు చాలామ౦ది మన సహాయాన్ని కోరుకోవచ్చు.

ముగింపు

బుద్ధుని జీవితాన్ని మనం అనేక కోణాల్లో చూడవచ్చు. చరిత్రపై పాశ్చాత్య దృక్కోణంలో ప్రామాణికత ఉన్నప్పటికీ, సరైన తేదీలు లేదా సంవత్సరాల గురించి ఎటువంటి ఖచ్చితత్వాన్ని పొందడానికి వీలులేని అన్ని చారిత్రక నిజాలను కనిపెట్టడానికి మనం ప్రయత్నించవచ్చు. లేదా, ఒక కథలో కనిపించే వివిధ చిహ్నాల పరంగా మనం నేర్చుకోగల పాఠాలను చూడవచ్చు, ఉదాహరణకు జుంగియన్ విశ్లేషణలో ప్రశ్నలు అడుగవచ్చు: ఇది దేన్ని సూచిస్తుంది? ఇది దేన్ని చూపిస్తుంది? అని.

బుద్ధుడు ఎప్పుడో జ్ఞానోదయం పొంది, విశ్వజనీనత అనే మహాయాన థీమ్ ని మనకు బోధించి, మరెన్నో జన్మల పాటు ఇతరులకు ప్రయోజనం చేకూర్చడం ద్వారా బుద్ధుని జీవితాన్ని ఒక విశాలమైన మహాయాన సందర్భంలో మనం చూడవచ్చు. మనం ఇప్పుడు చేస్తున్నది మన ముందు వచ్చిన అన్ని తరాల ఫలితమేనని, మనం ఏదైనా పాజిటివ్ గా చెయ్యాలనుకుంటే భావి తరాల గురించి ఆలోచించాలని ఇది మనకు బోధిస్తుంది.

తాంత్రిక ప్రదర్శనలో, బుద్ధుడు ఒక చోట ఉండి లోతైన తత్వశాస్త్రం గురించి బోధిస్తాడు, మరొక చోట, అతను నాలుగు ముఖాలతో కనిపిస్తాడు, మరియు ఆ ప్రతి ఒక్కరూ ఒకేసారి భిన్నమైన వాటిని బోధిస్తారు. చరిత్ర అంతటా మనకు కనిపించే బుద్ధుని బోధనలలోని అనేక విభిన్న అంశాలు ఒకే మూలం లేదా ప్రాథమిక ఆలోచనలో కలిసిపోతాయని మరియు వాటిని వేరుగా ప్రదర్శించవచ్చని ఇది మనకు సూచిస్తుంది.

థెరవాడ సమర్పణ, మహాయాన సూత్ర సమర్పణ, మహాయాన తాంత్రిక సమర్పణ గురించి ఆలోచించినా బుద్ధుని బోధనలలో ఉన్న ప్రాథమిక సూత్రాలు మనకు కనిపిస్తాయి. ఈ సమర్పణలన్నింటిలోనూ బుద్ధుని వివిధ చేతులు, కాళ్ళు మరియు ముఖాల సంఖ్య ద్వారా ప్రాతినిధ్యం వహించే ప్రాథమిక సూత్రాలు ఉన్నాయి. ప్రాథమిక బుద్ధ బోధనలు నాలుగు ఉత్తమ సత్యాల గురించి ఉంటాయి, అవి నాలుగు ముఖాలకు ప్రాతినిధ్యం వహిస్తాయి! బుద్ధుని జీవితానికి సంబంధించిన ఈ సమర్పణ నిజంగా చదవదగిన వాస్తవాల పరంగా ఇవ్వబడలేదు, కానీ ప్రతి ప్రదర్శన యొక్క ఉపయోగం మరియు దాని ఉద్దేశ్యం గురించి తెలుసుకోవడానికి ఇది మనకు సహాయపడుతుంది. ఈ విచారణతో, ఈ విషయం గురించి మనం ఎక్కువ లోతైన అవగాహనను పొందవచ్చు.

సారాంశం

బుద్ధుని జీవితానికి మూడు రకాల కథలు ఉన్నాయి: థెరవాడ, మహాయాన సూత్రం మరియు తాంత్రిక ప్రదర్శనలు. ఈ ప్రెజెంటేషన్లు సంఘర్షణలో ఉన్నాయా లేదా అనే దానిపై చర్చలు ఉన్నాయి, కానీ లాజిక్ తో, ప్రతి ఒక్కటి వేర్వేరు సందర్భంలో బోధించబడ్డాయని మనం చూపించవచ్చు. ఈ విభిన్న ప్రదర్శనలు మనకు స్ఫూర్తిని ఇస్తాయి మరియు జ్ఞానాన్ని నేర్పుతాయి. బుద్ధుని కథను పరిశీలిస్తే, బాధల నుంచి విముక్తిని ఎలా పొందాలో కొన్ని పద్ధతులను వివరించే నమ్మకమైన వ్యవస్థ ఉన్న ఒక నిర్దిష్ట సమాజంలో అతను నివసించాడు. ఈ వ్యవస్థ పట్ల అసంతృప్తి చెందిన బుద్ధుడు, క్రమబద్ధంలో లేని వ్యవస్థలో సత్యాన్ని బోధించాలని కోరుకున్నాడు. తన ఇల్లు మరియు కుటుంబం యొక్క సౌకర్యాన్ని విడిచిపెట్టి, అతను తన అంతర్గత బాధలతో పోరాడటానికి ప్రయత్నించాడు. ఇది సన్యాస సాధన ద్వారా కాదు, ప్రపంచ బాధలకు సంబంధించిన కరుణ ద్వారా తీసుకోబడింది. బుద్ధుడు అనేక అడ్డంకులను ఎదుర్కున్నాడు, కానీ అవి అతన్ని అడ్డుకోలేదు మరియు అతను జ్ఞానోదయం పొందిన తర్వాత, అతను కరుణతో బోధించాలనే కోరికను నెరవేర్చాడు. బుద్ధుని అనుచరులకు, సన్యాసులు మరియు సన్యాసినులు ఇద్దరికీ సన్యాస పద్ధతులు సమాజానికి అనుగుణంగా స్థాపించబడిన నియమాలతో ఏర్పడటం జరిగింది.

Top