జీవితానికి కావలసిన బౌద్ధమత చిట్కాలు

How to tips for life ridwan meah unsplash

కొన్నిసార్లు మనం ఏదో కోల్పోయినట్టు మరియు జీవితంలోని కష్టాలను ఎలా ఎదుర్కోవాలో తెలియక మన పాజిటివ్ లక్ష్యాలను ఎలా సాధించాలో గందరగోళంలో ఉండిపోతాము. ఇతరులతో ఎలా సరిగ్గా ఉండాలో కూడా మనం ఆలోచిస్తూ ఉంటాం. సాంప్రదాయ బౌద్ధమత బోధనలను పరిశీలిస్తే, ఏ సంస్కృతిలోనైనా, ఏ సమయంలోనైనా, ఎవరికైనా ఉపయోగపడే ఆచరణాత్మక మార్గదర్శకాలు చాలా ఉంటాయి.

ఇతరులకు సహాయం చెయ్యడం కోసం మనం నేర్చుకోవాల్సిన లక్షణాలు

  • సహానుభూతి - మీ సమయం, సలహా, సహాయం మరియు ఆస్తులతో దీనిని పెంపొందించుకోవాలి.
  • సొంత-క్రమశిక్షణ - ఇతరుల కోసం మీకు కుదిరినట్లుగా సహాయం చేయడానికి ప్రవర్తించే లేదా మాట్లాడే చెడు మార్గాలను నివారించడం. 
  • సహనం - ఇతరులకు సహాయం చేయడంలో ఉన్న ఇబ్బందులలో, కోపం లేదా చిరాకు పడకుండా ఉండడం.
  • ధైర్యం మరియు ఓర్పు - పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నప్పటికీ ముందుకు సాగిపోతూ ఉండడం.
  • మానసిక మరియు భావోద్వేగ స్థిరత్వం - ఏకాగ్రతతో ఉండటం మరియు జీవితంలో పక్కదారి పట్టకుండా ఉండడం.
  • వివక్ష - ఏది సహాయకారి మరియు ఏది హానికరం, ఏది సముచితం మరియు ఏది అనుచితం అని తెలుసుకోవడం.

ఇతరులపై పాజిటివ్ ప్రభావాన్ని చూపే మార్గాలు

  • సహానుభూతితో ఉండడం - మీ సమయం, ఆసక్తి మరియు శక్తితో ఇది ఉండాలి.
  • దయతో మాట్లాడండి – మీరు చెప్పేది మాత్రమే కాకుండా, ఆ మాటలు ఇతరులను ఎలా ప్రభావితం చేస్తున్నాయో తెలుసుకోండి. 
  • అర్థవంతమైన రీతిలో మాట్లాడండి మరియు వ్యవహరించండి - వారి నిర్మాణాత్మక నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి ఇతరులను ప్రోత్సహించడం. 
  • ఒక మంచి ఉదాహరణను సెట్ చేసుకోండి - మీరు సలహా ఇచ్చిన దానిని ఆచరించడం ద్వారా.

మీ పాజిటివ్ లక్ష్యాలను సాధించే మార్గాలు

  • మీ లక్ష్యం గురించి స్పష్టంగా ఉండండి - అది వాస్తవికంగా ఉందని నిర్ధారించుకుని దానిని సాధించే వరకు మీ సామర్థ్యంపై నమ్మకాన్ని పెట్టుకోండి.
  • సొంత-క్రమశిక్షణను పాటించండి - పక్కదారి పట్టకుండా లేదా దానిని సాధించడానికి ఆటంకం కలిగించే ఏ పనిని చేయకుండా, లక్ష్యం పైనే దృష్టి పెట్టడం.
  • సహానుభూతితో ఉండండి - లక్ష్యం దిశగా పనిచేయడానికి మీ సమయం మరియు ప్రయత్నాన్ని ఆపకండి.
  • ఓపెన్ మైండెడ్ గా ఉండండి - మీ లక్ష్యాన్ని సాధించడంలో మీకు సహాయపడే విషయాలను నేర్చుకుంటూనే ఉండండి.
  • ఆత్మగౌరవాన్ని కాపాడుకోండి - మీ లక్ష్యాన్ని చేరుకోవడంలో ప్రమాదం కలిగించే అవమానకరమైన రీతిలో వ్యవహరించవద్దు.
  • శ్రద్ధను కొనసాగించండి - ఏదైనా బాధ్యతారహిత ప్రవర్తన మీ టీమ్ ని నెగెటివ్ గా ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకోండి.
  • జాగ్రత్తగా వివక్షతను చూపించండి - మీకు ఏది సహాయం చేస్తుంది మరియు ఏది మీ పురోగతికి ఆటంకం కలిగిస్తుందో తెలుసుకోండి.

మీ పాజిటివ్ లక్ష్యాలను సాధించడానికి మీకు కావలసిన లక్షణాలు

  • తృప్తిగా ఉండటం - వాస్తవిక లక్ష్యాన్ని సాధించడం, అవాస్తవికమైన దాని కోసం అత్యాశ లేకుండా ఉండటం.
  • ఇతరులతో విసుగు చెందకపోవడం, కోపంగా ఉండటం లేదా వ్యతిరేకతకు గురి కాకపోవడం - అనుకోకుండా ఏదైనా తప్పు జరిగితే
  • లక్ష్యంపై మీ దృష్టిని ఉంచడం - మీరు దానిని సాధించినప్పుడు అది కలిగించే ప్రయోజనాలపై దృష్టిని ఉంచడం కూడా.
  • మీ మనస్సును అనువుగా మార్చుకోవడం - ఏమి జరిగినా ప్రశాంతంగా ఉండటానికి మరియు భావోద్వేగ సమతుల్యతను ఉంచడానికి ప్రయత్నించడం.
  • ప్రతీదీ మారిపోతుందని ఎప్పుడూ గుర్తుంచుకోండి - మీరు ఏ మానసిక స్థితిలో ఉన్నా, మీ మానసిక మరియు భావోద్వేగ స్థితులు అలాగే శాశ్వతంగా ఉండవు. అవి ఎప్పుడూ మారుతూనే ఉంటాయి.
  • మనశ్శాంతిని కాపాడుకోవడం - మీ వంతు మీరు ప్రయత్నం చేస్తున్నారని తెలుసుకోవడం నుంచి.

మీ జీవితాన్ని నియంత్రించుకోవడానికి కావలసిన మార్గాలు

  • మీ స్వంత నిర్ణయాలు తీసుకోవడానికి శక్తి లేని స్థితిలోకి వెళ్లొద్దు - ఇది మీ సూత్రాలతో రాజీపడేలా చేస్తుంది మరియు మీరు పశ్చాత్తాపపడే పనులను చేస్తుంది.
  • మీరు ఏదైనా లైంగిక సంబంధంలో ఉంటే నమ్మక ద్రోహం చెయ్యకుండా ఉండండి - ఇది అనివార్యమైన సమస్యలకు దారితీస్తుంది.
  • ఎక్కువ బాధ్యతలతో ఉన్నత స్థానానికి వెళ్లాలని ప్రయత్నించవద్దు - ఇది మీ సమయం మరియు శక్తిని వాడేస్తుంది.
  • ఆరోగ్యకరమైన ఆహారం తినడం, ధూమపానం చేయకపోవడం మరియు వ్యాయామం చేయడం వంటి మీ పాజిటివ్ అలవాట్లను విడిచిపెట్టడానికి ఇతరులను ప్రభావితం చేయవద్దు - ఇది మీ ఆరోగ్యం మరియు శ్రేయస్సును దెబ్బతీస్తుంది.
  • మీరు సాధించలేని పనిని చేయడానికి ఎక్కువగా ప్రయత్నించకండి - ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయేలా చేస్తుంది.
  • నిర్లక్ష్యంగా ఉండటం మానుకోండి - ఇది కేవలం నెగెటివ్ సంఘటనలను తెచ్చిపెడుతుంది.

సవాళ్లతో కూడిన పరిస్థితులలో సమస్యలను ఎదుర్కోవడంలో మీకు సహాయపడే లక్షణాలు

  • ఎక్కువగా ఆసక్తి చెందకుండా ఉండడం - ప్రశంసించబడినప్పుడు లేదా విమర్శించబడినప్పుడు
  • ఇష్టం లేదా శత్రుత్వం పెంచుకోకుండా జాగ్రత్తగా ఉండడం - మీరు ఇష్టపడే లేదా మీకు నచ్చని వ్యక్తిని కలిసినప్పుడు.
  • మీ మంచి సూత్రాలకు విరుద్ధంగా ప్రవర్తించకపోవడం – మీరు సాధారణ పనులు చేస్తున్నప్పుడు
  • వస్తువుల విషయాలపై ఇష్టం పెంచుకోకపోవడం - అనేక ఆస్తులు లేదా ఎక్కువ సంపదలు ఉన్నప్పుడు, మీ ఉన్నత లక్ష్యాలను పట్టించుకోకపోవడం.
  • మిమ్మల్ని మీరు క్షమించుకోకపోవడం - అనారోగ్యంతో ఉన్నప్పుడు లేదా ఏదైనా నొప్పిని భరిస్తున్నప్పుడు, అంతర్గత బలం మరియు వ్యక్తిత్వాన్ని మరింత అభివృద్ధి చేయడానికి దీనిని ఒక పరిస్థితిగా ఉపయోగించడం.
  • మీ లోపాలను అధిగమించడం మరియు మీ పూర్తి పాజిటివ్ సామర్థ్యాన్ని గ్రహించడం - అన్ని సమయాల్లో.

Top