బుద్ధిపూర్వకత: దాగి ఉన్న మానసిక కారణాలు

బుద్ధిపూర్వకత యొక్క ప్రాక్టీస్ సాంప్రదాయ బౌద్ధమత సోర్స్ ల నుంచి వచ్చింది. వాటి నుంచి, దాని ప్రాక్టీస్ సంపూర్ణంగా ఉండటానికి బుద్ధిపూర్వకతతో పాటు అవసరమైన వివిధ మానసిక విషయాలను మనం నేర్చుకుంటాము. మానసిక విషయాలు ఒక వస్తువును దాని జ్ఞానానికి సహాయపడే మార్గాలు. వాటిలో ఆసక్తి లాంటి జ్ఞానాన్ని స్థాపించే అంశాలు ఉన్నాయి; ఏకాగ్రత లాంటి దాన్ని నిర్వహించడానికి సహాయపడే విషయాలు అవి; ప్రేమ లేదా కోపం లాంటి వాటికి రంగు వేసే భావోద్వేగాలు. మన బుద్ధిపూర్వకత ప్రాక్టీస్ లో వాటి సంబంధిత విషయాల గురించి తెలుసుకోవడం మరియు చేర్చడం ద్వారా మనం ఇంకా ఎక్కువ ప్రయోజనాన్ని పొందుతాము.

ఒత్తిడిని తగ్గించడానికి, నొప్పిని మేనేజ్ చెయ్యడానికి మరియు సాధారణంగా పని లేదా జీవితంతో వ్యవహరించడంలో ప్రభావాన్ని పెంచడానికి ఒక పద్ధతిగా ఆధునిక పాశ్చాత్య సమాజంలో "బుద్ధిపూర్వకత" యొక్క అభ్యాసం విస్తృతంగా స్వీకరించబడింది. వివిధ బౌద్ధమత ధ్యాన అభ్యాసాల నుంచి వచ్చిన ఈ బుద్ధిపూర్వకత శిక్షణ మన మనస్సులను శాంతపరచడం మరియు మన శ్వాస, ఆలోచనలు, భావోద్వేగాలు, ఆనందం లేదా విచారం యొక్క భావాలు, శారీరక అనుభూతులు మొదలైన వాటిని సరిగ్గా ఉండేలా చూసుకుంటుంది. తరచుగా, శిక్షణ ఇంకా సాధారణ పద్ధతులలో మన మనస్సులో ఎప్పుడూ మారుతున్న వస్తువుల యొక్క ప్రస్తుత క్షణాన్ని చూడటంగా ప్రదర్శించబడుతుంది.

Top