ఆత్మ మరియు బౌద్ధమత నిరాకరణ యొక్క సాంఖ్య మరియు న్యాయ వాదనలు

మిగతా భాషలు
ఆత్మ స్వభావానికి సంబంధించిన బౌద్ధమత వాదనలలో దేని గురించైనా ఖచ్చితమైన మరియు నిర్ణయాత్మకమైన అవగాహనను పొందడానికి ఒక పద్ధతి ఏమిటంటే, బౌద్ధ స్థితికి నిరాకరణలో ఉన్న "పూర్వ పక్షం" యొక్క వాదనలతో సవాలు చెయ్యడం, ఆ తర్వాత ఈ సవాళ్లకు సమాధానం ఇవ్వడం. ఇక్కడ "మరొక వైపు" అనేది నలంద లాంటి భారతీయ సన్యాస విశ్వవిద్యాలయాలలో బౌద్దులు చర్చించిన భారతీయ బౌద్ధేతర తత్వశాస్త్రాల వాదనలను సూచిస్తుంది. బౌద్ధమత స్థితిగతులను మనం ఏదో ఒక విధంగా తప్పుగా అర్థం చేసుకున్నామా, లేదా తెలియకుండానే ఈ "అవతలి వైపు" స్థానాలను కలిగి ఉన్నామా అని మనల్ని మనం పరీక్షించుకుని అవగాహనను పొందుతాము. ఉదాహరణకు, ఆత్మకు విషయాలు తెలుసని, కానీ చైతన్యం లాగా దీన్ని తెలుసుకోవడానికి ఇది సరైన మార్గం కాదని బౌద్ధమతం చెబుతుంది. ఆత్మ అనేది స్వతంత్రంగా ఉండేది అని, అది మనస్సు నుంచి వేరుగా మరియు ఏ వస్తువు లేకుండా నిష్క్రియాత్మక చైతన్యం మాత్రమేనని చెప్పడం ద్వారా సాంఖ్య దీన్ని సవాలు చేస్తుంది. న్యాయ దాన్ని ఒక స్పృహ లేని విషయంగా చెప్తుంది, కానీ అది అన్నిటిని తెలుసుకోవడానికి మనస్సును ఉపయోగిస్తుంది. ఈ సవాళ్లను ఎదుర్కొనేటప్పుడు మన అవగాహనను స్పష్టం చేసుకోవడానికి, బౌద్ధమత స్థితి ఈ రెండింటిలో ఎలా ఉంటుందో మనం వివరించాలి.

Top